iDreamPost
android-app
ios-app

కళ్యాణ్ జ్యువెలర్స్‌ ఘటన మరువక ముందే కూకట్ పల్లిలో మరో ప్రమాదం!

రెండు రోజుల క్రితం కళ్యాణ్ జ్యూవెలరిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా అదే తరహాలో హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో పేలుడు ఘటన సంభవించింది.

రెండు రోజుల క్రితం కళ్యాణ్ జ్యూవెలరిలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురుకి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా అదే తరహాలో హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో పేలుడు ఘటన సంభవించింది.

కళ్యాణ్ జ్యువెలర్స్‌ ఘటన మరువక ముందే కూకట్ పల్లిలో మరో  ప్రమాదం!

నిత్యం అనేక రకాల ప్రమాదాలు చోటుచేసుకుంటాయి. ముఖ్యంగా అగ్నిప్రమాదలు అనేవి తరచూ ఏదో ఒక ప్రాంతంలో జరుగుతుంటాయి. ఈ ప్రమాదాల కారణంగా ఎంతో మంది అమాయకులు సజీవదహనం అవుతున్నారు. అలానే మరెందరో తీవ్ర గాయాలతో జీవితాన్ని నరకంగా అనుభవిస్తున్నారు. ఏసీలు పేలడం, రసాయనాల పేలుడు, షార్ట్ సర్క్యూట్ వంటి వాటి కారణంగా ఈ ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. రెండు రోజుల క్రితం బళ్లారిలోని కళ్యాణ్ జ్యూవెలర్స్ లో భారీ పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. ఈ ఘటన మరువక ముందే తాజాగా హైదరాబాద్ లోని కూకట్ పల్లిలో అగ్నిప్రమాదం చోటుచోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

ప్రస్తుతం సమ్మర్ సీజన్ నడుస్తోంది. ఎండలు దంచికొడుతున్నాయి. ఇదే సమయంలో అగ్నిప్రమాదాలు కూడా ఎక్కువగా సంభవిస్తుంటాయి. ఈ సమ్మర్ లో నిత్యం ఎక్కడో ఓ చోట  అగ్నిప్రమాదలు సంభవించిందనే వార్తలు వింటూ ఉంటాం. చిన్న నిప్పు కణిక కూడా భారీ అగ్ని ప్రమాదాలను రాజేస్తుంది. ఇలానే కొన్ని సమయంలోతీవ్ర వేడి కారణంగా షార్ట్‌ సర్క్యూట్‌ జరిగే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రోజుల క్రితం షాద్‌ నగర్‌ ఫార్మ కంపెనీలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. అలానే ఓ బాలుడు ధైర్యం చేసి  పలువురి ప్రాణాలను కాపాడాడు.

అలానే రెండు రో జుల క్రితం కళ్యాణ్‌ జ్యువెలర్స్‌లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. తాజాగా హైదరాబాద్ లోని మరో పేలుడు ఘటన సంభవించింది. హైదారాబాద్  కూకట్ పల్లిలోని ఓ స్క్రాప్ దుకాణంలో అగ్నిప్రమాదం జరిగింది. కూకట్ పల్లి పరిధిలోని సాయినగర్ కాలనీలో ఓ స్క్రాప్ దుకాణంలో నిల్వ ఉంచిన సిలిండర్ పేలడంతో ఈ  ప్రమాదం సంభవించింది. దీంతో ఒక్కసారిగా ఆ షాపులో మంటలు చెలరేగి.. పక్కనే ఉన్న స్క్రాప్ కు అంటుకుని మంటలు వ్యాపించాయి. దీంతో కాసేపు ఆ ప్రాంతమైన దట్టమైన పొగలు అలుముకున్నాయి.

గమనించి స్థానికులు  అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేశారు. అనుమతి లేకుండా నిల్వ ఉంచిన చిన్న సిలిండర్ల వల్లే  ఈ ప్రమాదం చోటుచేసుకుందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇక ఈ ప్రమాదంలో ఎవరికి ఎలాంటి గాయలు కాలేదు. అదృష్టవశాత్తు ఎటుంటి ప్రాణ నష్టం జరగలేదు.  అలానే కొన్ని నెలల క్రితం సికింద్రాబాద్ ప్రాంతంలో ని ఓ లాడ్జీలో అగ్నిప్రమాదం జరిగి.. ఆరు మంది సజీవ దహనం అయ్యారు. మరి..ఎండలకాలంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.