P Krishna
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదవ తరగతి పరీక్ష సందర్భంగా ఓ సంఘటన అందరి హృదయాలను కలచివేసింది.
తెలంగాణలో పదవ తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పదవ తరగతి పరీక్ష సందర్భంగా ఓ సంఘటన అందరి హృదయాలను కలచివేసింది.
P Krishna
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో పదో తరగతి పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా కేంద్ర వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు సందడి మొదలైంది. ఏపీలో పరీక్షా కేంద్రానికి ఒక్క నిమిషం నిబంధన ఉండటంతో విద్యార్థులు పరుగులు పెడుతున్నారు. తెలంగాణలో పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు 5 నిమిషాలు అదనంగా గ్రేస్ టైమ్ ఇచ్చారు. దీంతో ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అధికారులు విద్యార్థులను పరీక్షా కేంద్రానికి అనుమతించారు. పదవ తరగతి పరీక్ష సందర్భంగా ఓ విషాద ఘటన దిగ్బ్రాంతికి గురిచేసింది. ఓ విద్యార్థిని పుట్టెడు దుఖఃంతో పరీక్ష రాసేందుకు హాజరు కావడం అందరి హృదయాలను కలచి వేసింది. అసలేం జరిగిందంటే..
కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ లో సోమవారం ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని తండ్రి హఠాత్తుగా కన్నుమూయడంతో పుట్టెడు దుఖఃంతో ఎగ్జామ్ రాసేందుకు వెళ్లింది. ఈ ఘటన స్థానికంగా అందరి హృదయాలను కలచి వేసింది. ఈ ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. దండు శ్రీను వృత్తి రిత్యా గ్రామ పంచాయతీ కార్మికుడు. ఆయన కూతురు దండు స్రవంతి. తన కూతురు పదవ తరగతిలో మంచి గ్రేడ్ సంపాదించాలని మొదటి నుంచి అన్ని రకాలుగా ప్రోత్సహిస్తూ వచ్చాడు శ్రీను. సోమవారం పదవ తరగతి పరీక్ష.. ఈ సందర్భంగా కూతురికి కావాల్సిన ప్యాడ్, పెన్నూ తదితర వస్తువులు తెచ్చి పరీక్షలు బాగా రాయాలని ఆశీర్వదించాడు.
పరీక్షకు ప్రిపేర్ అవుతూ ఉన్న స్రవంతికి పక్క గది నుంచి ఒక్కసారే ఏడుపు శబ్ధం రావడంతో వెళ్లి చూడగా తండ్రి గుండెపోటుతో మరణించిన విషయం తెలిసింది. అంతే ఒక్కసారిగా స్రవంతి గుండె పగిలింది. పరీక్షలు బాగా రాసి మంచి గ్రేడ్ సంపాదించుకోవాలని ఆశీర్వదించిన తండ్రి కానరాని లోకాలకు వెళ్లడంతో స్రవంతి హృదయం తల్లడిల్లిపోయింది. తండ్రి పోయిన ఆవేదన ఉన్నప్పటికీ ఆయన కోరిక తీర్చేందుకు పరీక్ష రాసేందుకు సిద్దమైంది. తండ్రి పోయిన విషాదాన్ని గుండెల్లో పెట్టుకొని పుట్టెడు దుఖఃంతో కన్నీరు కారుస్తూ పరీక్షకు హాజరైంది. ఓ పక్క తండ్రి చనిపోయినా.. ఆ బాధను దిగమింది పరీక్ష రాసేందుకు వెళ్లిన విద్యార్ధినిని అందరూ ఓదార్చారు.