iDreamPost
android-app
ios-app

రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

Telangana Rythu Runa Mafi: తెలంగాణలో రైతు రుణ మాఫీ పథకం ప్రారంభమైంది. తొలి విడతగా గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Telangana Rythu Runa Mafi: తెలంగాణలో రైతు రుణ మాఫీ పథకం ప్రారంభమైంది. తొలి విడతగా గురువారం సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి రుణమాఫీ పథకాన్ని ప్రారంభించారు. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

రుణమాఫీ నిధులను విడుదల చేసిన సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ రైతులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన సమయం రానే వచ్చింది. కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఒకటైన రైతు రుణమాఫీ గురువారం జరిగింది. రైతులకు రూ.2లక్షల వరకు రుణమాఫీ పథకాన్ని రేవంత్ రెడ్డి సర్కార్ ప్రారంభించింది. సోమవారం సాయంత్రం 4.30 గంటలకు సెక్రటేరియట్ నుంచి రుణమాఫీ నిధుల విడుదలకు శ్రీకారం చుట్టారు. రాష్ట్రవ్యాప్తంగా 110 రైతువేదికల్లోని రైతులతో నిర్వహించే వీడియోకాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్‌ రెడ్డి తొలి విడతలో రూ.లక్ష లోపు రుణాల మాఫీని ప్రారంభించింది. ఈ క్రమంలోనే 11.50 లక్షల మంది రైతుల రుణ బ్యాంకు ఖాతాల్లో రూ.లక్ష వరకు డబ్బులు జమ కానున్నాయి. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే..

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజల్లోకి వెళ్లింది. ఇక ఎన్నికల అనంతరం ఘన విజయంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. ఇది ఇలా ఉంటే..ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఇప్పటికే మహాలక్ష్మీ, గృహలక్ష్మీ, 200 యూనిట్ల ఉచిత కరెంట్ ను అందిస్తుంది. అయితే ఇదే సమయంలో రైతురుణమాఫీ కూడా ఆరు గ్యారెంటీలో ఒకటిగా ఉంది. ఈ రుణమాఫీ ఎప్పుడు జరుగుతుందా అని రైతులు వెయ్యికళ్లతో ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి..దాదాపు ఎనిమిది నెలలు దాటింది.

ఈ నేపథ్యంలోనే పంటల రుణమాఫీకి సంబంధించి..ఎటువంటి స్పష్టత రాలేదు. ఈ క్రమంలోనే పంటరుణమాఫీ ఎప్పుడెప్పుడు జరుగుతుందా అని ఎదురు చూసే రైతులకు…ఆ శుభదినం రానే వచ్చింది.  గురువారం రైతురుణమాఫీ పథకానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గురువారం 4.30 గంటలకు రైతుల రుణమాఫీ చేస్తూ..సీఎం రేవంత్ రెడ్డి నిధులు విడుదల  చేశారు. ఆగష్టు దాటక ముందే రైతు రుణమాఫీలు చేస్తామని గతంలో రేవంత్ సర్కార్ చెప్పింది. ఆ విధంగానే నేడు పంటల రుణమాఫీ నిధులను విడుదల చేసింది.  మూడు విడతల్లో రైతు రుణమాఫీ నిధులు విడుదల కానున్నాయి.

తొలి విడతలో భాగంగా ఇవాళ రూ.లక్ష లోపు రుణాలున్న 11.50 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేశారు. ఆగస్టు 15 నాటికి రూ.2లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేయనున్నారు. పాస్‌ బుక్‌ ఆధారంగానే రైతు రుణ మాఫీ చేయనున్నారు.  అయితే ఈ నెలాఖరులోగా లక్షన్నర లోపు రుణాలను మాఫీ చేస్తారు. రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్లను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. రుణమాఫీ కోసం అవసరమైన నిధులను ఆర్థికశాఖ ఇప్పటికే బ్యాంకుల ఖాతాల్లోకి జమ చేసింది. నేడు విడుదల చేసిన రూ. లక్ష లోపు రుణాల మొత్తం రూ. 6 వేల కోట్లకుపైగా చేసింది.

ఇదే సమయంలో రూ.లక్ష లోపు రుణమాఫీ వర్తించే అన్నదాతల జాబితాను కూడా అన్ని జిల్లాల వ్యవసాయాధికారులకు వెళ్లాయి. రైతు రుణమాఫీకి సంబంధించిన నిధుల జమ అయిన మెసేజ్ సంబంధిత రైతుకు వెళ్లనుంది. ఇక నిధుల విడుదల సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కా, ఇతర మంత్రుల రైతు  రుణమాఫీకి సంబంధించి పలు అంశాలను ప్రస్తావించారు.  ఈ రోజు రైతులకు పండగ రోజు అంటూ  మంత్రులు తెలిపారు.