Arjun Suravaram
19 రోజుల క్రితం ఓ దంపతులు తమ కుమార్తెకు అంగరంగవైభవంగా పెళ్లి చేశారు. ఎంతో సంతోషంగా అత్తింటికి తమ కుమార్తెను సాగనంపారు. అయితే వారి ఆనందం మూడునాళ్ల ముచ్చట మారింది. పెళ్లైన 19 రోజులేక ఆ వధువు.. కుటుంబ సభ్యులకు షాకిచ్చింది.
19 రోజుల క్రితం ఓ దంపతులు తమ కుమార్తెకు అంగరంగవైభవంగా పెళ్లి చేశారు. ఎంతో సంతోషంగా అత్తింటికి తమ కుమార్తెను సాగనంపారు. అయితే వారి ఆనందం మూడునాళ్ల ముచ్చట మారింది. పెళ్లైన 19 రోజులేక ఆ వధువు.. కుటుంబ సభ్యులకు షాకిచ్చింది.
Arjun Suravaram
అన్ని జన్మల్లో కెల్ల అతి ముఖ్యమైనది, గొప్పది మానవ జన్మ. అందుకే మానవ జన్మ దుర్లభమైనది అని పెద్దలు చెబుతుంటారు. అయితే నేటికాలంలో కొందరికి జీవితం విలువ తెలియడం లేదు. అందుకే ప్రతి చిన్న కారణానికి దారుణైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ముఖ్యంగా యువత ఆత్మహత్య చేసుకోవడం ఆందోళన కలిగిస్తుంది. ఎంతో జీవితాన్ని అనుభవించాల్సిన వాళ్లు..చిన్న చిన్న కారణాలతో ఆత్మహత్యలు చేసుకుని కుటుంబాల్లో విషాదం నింపుతున్నారు. అలానే తాజాగా పెళ్లైన 19 రోజులకే ఓ నవ వధువు కూడా నిండు నూరేళ్ల జీవితాన్ని బలి చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం..
తెలంగాణ రాష్ట్రం ములుగు జిల్లా మంగపేట మండలం కమలాపురం గ్రామానికి చెందిన కోమలిక(20) అనే యువతికి ఏటూరు నాగారం మండలంలోని రాంనగర్ గ్రామానికి చెందిన నూకల గోవింద్ వివాహం జరిగింది. ఈ నెల 4వ తేదీన వీరికి పెద్దలు వివాహం జరిపించారు. ఇక కూతురికి పెళ్లి చేసిన ఆనందంలో కోమలిక తల్లిదండ్రులు ఉన్నారు. కుమార్తె వివాహాన్ని ఘనంగా నిర్వహించారు. పెళ్లైన అనంతరం కోమలిక తన అత్తింటికి వెళ్లింది. ఈ క్రమంలోనే కోమలిక ముభావంగా ఉంటుంది. దీంతో ఆమెను గమనించిన భర్త గోవింద్ సమస్యను కనుకోవాలనుకున్నాడు. ఎందుకు డల్ గా ఉంటున్నావని కోమలికను ఆమె భర్త ప్రశ్నించాడు. దీంతో కోమలిక అసలు విషయాన్ని తన భర్తకు చెప్పింది.
తనకు ఇష్టం లేని పెళ్లి చేశారని కోమలిక..తన భర్తతో చెప్పింది. ఆ నవ వధువు అలా చెప్పడంతో.. ఆమెను తన పుట్టింకి పంపించారు. కొన్ని రోజుల తరువాత కూతురుకు నచ్చజెప్పి మళ్లీ తిరిగి అత్తవారింటికి పంపించారు కోమలకి తల్లిదండ్రులు. ఈ క్రమంలోనే రెండు రోజుల క్రితం తమ తల్లిగారింటికి వెళ్లివద్దామని భర్తతో ఆ నవ వధువు చెప్పింది. దీంతో భార్య మాటకు ఓకే చెప్పిన గోవింద్.. ఆమెతో కలిసి కమలాపురం వెళ్లాడు. వారిద్దరు ఇంటికి వెళ్లే సమయానికి ఆ నవ వధువు తల్లిదండ్రులు రొయ్యూరులోని బంధువుల పెళ్లికి వెళ్లారు. అదే సమయంలో తన భర్తతో కలిసి ఉన్న కోమలిక ఆదివారం మధ్యాహ్నం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కోమలికను గమనించిన కుటుంబసభ్యులు వెంటనే ఏటూరునాగారం తరలించారు.
అక్కడి పరీక్షించిన డాక్టర్ ఆ యువతి పరిస్థితి విషమంగా ఉందని చెప్పాడు. దీంతో వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తీసుకెళ్లగా, చికిత్స పొందుతూ..సోమవారం మధ్యాహ్నం మృతి చెందారు. కొత్త సంసార జీవితంలో పిల్లపాపలతో సంతోషంగా జీవిస్తుందని అనుకుంటే…ఇలా అర్ధాంతరంగా తనువు చాలించడంతో ఇరు కుటుంబాల్లో విషాదం నిండింది. ఏది ఏమైన సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నించకుండా చాలా మంది ఇలానే చావే పరిష్కారంగా భావిస్తున్నారు. ఇలా తమ నిండు జీవితాన్ని చేజేతులా బలి చేసుకుంటున్నారు.