iDreamPost
android-app
ios-app

గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య!

ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. క్షణికావేశంలో యువత తీసుకుంటున్న ఈ నిర్ణయాలు..వారి కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థిని.. ఆమె తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది.

ఇటీవల కాలంలో విద్యార్థుల ఆత్మహత్య ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. క్షణికావేశంలో యువత తీసుకుంటున్న ఈ నిర్ణయాలు..వారి కుటుంబాల్లో విషాదం నింపుతున్నాయి. తాజాగా ఓ పదో తరగతి విద్యార్థిని.. ఆమె తల్లిదండ్రులకు గుండెకోత మిగిల్చింది.

గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థిని ఆత్మహత్య!

మరణం వచ్చినప్పుడే స్వీకరించాలి, కానీ..దానిని మనం పిలవకూడదు. అయితే నేటికాలంలో చాలా మంది చావును వారే పిలుస్తున్నారు. ముఖ్యంగా ప్రతి చిన్న సమస్యకు ఎంతో వేదనకు, ఆందోళనకు గురవుతున్నారు. ఎదురైన సమస్యను పరిష్కరించేందుకు కనీసం ఆలోచన కూడా చేయని స్థితిలో నేటితరం మనుషులు ఉన్నారు. ఇంకా దారుణం ఏమిటంటే.. అసలు కష్టం అంటే ఏమిటో తెలియని పాఠశాల విద్యార్థులు కూడా చిన్న విషయాలను కూడా పెద్ద సమస్యలుగా భావించి..ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా పదో తరగతి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని.. తన తల్లిదండ్రులకు గుండెకోతను మిగిల్చింది. ఈ ఘటన సూర్యపేట జిల్లాలో చోటుచేసుకుంది.

సూర్యాపేట మండలం ఇమాం పేట వద్ద గల ఎస్సీ బాలిక గురుకుల పాఠశాలలో ఇరుగు అస్మిత(15) అనే విద్యార్థిని పదో తరగతి చదువుతుంది. ఈ విద్యార్థిని మోతే మండలం బుక్కచెర్ల గ్రామానికి చెందినది ఆనంద్, జ్యోతి దంపతుల కుమార్తె. హోం సిక్ సెలవుల నిమిత్తం అస్మిత ఇంటికి వచ్చింది. శనివారం తన ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఫిబ్రవరి 10న ఇదే గురుకుల పాఠశాలలో ఇంటర్ చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థిని అనుమానస్పద స్థితిలో మరణించింది. దీంతో విద్యార్థులు భయపడకుండా ఉండడానికి పాఠశాల,కాలేజీలకు నాలుగు రోజులు సెలవులు ప్రకటించారు.

దీంతో పదో తరగతి చదువుతోన్న అస్మిత సెలవుల్లో హైదరాబాద్ లో ఉంటున్న తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది. శనివారంతో సెలవులు అయిపోతున్నందున్న పాఠశాలకు వెళ్దామని చెప్పిన అస్మిత తల్లి.. తన పనులకు వెళ్లింది. కానీ అస్మిత మనసులో ఏముందో ఏమో కానీ దారుణమైన నిర్ణయం తీసుకుంది. తన తల్లి తిరిగి వచ్చే సరికి అస్మిత ఇంట్లోనే ఫ్యాన్ కు చున్నితో ఉరి వేసుకుని  ఆత్మహత్య చేసుకుంది. ఆ పాఠశాలకు వెళ్లాల్సిన రోజే అస్మిత ఇలా ఆత్మహత్య చేసుకోవడం మిస్టరీగా మారింది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

కుమార్తె మరణంతో అస్మిత తల్లిదండ్రులు విషాదంలో మునిగిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఇటీవలే అదే గురుకుల పాఠశాలలో చదువుతున్న వైష్ణవి అనే విద్యార్థి అనుమానస్పద స్థితిలో మరణించింది.  ఈ ఘటనతో ఆమె బంధవులు, విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాల నాయకులు రాస్తారోక్, ధర్నాలు చేశారు. ఈ నేపథ్యంలోనే కళాశాల ప్రిన్సిపల్ ను సస్పండ్ చేసిన సంగతి తెలిసింది. ఆ సంఘటన మరువక ముందే అదే పాఠశాలకు చెందిన అస్మిత ఆత్మహత్య కలకలం రేపుతోంది. ఇలాంటి ఆత్మహత్య ఘటనల నిర్మూలను ఎలాంటి చర్యలు తీసుకోవాలి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి