Arjun Suravaram
తాను ఎన్నో కష్టాలు పడుతూ.. బిడ్డల సంతోషం కోసం పరితపిస్తుంది అమ్మ. తాను ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతూ..బిడ్డలకు సుఖమైన నిద్రను అందిస్తూంది. అలా పెంచిన మాతృమూర్తిపై నేటికాలంలో కొందరు బిడ్డలు దారుణాలకు పాల్పడుతున్నారు.
తాను ఎన్నో కష్టాలు పడుతూ.. బిడ్డల సంతోషం కోసం పరితపిస్తుంది అమ్మ. తాను ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతూ..బిడ్డలకు సుఖమైన నిద్రను అందిస్తూంది. అలా పెంచిన మాతృమూర్తిపై నేటికాలంలో కొందరు బిడ్డలు దారుణాలకు పాల్పడుతున్నారు.
Arjun Suravaram
ఈ భూ మండలంపై వెలకట్టలేనిది అంటూ ఉన్నాది అంటే.. అది అమ్మ ప్రేమ మాత్రమే. కారణం..స్వార్థం ఎరుగని, త్యాగానికి సిద్ధమయ్యేది కేవలం అమ్మకు, ఆ ప్రేమకు మాత్రమే సొంతం. బిడ్డను నవమాసాలు మోసి..కనీ పెంచుతుంది మాతృమూర్తి. తాను ఎన్నో కష్టాలు పడుతూ.. బిడ్డల సంతోషం కోసం పరితపిస్తుంది. తాను ఎన్నో నిద్రలేని రాత్రుళ్లు గడుపుతూ..బిడ్డలకు సుఖమైన నిద్రను అందిస్తూంది. అలా తన రక్తమాంసాలతో పెంచిన తల్లిదండ్రులపై నేటికాలంలో కొందరు బిడ్డలు దారుణాలకు పాల్పడుతున్నారు. ప్రాణాలు పోసిన తల్లిదండ్రుల ప్రాణాలను తీసేందుకు కూడా వెనుకడాటం లేదు. తాజాగా ఓ కసాయి కొడుకు తల్లిని దారుణంగా కొట్టి చంపేశాడు. ఈఘటన సిద్ధిపేట జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం పాములపర్తికి చెందిన పెద్దబోయిన బాలమల్లు, భారతమ్మ దంపతుల ఉన్నారు. వీరు స్థానికంగా పనులు చేసుకుంటూ జీవనం సాగించే వారు. ఈ దంపతులకు ఇ ఇద్దరు కుమార్తెలు, కుమారుడు నరసింహులు ఉన్నారు. వారిని చిన్నతనం నుంచి ఎంతో అల్లారు ముద్దుగా పెంచి పోషించారు. అలానే ఆ దంపతులు ఇద్దరు రేయింబవళ్లు కష్టపడి పనులు చేస్తూ ఆ ముగ్గురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. నరసింహులు ఒక్కడే కుమారుడు కావడంతో అతడిని అల్లారు ముద్దుగా పెంచారు.
అలా ముగ్గురికి పెళ్లిళ్లు చేశారు ఆ దంపతులు. అయితే నరహింహులు మద్యానికి బానిసై..తరచూ ఇంట్లో గొడవ పడే వాడు. అలా 9 ఏళ్ల క్రితం తండ్రితో డబ్బుల విషయంలో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య భారీ వాగ్వాదం జరిగి..నరహసింహులు తనతండ్రిపై దాడికి దిగాడు. డబ్బులు ఇవ్వలేదని కర్రతో తండ్రి తలపై బలంగా కొట్టడంతో ఆయన మరణిచాడు. ఈ క్రమంలోనే భారతమ్మ ఒకతో నివాసం ఉంటుంది. ఆ ఘటన జరిగి తొమ్మిదేళ్లు దాటిన కూడా నరసింహులు మద్యం తాగడం మాత్రం మానలేదు. అలా తరచూ తన తల్లితో గొడవ దిగుతుండే వాడు. ఇటీవలే ఏప్రిల్ 27న రాత్రి మద్యం తాగిన మత్తులో తల్లి భారతమ్మపై నరసింహులు గొడవపడ్డాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. తల్లిని బలంగా నెట్టేయడంతో ఆమె తలకు తీవ్ర గాయాలయ్యాయి.
ఆమె గాయాలతో అల్లాడుతున్న కనికరం చూపకుండా కర్రతో దాడి చేశాడు. ఈ సంఘటనను గమనించిన చుట్టుపక్కల వారు భారతమ్మ కుమార్తెలకు సమాచారం అందించారు. వేరే గ్రామాల్లో ఉంటున్న వారు వెంటనే ఆమె వద్దకు వచ్చారు. గాయాలతో పడి ఉన్న తల్లిని చికిత్సకు గాంధీ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి చికిత్స పొందుతూ ఆమె సోమవారం సాయంత్రం మృతి చెందింది. నరసింహులుపై మృతులరాలి తల్లి సరస్వతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై హత్య కేస నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.