iDreamPost
android-app
ios-app

ఎన్నో ఆశలతో కాలేజీలో చేరింది.. కానీ, 4వ రోజునే ఊహించని విషాదం

  • Published Sep 02, 2024 | 8:21 AM Updated Updated Sep 02, 2024 | 8:21 AM

చిన్నప్పటి నుంచి వ్యవసాయ విద్య పై మక్కువతో ఓ విద్యర్థిని కోటి ఆశలతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో చేరింది. కానీ, కాలేజీలో చేరిన నాలగవరోజే ఊహించని విషాదం చోటు చేసుకుంది.

చిన్నప్పటి నుంచి వ్యవసాయ విద్య పై మక్కువతో ఓ విద్యర్థిని కోటి ఆశలతో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీలో చేరింది. కానీ, కాలేజీలో చేరిన నాలగవరోజే ఊహించని విషాదం చోటు చేసుకుంది.

  • Published Sep 02, 2024 | 8:21 AMUpdated Sep 02, 2024 | 8:21 AM
ఎన్నో ఆశలతో కాలేజీలో చేరింది.. కానీ, 4వ రోజునే ఊహించని విషాదం

జీవితంలో ప్రతిఒక్కరికి విద్యార్థి దశ చాలా విలువైనది, పైగా అదే బంగారు భవిష్యత్తుకు పునాది. అందుకే చాలామంది విద్యార్థులు మంచి స్కూల్స్, కాలేజీల్లో చేరి ఉన్నత విద్యను అభ్యసించలని అనుకుంటారు. అయితే మంచిగా చదువుకొని గొప్ప స్థాయికి వెళ్లి తల్లిదండ్రుల నమ్మకాలు, ఆశయాలను నేరవల్చిన విద్యార్థులు.. కన్నవారి కలలను అర్ధంతరంగా మిగిల్చేస్తూ తిరిగిరాని లోకానికి వెళ్తున్నారు. ముఖ్యంగా ఎన్నో ఆశలతో కాలేజిల్లో చేరిన విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే మనస్తపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో అయితే కాలేజీల్లో యాజమాన్యం, తోటి విద్యర్థుల వేధింపులు తాళలనేక చాలామంది విద్యార్థులు తమ బాధను తల్లిదండ్రులకు చెప్పుకోలేక, దిగమింగుకోలేక జీవితంపైనే విరక్తి కలిగి అర్ధంతరంగా తనువు చలిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో పాలిటెక్నిక్ విద్యార్థి విషయంలో కూడా ఊహించని దారుణం చోటు చేసుకుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

కోటి ఆశలతో కాలేజీలో చేరిన నాలగవరోజే  ఓ వ్యవసాయ పాలిటెక్నిక్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన సంచలనంగా మారింది. అయితే ఈ విషాద ఘటన ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండలంలో చోటు చేసుకుంది. ఆదిలాబాద్ జిల్లా హస్నాపూర్  గ్రామానికి చెందిన విద్యార్థిని లింగన్ వాడి రక్షిత(15) నిజామాబాద్ జిల్లా రుద్రూర్‌ మండలం అక్బర్‌నగర్‌ లోని ఉన్న వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 27వ తేదీన ఫస్టియర్ లో చేరింది. అయితే కాలేజి హాస్టల్ లోనే చేరిన రక్షిత శనివారం ఉదయం నిద్ర లేచిన ఆమె బాత్‌ రూమ్‌కు వెళ్లి చాలా సేపటి వరకు తిరిగి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తోటి విద్యార్థులు తలుపులు గట్టిగా బాదడంతో కింది భాగం విరిగిపడింది.  ఇక అందులో నుంచి చూసిన విద్యార్థినులకు రక్షిత చున్నీతో ఉరివేసుకున్న దృశ్యం కన్పించింది.

దీంతో వెంటనే కాలేజి యాజమాన్యంకు, హాస్టల్ వార్డెన్ కు విద్యార్థులు సమాచారం అందించారు. ఇక ఈ సమాచారం పోలీసులకు తెలియడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు హాస్టల్‌ వార్డెన్, కేర్‌ టేకర్, అధ్యాపకులు, విద్యార్థుల ద్వారా వివరాలను సేకరించారు. రెండు గంటల అనంతరం మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌ను పిలిపించగా విద్యార్థి సంఘాల నాయకులు అడ్డుకున్నారు. పోలీసులు వారిని బలవంతంగా పక్కకు నెట్టి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. అయితే హాస్టల్ లో శుక్రవారం  సీసీ ఫుటేజీలో డాటా లేకపోవడంతో నిపుణులను పిలిపించి తీసుకుంటామని బోధన్‌ ఏసీపీ శ్రీనివాస్‌ రావు చెప్పడంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన విరమించారు.

ఇకపోతే రక్షిత ఆత్మహత్య విషయమై కాలేజీ యాజమాన్యంపై అనుమానం ఉందని మృతురాలి తండ్రి విష్ణు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.  అంతేకాకుండా తమది వ్యవసాయ కుటుంబమని, నలుగురు సంతానంలో రక్షిత రెండో అమ్మాయని, అలాగే రక్షితకు వ్యవసాయ విద్య అంటే చాలా ఇష్టమని చెప్పారు. ఇక అంతా ఇష్టంగా కాలేజిలో చేరిన మా కుమార్తే ఇలా అర్థంతరంగా ఆత్మహత్య చేసుకోవడంపై మాకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. వెంటనే తమ కుమార్తే మరణానికి కారణమేటో తెలియాలని  .కాలేజీ యాజమాన్యాన్ని, ప్రిన్సిపాల్, హాస్టల్‌ వార్డెన్‌ను విచారించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్‌ చేశారు.