Arjun Suravaram
ఇటీవల కాలంలో పరీక్ష ఫైయిల్, ప్రేమ విఫలం, ఆర్థిక సమస్య వంటి అనేక కారణాలతో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరిగింది. జీవితం విలువ తెలియజక చిన్న చిన్న సమస్యలకే జీవితాన్ని అర్దాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ విషాదం చోటుచేసుకుంది.
ఇటీవల కాలంలో పరీక్ష ఫైయిల్, ప్రేమ విఫలం, ఆర్థిక సమస్య వంటి అనేక కారణాలతో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరిగింది. జీవితం విలువ తెలియజక చిన్న చిన్న సమస్యలకే జీవితాన్ని అర్దాంతరంగా ముగిస్తున్నారు. తాజాగా ఓ విషాదం చోటుచేసుకుంది.
Arjun Suravaram
జీవితం అనేది చాలా విలువైనది. అంతేకాక చాలా అరుదుగా లభించేది ఈ మనిషి జన్మ. అందుకే ఈ లైఫ్ ను ఎంతో ధైర్యంగా, సంతోషంగా సాగించాలి. సముద్రంలోఅలలు వచ్చిపోయినట్లు, జీవితంలోకి కష్టాలు వచ్చివెళ్తుంటాయి. అలాంటి సమస్యలకే ఎంతో గొప్ప జీవితాన్ని అర్ధాంతరం ముగించడం కరెక్ట్ కాదు. అయితే నేటికాలంలో మనిషిలో ఆత్మవిశ్వాసం, సమస్యలపై పోరాడే ధైర్యం లేకుండా పోయింది. దీంతో చావే పరిష్కారంగా భావిస్తుంటారు. తాజాగా ఓ కుటుంబంలోన తల్లికుమార్తెలు దారుణమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో భవిష్యత్ లో ఎంతో ఉన్నత స్థితికి వెళ్లాల్సిన యువతి మృత్యువు ఒడికి చేరింది. ఈ విషాద ఘటన కుమురంభీం జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…
ప్రతి కుటుంబంలో సమస్యలకు, కలహాలు అనేవి సహజం. కానీ కొందరి ఇళ్లలో ఈ సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక సమస్యలు, ఇతర వేరే సమస్యల కారణంగా కుటుంబంలో గొడవలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో కొందరు క్షణికావేశానికి లోనై..దారుణ నిర్ణయం తీసుకుంటారు. కుటుంబ సభ్యులను హత్య చేయడం లేదా తామే ఆత్మహత్య చేసుకోవడం వంటివి చేస్తుంటారు. తాజాగా అలాంటి ఘటనే కుమురంభీం జిల్లాలో చోటుచేసుకుంది.
కుమురంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలోని గజ్జిగూడ గ్రామానికి చెందిన అనిత(45) తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటుంది. ఆమెకు ముగ్గురు కుమార్తెలు. రమ్య(16), లక్ష్మీ, ఐశ్వర్య అనే కుమార్తెలు ఉన్నారు. కొంతకాలంగా వారి ఇంట్లో గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ కుటుంబ కలహాల నేపథ్యంలో సోమవారం తల్లిముగ్గురు కుమార్తెలు ఆత్మహత్యయత్నం చేశారు. స్థానికులు గుర్తించి వెంటే ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఈ క్రమంలోనే అనిత, రమ్య చికిత్స్ పొందుతూ బుధవారం మృతి చెందారు. ఇక మిగతా ఇద్దరు కుమార్తెలు లక్ష్మీ, ఐశ్వర్యలు సైతం మృత్యువుతో పోరాడుతున్నారు. రమ్య, అనితల మృతితో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఏదైనా సమస్యలు ఉంటే పరిష్కరించుకోవాలే కానీ ఇలా చనిపోవడం అనేది పరిష్కారం కాదని పలువురు అభిప్రాయా పడుతున్నారు. ఇటీవల కాలంలో పరీక్ష ఫైయిల్, ప్రేమ విఫలం, ఆర్థిక సమస్య వంటి అనేక కారణాలతో ఆత్మహత్య చేసుకునే వారి సంఖ్య పెరిగింది. జీవితం విలువ తెలియజక చిన్న చిన్న సమస్యలకే జీవితాన్ని అర్దాంతరంగా ముగిస్తున్నారు. ముఖ్యంగా యువత క్షణికావేశంలో ఆత్మహత్య నిర్ణయం తీసుకుని తల్లిదండ్రులకు తీరని ఆవేదనను మిగుల్చుతున్నారు. ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాల్సిన యువత కొందరు.. వివిధ రకాల ఒత్తిడులకు తట్టుకోలే..మరణమే శరణంగా భావిస్తున్నారు. అందుకు ఉదాహరణ తాజాగా కాగజ్ నగర్ లో జరిగిన విషాద ఘటన.