iDreamPost
android-app
ios-app

బంగారు భవిష్యత్.. ఆ విద్యార్థిని తీసుకున్న నిర్ణయంతో..

  • Published Feb 15, 2024 | 9:42 AM Updated Updated Feb 15, 2024 | 9:42 AM

Hyderabad Crime News: ఈ మద్య కొంతమంది విద్యార్థులు బంగారు భవిష్యత్ ని చేతులారా దూరం చేసుకుంటున్నారు. చిన్న విషయానికే మనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

Hyderabad Crime News: ఈ మద్య కొంతమంది విద్యార్థులు బంగారు భవిష్యత్ ని చేతులారా దూరం చేసుకుంటున్నారు. చిన్న విషయానికే మనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు.

బంగారు భవిష్యత్.. ఆ విద్యార్థిని తీసుకున్న నిర్ణయంతో..

దేవుడిచ్చిన జీవితాన్ని సంతోషంగా గడపాలని ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ ఈ మధ్య కొంతమంది చిన్న విషయాలకే డిప్రేషన్ లోకి వెళ్లి సంచలన నిర్ణయం తీసుకుంటున్నారు. ఆర్థిక, కుటుంబ తగాదాలు, అనారోగ్య పరిస్థితులు, వివాహేతర సంబంధాలు, ప్రేమ వ్యవహారాలు ఇలా ఎన్నో కారణాల వల్ల నిత్యం ఎక్కడో అక్కడ మరణ వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పిల్లల్ని చదివిస్తున్నారు. కొంతమంది ర్యాంకులు రావడం లేదని మనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఇటీవల అనారోగ్యానికి గురైంది. ఆ కారణంతోనే మనస్థాపానికి గురై తీవ్ర నిర్ణయం తీసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ లో దారుణ ఘటన చోటు చేసుకుంది. దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్ల బస్తీలో ఇంటర్ చదువుతున్న విద్యార్థిని ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పపడటం సంచలనం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకాకం.. భీమ్ రాజ్ దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఒక కుమారుడు ఉన్నారు. నికిత (17) నారాయణగూడలోని ఓ కాలేజ్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. ఇటీవల నిఖిత తీవ్ర అనారోగ్యానికి గురైంది. ఈ క్రమంలోనే ఆమెకు తల్లిదండ్రులు ట్రీట్ మెంట్ చేయిస్తున్నారు. అనారోగ్యంతో మనస్థాపానికి గురైన నికితకు ఎంత ఖర్చయినా బాగు చేయిస్తామని తల్లిదండ్రులు ధైర్యం చెబుతూ వచ్చారు.

తల్లిదండ్రులు ఉద్యోగాలకు  వెళ్లగా మంగళవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో కిటికీ గ్రిల్ కి తన చున్నీతో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పపడింది. కుటుంబ సభ్యులు వచ్చి చూడగా నిఖిత ఉరివేసుకొని కనిపించడంతో షాక్ కి గురయ్యారు. వెంటనే దోమలగూడ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు నికితను వెంటనే ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె చనిపోయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అక్కడ నుంచి మృతదేహాన్ని పోస్ట్ మార్టం తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు నికిత అనారోగ్యంతో బాధపడుతూ ఆత్మహత్యకు పాల్పడినట్లు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.