iDreamPost
android-app
ios-app

గది నుంచి బయటకు రాని యువతి! ఫ్రెండ్ వెళ్లి చూడగా ఆ స్థితిలో!

Hyderabad: జీవితంపై ఎన్నో ఆశలతో యువతి నగరానికి వెళ్లింది. అక్కడే ఓ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఆమెపై విధి కన్నెర్ర చేసింది. దీంతో ఆ యువతి కుటుంబంలో విషాదం అలుముకుంది.

Hyderabad: జీవితంపై ఎన్నో ఆశలతో యువతి నగరానికి వెళ్లింది. అక్కడే ఓ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తుంది. ఇలాంటి సమయంలో ఆమెపై విధి కన్నెర్ర చేసింది. దీంతో ఆ యువతి కుటుంబంలో విషాదం అలుముకుంది.

గది నుంచి బయటకు రాని యువతి! ఫ్రెండ్ వెళ్లి చూడగా ఆ స్థితిలో!

ఓ 20 ఏళ్ల యువతి జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. కుటుంబాన్ని ఆర్థికంగా సాయపడాలని నగరానికి వచ్చి..ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా ఉద్యోగం చేస్తుంది. ఇలా సాగిపోతున్న ఆమె జీవితంలో శుక్రవారం అనుకోని విషాదం చోటుచేసుకుంది. అంతేకాక డ్యూటీ టైమ్ అవుతున్న గది నుంచి యువతి బయటకు రాకపోవడంతో.. ఆమె స్నేహితుడు వెళ్లాడు. ఆ యువతిని ఊహించని స్థితిలో చూసి షాకి గురయ్యాడు. ఈ ఘటన హైదరాబాద్ నగరంలోని ఖైరతాబాద్ ప్రాంతంలో చోటుచేసుకుంది. అసలు ఏం, జరిగింది, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం…

కరీంనగర్ జిల్లాకు చెందిన కె.సౌమ్య(20)కొత్తకాలం క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చింది. సిటీలోని ఖైరతాబాద్ ప్రాంతంలో ఆ యువతి నివాసం ఉంటుంది. అలానే అక్కడే ఉన్న వాసవీ అనే ఓ ప్రైవేటు ఆస్పత్రిలో నర్సుగా పని చేస్తుంది. ఇలా  చాలా కాలం నుంచి ఆస్పత్రిలో నర్సుగా విధులు నిర్వహిస్తుంది. తోటి వారితో ఎంతో కలివిడిగా ఉంటు మంచి పేరు తెచ్చుకుంది. ఇది ఇలా ఉంటే.. శుక్రవారం సౌమ్య..తన ఫ్రెండ్స్ కి ఊహించని షాకిచ్చింది.

శుక్రవారం సాయంత్రం సౌమ్య డ్యూటికి వెళ్లాల్సి ఉంది. అయితే డ్యూటీ టైమ్ దాటిపోయిన ఆ యువతి ఇంకా ఆస్పత్రికి వెళ్లలేదు. దీంతో అనుమానం వచ్చిన  ఆమె స్నేహితుడు ప్రశాంత్ సౌమ్యకు ఫోన్  చేశాడు. అయినా కూడా సౌమ్య వైపు నుంచి ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అతడు రాత్రి 7.30 గంటల ప్రాంతంలో ఆమె రూమ్ కి వచ్చాడు. తలుపును తట్టగా తీయలేదు. దీంతో స్థానికుల సాయంతో తలుపులు తెరిచి చూడగా..రూమ్ లోని బాత్ రూమ్ లో సౌమ్య ఊహించని స్థితిలో పడి ఉంది. హీటర్ మీదపడి  సౌమ్య అచేతనంగా కనిపించింది. ఇక షాక్ కి గురైన ఆమె స్నేహితుడు వెంటనే హీటర్ స్విచ్ ఆఫ్ చేసి.. ఆమెను  ఆస్పత్రికి తరచించాడు. అయితే అక్కడ సౌమ్యను పరిశీలించిన వైద్యులు..ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు.  ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.

గదిలోని హీటర్ స్విచ్ ఆన్ చేసి బకెట్ లో పెట్టే క్రమంలో షార్ట్ సర్క్యూట్ జరిగిందని, ఆ కారణంతోనే ఆ యువతి మృతి చెంది ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. మృతురాలి శరీరంపై హీటర్ వల్ల కాలిన గాయాలు ఉన్నాయి. ఇక మృతురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి..దర్యాప్తు చేస్తున్నారు. ఇక సౌమ్య మృతితో ఆమె ఇంట విషాధఛాయలు అలుముకున్నాయి. ఇలా హీటర్ల కారణంగా ఎంతో మంది మృత్యువాతపడ్డారు. అందుకే ఎలక్ట్రిక్ వస్తువులను వినియోగించే సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని వైద్యులు, ఇతర నిపుణులు చెబుతుంటారు.