Arjun Suravaram
నేటికాలంలో యువతలో ఆత్మస్థైర్యం అనేది కొరవడుతుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతుంటారు. ఈ క్రమంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. బయటకు వెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు ఓ యువతి షాకిచ్చింది.
నేటికాలంలో యువతలో ఆత్మస్థైర్యం అనేది కొరవడుతుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతుంటారు. ఈ క్రమంలో దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. బయటకు వెళ్లి తిరిగొచ్చిన తల్లిదండ్రులకు ఓ యువతి షాకిచ్చింది.
Arjun Suravaram
నేటికాలంలో యువతలో ఆత్మస్థైర్యం అనేది కొరవడుతుంది. అందుకే ప్రతి చిన్న విషయానికి కంగారు పడిపోతుంటారు. అంతేకాక జీవితంలో ఎదురై చిన్న చిన్న సమస్యలకు ఎంతో కంగారు పడిపోతుంటారు. ఇక తమ సమస్యలకు పరిష్కారమే లేదు అన్నట్లు మానసికంగా కుంగిపోతుంటారు. ఈ క్రమంలోనే ఇటీవల కాలంలో కొందరు యువత తమ సమస్యలకు చావే పరిష్కారంగా భావించి దారుణ నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలానే తాజాగా ఓ యువతి చేసిన పనికి ఆమె తల్లిదండ్రులకు విషాదం నింపింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
ఖమ్మం జిల్లా జూలురు పాడుకు చెందిన బోగిన్ని వెంకటేశ్వర్లు అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆయన పెద్ద కుమార్తె బిందు(21) ఓ ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సం చదువుతోంది. వేపలగడ్డలో ఉన్న ఆ ఇంజనీరింగ్ కాలేజీలో బిందు చదువుతోంది. చివరి ఏడాది చదువోతున్న బిందు..మరికొద్ది రోజుల్లో జాబ్ చేస్తుందని అందరు భావించారు. అలానే ఆమె తల్లిదండ్రులు కూడా కుమార్తెపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే బిందు దారుణ నిర్ణయం తీసుకుంది. అసలు తమకు కుమార్తె తీసుకున్న నిర్ణయానికి బిందు తల్లిదండ్రులు షాక్ గురయ్యారు.
శుక్రవారం ఉదయం వెంకటేశ్వర్ దంపతులు పని మీద బయటకు వెళ్లారు. ఇక తల్లిదండ్రులు ఇంట్లోని సమయంలో బిందు దారుణానికి ఒడిగట్టింది. ఇంట్లో తల్లిదండ్రులులేని సమయంలో బిందు ఉరేసుకుంది. బయటకు వెళ్లిన తండ్రి ఇంటికి తిరిగొచ్చి తలుపు తీసి చూడగా బిడ్డను ఆస్థితిలో చూసి షాకయ్యారు. ఇనుప కడ్డీకి ఉరి వేసుకుని కూతురు వేలాడుతూ కనిపించింది. ఈ తమకు అండగా ఉంటాదని అనుకున్న కుమార్తె ఇలాంటి ఘోరమైన నిర్ణయం తీసుకోవడంతో మృతురాలి తల్లిదండ్రుల గుండెలు పగిలాలే రోధించారు. అయితే బిందు మృతికి కారణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడి చేరుకున్నారు.
ఇటీవల కాలంలో విద్యార్థులు, యువత ఆత్మహత్య చేసుకునే ఘటనలు పేరెంట్స్ ను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవలే విడుదలైన పదో తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణత సాధించలేదని సూసైడ్ చేసుకున్నారు. పసిపిల్లలు కూడా ఆత్మహత్యకు పాల్పడుతుండటం అందరిలో ఆందోళన కలిగిస్తుంది. ఇంకా దారుణం ఏమిటంటే..చదువుల్లో టాపర్లుగా ఉన్నవాళ్లు.. చదువుల్లో ఎన్నో కష్టాలు ఎదిరించి నిలబడిన చాలా మంది.. కొన్ని విషయాల్లో ఒత్తిడి తట్టుకోలేక చావే పరిష్కారంగా భావిస్తున్నారు. ఐఐటీలు, సాఫ్ట్ వేరు ఉద్యోగాలు వంటి మంచి స్థితిలో ఉన్న వారు కూడా జీవితాలను అర్ధాంతరంగా ముగిస్తున్నారు. ఈ క్రమంలో చదువులు కంటే ముఖ్యంగా మనిషికి జీవితంలోసమస్యపై పోరాడే శక్తిని పెంచుకోవాలని పలువురు మేధావులు సూచిస్తున్నారు. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం ఉంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కొని జీవితంలో విజయం సాధించవచ్చు. లేకుంటే.. బిందు యువతిలాగా తల్లిదండ్రులకు కడుపుకోత నింపుతుంటారు.