Arjun Suravaram
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రేమ కారణంగా అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ లవ్ కారణంగా హత్యలు, ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి. తాజాగా ఈ ప్రేమ వ్యవహారానికి ఓ యువతి బలైంది.
నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రేమ కారణంగా అనేక ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఈ లవ్ కారణంగా హత్యలు, ఆత్మహత్యలు అనేవి జరుగుతున్నాయి. తాజాగా ఈ ప్రేమ వ్యవహారానికి ఓ యువతి బలైంది.
Arjun Suravaram
ప్రస్తుత సమాజంలో ప్రేమ పేరుతో జరుగుతున్న దారుణలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. ఈ లవ్ ఎఫైర్స్ కారణంగా హత్యలు, ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కొందరు ప్రేమ పేరుతో యువతలను లోబర్చుకుంటారు. ఆ తరువాత వివిధ కారణాలు చెప్పి..వారి నుంచి దూరంగా జరుగుతారు. ఇక తాము ప్రేమ పేరుతో మోసపోయామని తెలిసి తీవ్ర మనస్తాపానికి గురై..ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. అలానే ఓ యువతి కూడా ప్రేమ పేరుతో మోసపోయననే మనస్తాపంతో నిండు జీవితాన్ని బలి చేసుకుంది.
నాగర్ కర్నూలు జిల్లా కోడేరు మండలం నాగులపల్లితండాకు చెందిన మీటూనాయక్, బిచ్చాలి దంపతులకు కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు సంతానంగా ఉన్నారు. పెద్ద కుమార్తె జ్యోతి (25) హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తోంది. నాలుగేళ్ల కిందట సూర్యపేట జిల్లా ఆత్మకూర్‌కు చెందిన కారు డ్రైవర్ వీరబాబు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. ఆ తరువాత వారు స్నేహితులుగా మారారు. చివరకు వారి పరిచయం కాస్తా ప్రేమించుకునే వరకు వెళ్లింది. అలా వారిద్దరు కొన్నేళ్ల పాటు ప్రేమించుకున్నారు. అలానే జ్యోతి, వీరబాబు ఇద్దరూ కలసి ఒకే గదిలో ఉంటున్నారు. ఈ విషయం ఇరు కుటుంబాల్లో తెలిసింది. ఏడాది నుంచి కుటుంబికులు పెళ్లి చేసుకోవాలని వీరబాబును కోరారు.
జ్యోతిని పెళ్లి చేసుకునేందుకు మొదట్లో అంగీకరించాడు. అయితే ఇటీవల నెల రోజుల నుంచి కట్నం కావాలని ఆ యువకుడు కోరాడు. అలా కట్నం ఇవ్వలేని పక్షంలో గ్రామంలోని కొంత పొలం రాసి ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇలా జరుగుతున్న క్రమంలో యువతి ఏప్రిల్ 6వ తేదీన నాగులపల్లితండాకు వచ్చింది. ఈక్రమంలోనే రోజు ఫోనులో యువతిని ఒత్తిడి చేస్తుండటంతో వేధింపులు తట్టుకోలేక మనస్తాపానికి గురైందని ఆమె బంధువులు తెలిపారు. శుక్రవారం ఇంట్లో ఎవరు లేని సమయంలో జ్యోతి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. కుటుంబ సభ్యులు వచ్చి చూసేసరికి జ్యోతి విగతిజీవిగా మారింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకున్నారు. అనంతరం వివరాలు సేకరించారు. తండ్రి ఫిర్యాదు మేరకు వీరబాబుపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.