పెళ్లైన మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య! కారణం తెలిస్తే..కన్నీళ్లు ఆగవు..

కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతి..పెళ్లైన మూడు నెలలకే నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించింది. ఆ యువతి సూసైడ్ కి కారణం తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు.

కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతి..పెళ్లైన మూడు నెలలకే నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించింది. ఆ యువతి సూసైడ్ కి కారణం తెలిస్తే.. కన్నీళ్లు ఆగవు.

పెళ్లి అనేది ఎంతో మధురమైన వేడుక. అందుకే ఈ కార్యక్రమాన్ని ఎంతో ఘనంగా చేసుకోవాలని యువత ఆశ పడుతుంది. అబ్బాయిలు, అమ్మాయిలు తమకు కాబోయే వారి గురించి ఎంతో గొప్పగా ఊహించుకుంటారు. తమ అభిరుచులు తెలుసుకుని అర్థం చేసుకునే వారు రావాలని యువత భావిస్తుంటారు. అలానే ఎంతో మంది తమకు ఇష్టమైన వారినే వివాహం చేసుకుంటారు. అయితే ఇలా చేసుకున్న వారిలో కొందరి జీవితం అనుకున్న దానికి భిన్నంగా సాగుతోంది. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో అత్తింటి వారి నుంచి ఊహించిన పరిణామాలు ఎదురవుతుంటాయి. అందుకే కొందరు వివాహమైన తక్కువ సమయంలోనే దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు. తాజాగా ఓ వివాహిత..పెళ్లైన మూడు నెలలకే దారుణ నిర్ణయం తీసుకుంది.

కొత్త జీవితంపై ఎన్నో ఆశలు పెట్టుకున్న యువతి..పెళ్లైన మూడు నెలలకే నిండు నూరేళ్ల జీవితాన్ని ముగించింది. మూడు నెలల క్రితమే వివాహం జరగ్గా….బుధవారం ఆత్మహత్య  చేసుకుంది. ఈ ఘటన వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలం కేంద్రానికి చెందిన ఈర్ల రమేష్, రమ దంపతులకు వైష్ణవి(26) అనే కుమార్తె ఉంది. ఆ పాపను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకున్నారు. ఇక ఇటీవలే ములుగు జిల్లా వెంకటాపూరం మండలంకి చెందిన రెడ్డి ప్రశాంత్ తో వివాహం జరిపించారు. వైష్ణవి వివాహం మూడు నెలల క్రితమే జరిగింది. ఇక తమ బిడ్డ  వివాహాన్ని ఎంతో ఘనంగా నిర్వహించారు. ఇక తమ కుమార్తె కొత్త జీవితం.. ఆ తల్లిదండ్రులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు.

 అయితే బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో వైష్ణవి ఊరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అత్తగారింటి వేధింపులు భరించలేక మంగళవారం వైష్ణవి తన పుట్టింటికి వచ్చింది. ఈ క్రమంలోనే బుధవారం తెల్లవారు జాము సమయంలో ఈ దారుణానికి పాల్పడింది. అయితే వెంటనే గమనించిన కుటుంబ సభ్యులు  108 వాహనంలో నర్సం పేట ప్రాంతీయ ఆస్పత్రికి తరలించారు. అలా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంల మధ్యలో వైష్ణవి చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక ఈ మృతికి సంబంధించి పూర్తి వివారలు తెలియాల్సి ఉంది. కారణం ఏదైనప్పటికి క్షణికావేశంలో వైష్ణవి దారుణ నిర్ణయం తీసుకుని నిండు జీవితాన్ని బలి చేసుకుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది యువతులు ఇలానే జీవితంలో ఎదురయ్యే  సమస్యలపై పోరాటం చేయకుండా భయపడుతుంటారు. మరికొందరు చావే పరిష్కార మార్గంగా భావించి..నిండు జీవితాన్ని అర్ధాంతరంగా ముగిస్తున్నారు. మరి.. ఇలాంటి ఘటనల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments