iDreamPost
android-app
ios-app

దారుణం: అమ్మాయి కోసం ఫ్రెండ్ ను చంపిన ఇంటర్ విద్యార్థులు!

  • Published Jun 29, 2024 | 4:26 PM Updated Updated Jun 29, 2024 | 4:26 PM

తాను ప్రేమించిన అమ్మాయి తండ్రిని ఓ యువకుడు అత్యంత దారుణం హత్య చేశాడు. ఇది ఇలా ఉంటే అదే తరహాలో తాజాగా హైదరాబాద్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. అమ్మాయి కోసం ఇంటర్ విద్యార్థిని తోటి విద్యార్థి చంపేశాడు.

తాను ప్రేమించిన అమ్మాయి తండ్రిని ఓ యువకుడు అత్యంత దారుణం హత్య చేశాడు. ఇది ఇలా ఉంటే అదే తరహాలో తాజాగా హైదరాబాద్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. అమ్మాయి కోసం ఇంటర్ విద్యార్థిని తోటి విద్యార్థి చంపేశాడు.

  • Published Jun 29, 2024 | 4:26 PMUpdated Jun 29, 2024 | 4:26 PM
దారుణం:  అమ్మాయి కోసం ఫ్రెండ్ ను చంపిన ఇంటర్ విద్యార్థులు!

నేటికాలంలో జరుగుతున్న ఘటనలు చూస్తే..సమాజం ఎటు వెళ్తుందో అర్థం కానీ పరిస్థితి. నిత్యం ఏదో ఒక చోట అనే దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో, వివాహేతర సంబంధ కారణంగా జరిగే హత్య ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి. గురువారం విజయవాడలో దారుణం చోటుచేసుకున్న సంగతి తెలిసింది. తాను ప్రేమించిన అమ్మాయి తండ్రిని ఓ యువకుడు అత్యంత దారుణం హత్య చేశాడు. ఇది ఇలా ఉంటే తాజాగా హైదరాబాద్ లో మరో ఘోరం చోటుచేసుకుంది. అమ్మాయి కోసం ఓ ఇంటర్ విద్యార్థిని మరో 10 మంది విద్యార్థులతో కలిసి ఓ బాలుడు హత్య చేశాడు. ఈ ఘటన స్థానికంగా సంచలనంగా మారింది పూర్తి వివరాల్లోకి వెళ్తే..

నేటికాలంలో సోషల్ మీడియా ప్రభావామో, లేకుంటే.. సినిమా ప్రభావామో లేకా మరే ఇతర కారణాలో కావచ్చు కానీ..చదువుకునే విద్యార్థులు కొందరు మృగాలు గా మారిపోతున్నారు. కొందరు చెడు వ్యసనాలకు, జల్సాలకు అలవాటు పడి చోరీలకు పాల్పడుతున్నారు. అంతేకాక దొంగతనాలు చేసే సమయంలో అడ్డు వచ్చిన వారిని హత్య చేసుకుందు కూడా వెనుకాడటం లేదు. అలానే కొందరు విద్యార్థులు పది, ఇంటర్ చదివే సమయంలోనే ప్రేమవ్యవహారాలు నడుపుతున్నారు. ఈ కారణం కొందరు తోటివారిపై ద్వేషం, పగలు పెంచుకుని దాడులు చేస్తున్నారు. అంతేకాక ఏకంగా హత్యలకు కూడా తెగబడుతున్నారు.

తాజాగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లోని కూకట్ పల్లి ప్రాంతంలో దారుణం చోటుచేసుకుంది. అమ్మాయి కోసం స్నేహితుడిని తోటి ఇంటర్ విద్యార్థులు హత్య చేశారు. కూకట్ పల్లి డివిజన్ పరిధిలో అల్లాపూర్ ప్రాంతంలో దానిష్ అనే విద్యార్థి ఇంటర్  చదువుతున్నారు. ఈ క్రమంలో తాను ప్రేమిస్తున్న అమ్మాయిని ప్రేమించొద్దని దానిష్ ను 10 మంది స్నేహితులతో కలిసి మరో ఇంటర్ బాలుడు హత్య చేశాడు.

బీరు సీసాలతో తలపై కొట్టి, గొంతు నులిమి హత్య చేశారు. అనంతరం ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. దానిష్ మృతదేహాన్ని రైల్వే ట్రాక్ మీద పెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్లాన్ వేశారు. అయితే చివరకు వారి ఫ్లాన్ విఫలమై పోలీసులకు దొరికిపోయారు. ఇక ఈ హత్య  చేసే సమయంలో అందరూ గంజాయి మత్తులో ఉన్నట్టు సమాచారం. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. ఈ ఘటన అందరూ ఒక్కసారి ఉల్కిపడ్డారు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet