P Krishna
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో వరుస రోడ్డు ప్రమాదాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. అతివేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు అంటున్నారు.
P Krishna
ఈ కాలంలో మనిషి తన స్వార్థం తనే చూసుకుంటున్నాడు.. ఎదుటి వారి గురించి పట్టించుకోవడం లేదు అని చాలా మంది అంటుంటారు. కానీ ఎదుటి వారి కోసం తమ ప్రాణాలు సైతం రిస్క్ లో పెట్టి కాపాడుతుంటారు. ప్రకృతి విపత్తు సమయంలో రెస్క్యూ టీమ్స్ చేసే సాహసాలు, బార్డర్ లో సైనికులు చేసే త్యాగాల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అగ్ని ప్రమాదాలు, నీటిలో మునిగేవారిని కాపాడబోయి తమ ప్రాణాలు కోల్పోయిన వారు ఎంతో మంది ఉన్నారు.. అపాయం అని తెలిసినా ఎదుటి వారి ప్రాణాలు రక్షించే ప్రయత్నంలో తమ ప్రాణాలు కోల్పోతున్నారు. అలాంటి ఘటనే ఒకటి నాగర్ కర్నూల్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ వ్యక్తి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అది గమనించిన మరో యువకుడు అతన్ని కాపాడేందుకు వెళ్తున్న సమయంలో గుర్తు తెలియని వాహనం తన్ని ఢీ కొట్టడంతో అతడి ప్రాణాలు పోయాయి. మానవత్వంతో అతడిని మృత్యువులా వెంటాడింది. రోడ్డు ప్రమాదాలు ఇద్దరు యువకుల జీవితాలు ఛిద్రం చేసింది. నాగర్ కర్నూల్.. మార్చాల సమీపంలో గురువారం ఈ దర్ఘటన జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కల్వకుర్తి పట్టణంలోని ఇందిరా నగర్ కి చెందిన నవాజ్, వయసు 25 సంవత్సరాలు టైలరింగ్ చేస్తూ జీవిస్తున్నాడు. ఏడాది కింద నవాజ్ కి వివాహం జరిగింది. పది రోజుల క్రితమే పాప జన్మించింది. తన కుమార్తెను చూసేందుకు అత్తగారు ఉరైన జడ్చర్లకు వెళ్తున్నాడు. అక్కడ నుంచి రాత్రి కల్వకుర్తికి బయల్దేరాడు.
నవాజ్ కల్వకుర్తికి బయలు దేరే సమయంలో హాలియా నుంచి కొత్తపేట.. కనిమెట్టకు వెళ్తున్న ఓ కంపెనీ పాల వ్యాన్ హెల్పర్ అశోక్ ప్రమాదానికి గురై ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. అది గమనించిన నవాజ్ మానవత్వంతో అశోక్ ని కాపాడాలని అనుకున్నాడు. రోడ్డు దాటుతున్న సమయంలో వేగంగా వెళ్తున్న గుర్తు తెలియని వాహనం నవాజ్ ని ఢీ కొట్టింది. అంతే ప్రమాదంలో నవాజ్ కి తీవ్ర గాయాలు కావడంతో అతడు కన్నుమూశాడు. ఇలా ఇద్దరు రోడ్డు ప్రమాదంలో మృత్యువడిలోకి చేరుకున్నారు. ఈ విషయం స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. హాస్పిటల్ వద్ద ఇరువురి కుటుంబ సభ్యుల రోధనలు మిన్నంటాయి. పాలవ్యాన్ డ్రైవర్ ఫిర్యాదు మేరుకు కేసే నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.