iDreamPost
android-app
ios-app

అందమైన భార్య.. రూ.4 కోట్లు కట్నం! అయినా.. అతనికి అత్యాశ తీరలేదు!

  • Published Feb 16, 2024 | 1:25 PM Updated Updated Feb 16, 2024 | 1:25 PM

Gajularamaram Crime News: దేశంలో ఇప్పటికీ వరకట్న దురాచారం కొనసాగుతూనే ఉంది.. ఇచ్చిన కట్నం సరిపోక అత్తంటి వేధింపులతో ఎంతోమంది ఆడవారు బలవన్మరాణాలకు పాల్పపడుతున్నారు.

Gajularamaram Crime News: దేశంలో ఇప్పటికీ వరకట్న దురాచారం కొనసాగుతూనే ఉంది.. ఇచ్చిన కట్నం సరిపోక అత్తంటి వేధింపులతో ఎంతోమంది ఆడవారు బలవన్మరాణాలకు పాల్పపడుతున్నారు.

అందమైన భార్య.. రూ.4 కోట్లు కట్నం! అయినా.. అతనికి అత్యాశ తీరలేదు!

సమాజంలో వరకట్నం అనేది ఒక సామాజిక దురాచారం అన్న విషయం తెలిసిందే. కానీ ఇప్పటికీ వరకట్నం లేనిదే పెళ్లి తంతు ముందుకు సాగదు. దీని వల్ల స్త్రీలపై ఊహకందని రీతిలో చిత్ర హింసలు, నేరాలు జరుగుతున్నాయి. సామాన్యులే కాదు సంపన్నులు కూడా వరకట్న దురాచారానికి బలైపోతున్నారు. ఒకదశలో ఆడపిల్ల పుట్టిందంటే కట్నకానుకులు ఇవ్వాల్సి వస్తుందని తల్లిదండ్రులు భయపడే పరిస్థితి ఏర్పడింది. వరకట్న దురాచారాన్ని తరిమికొట్టడానికి ఎంతోమంది మహనీయులు పోరాటం చేశారు.. కానీ ఎక్కడో అక్కడ వరకట్న మరణాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా వరకట్న దాహానికి మరో మహిళ బలైంది. ఈ ఘటన హైదరాబాద్ లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్ గాజులరామారంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వరకట్న వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య చేసుకుంది. గాజులరామారంకు చెందిన అభిలాష్, అమరావతి దంపతులకు 2019 లో వివాహం జరిగింది. వివాహం సమయంలో రూ.4 కోట్ల వరకు వరకట్నంగా పెళ్లి కొడుకు కటుంబానికి అప్పగించారు. కొంతకాలం వీరి దాంపత్యం సాఫీగానే సాగింది. ఇటీవల అభిలాష్ కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం అమరావతిని హింసించడం మొదలు పెట్టారు. ఇప్పటికే తన తల్లిదండ్రులు ఎంతో కట్నం ఇచ్చారని.. ఇక అదనపు కట్నం తీసుకురావడం తన వల్లకాదని తేల్చి చెప్పింది అమరావతి. దీంతో ఆమెపై మరింత ఒత్తిడి తీసుకురావడం, మానసికంగా, శారీరకంగా హింసించడం మొదలు పెట్టారు.

అత్తింటి ఆగడాలు తట్టుకోలేకపోయింది అమరావతి.. తీవ్ర మనస్థాపానికి గురై సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పపడింది. ఆత్మహత్యకు ముందు తాను ఎందుకు చనిపోతున్నాను.. అన్న విషయాన్ని లెటర్ రాసింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఆమె మృతదేహాంతో పాటు సూసైడ్ లెటర్ కూడా స్వాధీనం చేసుకున్నారు. అమరావతి సోదరుడు ఫిర్యాదు మేరకు అభిలాష్ తో పాటు అతడి తల్లిదండ్రులపై పోలీసులు కేసు నమోదు చేశారు. కోటి ఆశలతో అత్తింట్లో అడుగు పెట్టిన ఆడపడుచులు వరకట్న రక్కసికి బలైతూనే ఉన్నారు. ఈ సంఘటనపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.