iDreamPost
android-app
ios-app

పెళ్లైన 4 నెలలకే.. భార్యపై అనుమానంతో ఎంత దారుణం చేశాడంటే?

  • Published Aug 15, 2024 | 1:00 PM Updated Updated Aug 15, 2024 | 1:00 PM

పెళ్లై ఇంక ఆరు నెలలైనా గడవలేదు కానీ, అప్పుడే ఓ దాంపత్య జీవితంలో అనుమానం అనే పెను భూతం దాపరించింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో పాటు తరుచు వివాదాలు కూడా జరిగేవి. అయితే ఈ వివాదాలు కాస్త ముదిరిపోవడంతో.. చివరికి ఏం జరిగిందంటే..

పెళ్లై ఇంక ఆరు నెలలైనా గడవలేదు కానీ, అప్పుడే ఓ దాంపత్య జీవితంలో అనుమానం అనే పెను భూతం దాపరించింది. దీంతో ఇద్దరి మధ్య మనస్పర్ధలు తలెత్తడంతో పాటు తరుచు వివాదాలు కూడా జరిగేవి. అయితే ఈ వివాదాలు కాస్త ముదిరిపోవడంతో.. చివరికి ఏం జరిగిందంటే..

  • Published Aug 15, 2024 | 1:00 PMUpdated Aug 15, 2024 | 1:00 PM
పెళ్లైన 4 నెలలకే.. భార్యపై అనుమానంతో ఎంత దారుణం చేశాడంటే?

సాధరణంగా ఏ బంధంలోనైనా ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. ఎందుకంటే.. నమ్మకం లేనిదే ఏ బంధం కూడా సవ్యంగా నిలబడదు. ముఖ్యంగా భర్యభర్తల బంధం అయితే ఈ విషయంలో చాలా స్ట్రాంగ్ గా ఉండాలి. కానీ, ప్రస్తుత దాంపత్య జీవితంలో ఇదే పెద్ద లోపంగా మారిపోయింది. ఎంతో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవడం, తీరా కొంత కాలానికే మనస్పర్దలతో ఒకరిపై ఒకరికి నమ్మకం కోల్పోవడం వంటివి ఎక్కువగా జరుగుతున్నాయి. ఇక అంతటి అగాని ఆ తగాదాలు అనుమానంతో చివరికి హత్యలు చేయడం, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి దారుణా ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కాగా, ఇప్పటికే తరుచు  అనుమానం అనే పెను భూతం వల్ల అనేక హత్యలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ తరుణంలోనే తాజాగా ఓ భర్త పెళ్లై ఆరు నెలలైనా కాలేదు కానీ, అంతలోనే భార్యపై అనుమానంతో ఊహించని దారుణానికి ఒడిగట్టాడు. ఇంతకీ ఏం జరిగిందంటే..

పెళ్లై ఇంక ఆరు నెలలైనా కాలేదు కానీ, అప్పుడే ఓ దాంపత్య జీవితంలో అనుమానం అనే పెను భూతం దాపరించి ఆ జంటను బలి తీసుకుంది. భార్యపై అనుమానంతో రగిలిపోయిన ఓ భర్త తనను గొంతు కోసి మరీ హతమార్చి అనంతరం ఆయన కూడా ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ విషాదకరమైన ఘటన నారాయణ పేట జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ లో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనకు సంబంధించి గ్రామస్థులు, పోలీసులు కథనం ప్రకారం.. తంగడి తిమ్మప్ప(26)కు కర్ణాటకలోని యాద్గిర్‌ జిల్లా బాడ్యాలకు చెందిన సంధ్య(21)తో ఈ ఏడాది ఏప్రిల్‌ 18న వివాహం జరిగింది.  అయితే పెళ్లైన కొద్దిరోజులకే భార్యపైన తిమ్మప్పకు అనుమానం కలగడంతో వారి ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తాయి. దీంతో తరుచు వారిద్దరి మధ్య వివాదం జరిగేది.

ఈ క్రమంలోనే.. ఇద్దరి మధ్య బుధవారం మాటకు మాట పెరగడంతో ఆవేశానికి గురైన భర్త తలుపు గడియపెట్టి కత్తితో భార్య గొంతు కోయడంతో ఆమె స్పృహతప్పి పడిపోయింది. అనంతరం  అక్కడే ఉన్న తిమ్మప్ప కూడా ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక కొద్దిసేపటికి స్పృహలోకి వచ్చిన సంధ్య అతికష్టం మీద ఇంటి తలుపు గడియ తీసి బయటకు వచ్చి కేకలు వేయడంతో స్థానికులు వచ్చి రక్తపుమడుగులో ఆమె పడి ఉండటాన్ని గమనించారు. ఇంట్లోకి వెళ్లి చూడగా ప్రాణం కోల్పోయి వేలాడుతున్న తిమ్మప్ప శవం కనిపించింది.  ఇక కొన ప్రాణాలతో ఉన్న సంధ్యను  వెంటనే కర్ణాటకలోని రాయచూరు ఆసుపత్రికి తరలించగా మృతి చెందినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు. ఇక విషయం తెలుసుకున్న కృష్ణా ఎస్‌ఐ ఎస్‌ఎం నవీద్‌ సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్‌ఐ చెప్పారు.