iDreamPost
android-app
ios-app

మరికొన్ని గంటల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. పది రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే

  • Published Mar 06, 2024 | 10:05 AM Updated Updated Mar 06, 2024 | 10:49 AM

నగరంలోని ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి మరో పది రోజుల్లో పెళ్లి.. అందుకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉండగా ఇంతలోనే ఆమె చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.

నగరంలోని ఓ మహిళ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి మరో పది రోజుల్లో పెళ్లి.. అందుకు సంబంధించి ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉండగా ఇంతలోనే ఆమె చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.

  • Published Mar 06, 2024 | 10:05 AMUpdated Mar 06, 2024 | 10:49 AM
మరికొన్ని గంటల్లో ప్రీ వెడ్డింగ్‌ షూట్‌.. పది రోజుల్లో పెళ్లి.. ఇంతలోనే

ఇటీవల కాలంలో నగరంలోని సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లా ఆత్మహత్యలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఈ ఘటనలలో మహిళ సాఫ్ట్ వేర్ లే ఎక్కువగా ఉన్నారు. తరుచు ఏదో ఒక కారణంతో ఇలా ఆత్మహత్యలు చేసుకొని తమ జీవితాన్ని అర్ధంతరంగా ముగిస్తున్నారు. ఇక ఈ ఆత్మహత్యకు పాల్పడటానికి వేధింపులు, ప్రేమించిన వ్యక్తి మోసం చేయడం లేక దూరం అవ్వడం వంటి కారణాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే తాజాగా హైదరాబాద్ లో జరిగిన ఓ ఘటన మాత్రం అందుకు భిన్నంగా ఉంటుంది . మరో పది రోజుల్లో పెళ్లి పెట్టుకున్న యువతి, ఇంకొద్ది గంటల్లో కాబోయే భర్తతో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉండగా..ఇంతలోనే ఆమె చేసిన పనికి అందరూ నివ్వెరపోయారు. ఇక ఆ యువతి చేసిన పనికి అటు కుటుంబ సభ్యులతో పాటు కాబోయే భర్త కూడా షాక్ కు గురయ్యాడు. అసలు ఏం జరిగిదంటే..

హైదరాబాద్ లోని ఓ మహిళ సాఫ్ట్ వేర్ మరి కొద్ది గంటల్లో ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. కానీ, ఇంతలోనే ఆమె ఊహించన విధంగా ఆత్మహత్యకు పాల్పడిన ఘటన గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కాగా, ఈ ఘటనలో ఎస్ఐ భఆను ప్రసాద్ తెలిపిన వివరాలు మేరకు.. రాజన్న సిరిసిల్ల జిల్లా, గొసుకులపల్లికి చెందిన ముద్దం విద్యశ్రీ(23) కొత్తగూడలోని పీజీ హస్టల్ లో ఉంటూ.. సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తోంది. అయితే సోమవారం సాయంత్రం హస్టల్ లోని విద్యశ్రీ బాత్ రూమ్ కు వెళ్లి చాలాసేపు అయిన తిరిగి బయటకు రాలేదు. దీంతో ఆమె రూమ్ మేట్స్ తలుపులు తెరిచి చూడగా.. విద్యశ్రీ టవల్ తో షవర్ రాడ్ కు ఉరి వేసుకొని కనిపించింది. దీంతో వారు వెంటనే సమీపంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాత్రి మృతి చెందింది.

కాగా, ఈమెకు ఇటీవలే పెళ్లి కూడా నిశ్చయమైంది. పైగా ఆ పెళ్లికి సంబంధించిన కార్డులను కూడా పంపిణీ చేసి షాపింగ్ పూర్తి చేసింది. ఇక బుధవారం ప్రీ వెడ్డింగ్ షూట్ జరగాల్సి ఉంది. కానీ ఇంతలోనే ఇలా ఘోరానికి ఒడిగట్టడంతో తీవ్ర అనుమానాలు నెలకొన్నాయి. అయితే మృతిరాలు కాబోయే భర్త హస్టల్ వద్దకు వచ్చి మాట్లాడి వెళ్లిన తర్వాత ఈ ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు పేర్కొన్నారు. ఇక ఈ ఆత్మహత్యకు కారణాలు ఇంక తెలియాల్సి ఉందన్నారు.అలాగే కేసు నమోదు చేసుకొని మరిన్ని కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తునమని తెలిపారు. మరి, మరో పది రోజుల్లో పెళ్లి పెట్టుకున్న యువతి ఇలా అర్ధంతరంగా తనువు చలించిన ఘటన పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetgrandpashabetJojobet Girişbetewin girişgrandpashabet