Arjun Suravaram
Telangana: ఇటీవల కాలంలో చాలా మంది ఆన్ లైన్ గేమ్ లో బెట్టింగ్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే భారీగా అప్పులు చేసి..వాటిని తీర్చలేక అల్లాడిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా... మరికొందరు అప్పులు తీర్చేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.
Telangana: ఇటీవల కాలంలో చాలా మంది ఆన్ లైన్ గేమ్ లో బెట్టింగ్స్ పెడుతున్నారు. ఈ క్రమంలోనే భారీగా అప్పులు చేసి..వాటిని తీర్చలేక అల్లాడిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా... మరికొందరు అప్పులు తీర్చేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు.
Arjun Suravaram
ఇటీవల కాలంలో తక్కువ సమయంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలనుకునే వారు ఎక్కువయ్యారు. దీంతో కొందరు ఆన్ లైన్ గేమ్ లో బెట్టింగ్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భారీగా అప్పులు చేసి..వాటిని తీర్చలేక అల్లాడిపోతున్నారు. కొందరు ఆత్మహత్యలు చేసుకుంటుండగా… మరికొందరు అప్పులు తీర్చేందుకు కొత్త మార్గాలు ఎంచుకుంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి ఆన్ లైన్ గేమ్ లు ఆడి అప్పులపాలైన ఓ కేటుగాడు వాటిని తీర్చేందుకు కొత్తమార్గాన్ని ఎంచుకున్నాడు. చివరకు మహిళ అతడి భండారం బయటపెట్టింది. మరి.. ఎక్కడ జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…
ఖమ్మం జిల్లా ఎనుకూరు మండలం రాజలింగాల గ్రామానికి చెందిన నల్లమోతు సందీప్‌కుమార్ (38) కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ నగరంకి వచ్చాడు. ఈ క్రమంలో నగరంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మల్లంపేట్ నివాసముంటున్నాడు. ఇతడు రష్యాలో వైద్య విద్యను పూర్తి చేశాడు. కొన్నేళ్ల క్రితం నీలిమ అనే యువతితో ఆయనకు వివాహం జరిగింది. అయితే కొన్ని కారణాలతో ఇద్దరు విడాకాలు తీసుకున్నారు. ఇదే సమయంలో సందీప్ ఆన్ లైన్ గేమ్స్ లో బెట్టింగ్ పెట్టే అలవాటు ఉంది. అలా ఆన్ లైన్ గేమ్స్ ఆడే అలవాటున్న సందీప్ భారీగా నష్టపోయాడు. పెద్ద మొత్తంలో అప్పుల పాలయ్యాడు. అప్పులు ఇచ్చిన వారు తిరిగి ఇచ్చేయాలంటూ ఒత్తిడి తెస్తున్నారని సమాచారం.
ఈ క్రమంలోనే ఈ అప్పుల నుంచి బయట పడేందుకు పెళ్లిని మార్గంగా ఎంచుకున్నాడు. అతడి చెడు మార్గాన్నికి కుటుంబ సభ్యుల సహకారంతో మళ్లీ పెళ్లికి సిద్ధమయ్యాడు. తాను ఎన్టీఆర్ వైద్యవిశ్వవిద్యాలయం నుంచి రేడీయాలజిస్టు పూర్తి చేశానని, 2016లో ఐఏఎస్‌గా ఎంపికై కర్ణాటకలో పనిచేస్తున్నట్టు ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిం చి మ్యాట్రిమోనిలో తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇదే సమయంలో సందీప్ ఇచ్చిన సమాచారం నిజమని ఏపీలోని కర్నూల్ జిల్లా ఆదోని మండలం కుల్మాన్‌పేట గ్రామానికి చెందిన శ్రావణి అనే యువత అతడిని అప్రొచ్ అయ్యింది. సందీప్‌కుమార్ మాటలను నమ్మిన ఆ యువతి 2018లో అతడిని పెండ్లి చేసుకుంది. ఇక పెళ్లి సమయంలో శ్రావణి కుటుంబ సభ్యులు కట్నం కింద 8 ఎకరాల భూమిని రాసిచ్చారు. కొంతకాలంతో అప్పులు తీర్చేందుకు భార్యతో కొత్తనాటకానికి తెరతీశాడు.
తన బ్యాంక్ లాకర్‌లో రూ.40 కోట్లు నగదు ఉందని, ఇన్ కం ట్యాక్స్ చెల్లించనందున ఆ మొత్తం హోల్డ్‌లో ఉందని తెలిపాడు. ఆ నగదు విడుదల కావటానికి రూ.2 కోట్లు అవసరమని సందీప్ ..శ్రావణిని అడిగాడు. దీంతో అతడి మాటలు నమ్మి.. తెలిసిన వ్యక్తుల వద్ద నుంచి రుణం తీసుకుని భర్త, అతని సోదరి మోతుకూరి లక్ష్మి సాహితీ(35), మామ విజయ్‌కుమార్ (70), అత్త మాలతి(59) బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసింది. ఇదే సమయంలో తన పెళ్లి సమయంలో పెట్టిన గోల్డ్ ను కూడ కుదువబెట్టడంతో శ్రావణికి అనుమానమొచ్చి నిలదీసింది. ఈ నేపథ్యంలో వారిద్దరి మధ్య గొడవలు జరిగి.. చివరకు శ్రావణి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితులను అరెస్టు చేశారు. పోలీసులు అమెరికాలో ఉన్న సాహితి మినహా కుటుంబసభ్యులందరినీ అరెస్టుచేసి బుధవారం రిమాండ్‌కు తరలించారు. అలా అప్పులు తీర్చేందుకు పెళ్లి మార్గాన్ని ఎంచుకున్న ఈ వ్యక్తి..చివరకు ఆ యువతి చేసిన పనికి జైలు పాలయ్యాడు.