iDreamPost
android-app
ios-app

విధులకు వచ్చిన కొన్ని గంట్లలోనే కుప్పకూలిన నర్సు.. చివరకు

కృష్ణవేణి.. రోజులానే సోమవారం కూడా విధులకు హాజరయ్యింది. ఆమె ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంగా పని చేస్తుంది. అయితే విధులకు వెళ్లిన కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక...

కృష్ణవేణి.. రోజులానే సోమవారం కూడా విధులకు హాజరయ్యింది. ఆమె ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంగా పని చేస్తుంది. అయితే విధులకు వెళ్లిన కొన్ని గంటల్లోనే కుప్పకూలిపోయింది. ఏం జరిగిందో అర్థం కాక...

విధులకు వచ్చిన కొన్ని గంట్లలోనే కుప్పకూలిన నర్సు.. చివరకు

పిడికెడు గుండె ప్రాణాలు తీస్తుంది. ఉన్న పళంగా మెలి పెడుతూ.. బాధ నింపుతూ ఒక్కసారిగా మనుషులను హరించేస్తుంది. ఆనందంలోనూ, దు:ఖంలోనూ.. సమయం, సందర్భం లేకుండా హార్ట్ ఎటాక్ మానవ జీవితాలతో ఆటలాడుతోంది. చిన్న వయస్సు నుండి కాటికి కాలు చాపే ముదసలి వరకు ఎంతో మందిని బలి తీసుకుంది గుండె పోటు. చూస్తుండగానే కుప్పకూలిపోతున్నారు. ఏం జరిగిందో ఊహించే లోపు కానరాని లోకాలకు తరలి వెళ్లిపోతున్నారు. ధనిక, పేద అని చూడటం లేదు.. సామాన్యుడు, సెలబ్రిటీ అన్న వ్యత్యాసం లేదు దీనికి. అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకపోయినప్పటికీ చటుక్కున వచ్చి ప్రాణం తోడేసి.. చంపేస్తుంది హార్ట్ స్ట్రోక్. మొన్న ఉద్యోగ విధుల్లో ఉన్న బ్యాంక్ యజమానిని హరించేసింది.

తాజాగా విధులు నిర్వరిస్తున్న మరో ఉద్యోగినిని బలితీసుకుంది గుండెపోటు. నిల్చున్న చోట కూలబడిపోయింది మహిళ. గుండె పోటుతో ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఈ ఘటన తెలంగాణలోని మహబూబ్ నగర్ జిల్లాలో చోటుచేసుకుంది. నవాబు పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సోమవారం ఉదయం తీవ్ర విషాదం నెలకొంది. ఔట్ సోర్సింగ్ ఏఎన్ఎంగా విధులు నిర్వర్తిస్తున్న కృష్ణవేణి అప్పటికప్పుడే అస్వస్థతకు గురైంది. ఉన్నపళంగా కూలబడిపోయింది. వెంటనే అక్కడ సిబ్బంది ఆమెకు ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆసుపత్రికి తరలించగా.. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో ఆమెతో పనిచేసే సిబ్బంది దిగ్బ్రాంతికి వ్యక్తం చేశారు.

సోమవారం యధావిధిగా విధులకు వచ్చింది కృష్ణవేణి. అయితే నిలబడగా.. కాస్తంత నలతగా అనిపించింది. అంతే నిల్చున్న చోటనే కూలబడిపోయింది. అక్కడే విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మండల వైద్యాధికారి డాక్టర్ నరేష్ చంద్రకు సమాచారం అందించారు. ఆయన ఆమెకు ప్రథమ చికిత్సలు నిర్వహించి మెరుగైన వైద్య చికిత్స కోసం మహబూబ్ నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ఆమెను పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మరణించినట్లు నిర్ధారించారు. అప్పటి వరకు తమతో ఉన్న మనిషి ఇక లేదని తెలిసే సరికి ఆసుపత్రి వైద్య సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైద్యులు, వైద్య సిబ్బంది అందరూ అందుబాటులో ఉన్నా ఆమెను కాపాడుకోలేకపోయామని బాధపడ్డారు. ఆమెకు భర్త, కొడుకు ఉన్నట్లు తెలుస్తోంది.