iDreamPost
android-app
ios-app

వీడియో: ఘోర ప్రమాదం…సినిమా తరహాలో పల్టీలు కొట్టిన కారు!

సంక్రాంతి పండగ పూట ఘోర విషాదం చోటుచేసుకుంది. అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా..ముగ్గురిని ఆస్పత్రి పాలు చేసింది. సినిమా తరహాలో పల్టీలు కొట్టిన కారు ప్రమాద ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

సంక్రాంతి పండగ పూట ఘోర విషాదం చోటుచేసుకుంది. అతివేగం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకోగా..ముగ్గురిని ఆస్పత్రి పాలు చేసింది. సినిమా తరహాలో పల్టీలు కొట్టిన కారు ప్రమాద ఘటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది.

వీడియో: ఘోర ప్రమాదం…సినిమా తరహాలో పల్టీలు కొట్టిన కారు!

సినిమాల్లో వాహనాలు గాల్లో ఎగరడం చూశాం. అంతే కాదు.. రోడ్డుపై కార్లు, బస్సులు పల్టీలు కొట్టే విధానం కూడా సినిమాల్లో  ఓ రేంజ్ లో చూపిస్తారు. అలాంటి సీన్లు చూసినప్పుడు మనం ఓ రకమైన ఆశ్చర్యానికి లోనవుతాము. అందులోనూ ఒక్కడు కూడా బతికే ఛాన్స్ లేదు అంటూ దీర్ఘాలు తీస్తుంటాము. అయితే అది సినిమా కాబట్టి.. పెద్దగా భయం అనిపించదు. కానీ నిజ జీవితంలో కూడా సినిమా తరహాలోని రోడ్డు ప్రమాదాలు కూడా జరుగుతుంటాయి. ఆ ఘటనలు ప్రత్యక్షంగా చూసిన, ఈ వీడియోలు చూసిన ఒళ్లు గగుర్పొడుస్తుంది. తాజాగా సిద్దిపేట జిల్లాలో ఓ కారు తొమ్మిది పల్టీలు కొట్టింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అతి వేగం ప్రమాదకరం, మద్యం తాగి వాహనం నడపరాదు.. ప్రభుత్వాలు, పోలీసులు ఎన్ని రకాలుగా ప్రచారం చేసిన కొందరిలో మార్పు రావడం లేదు.  అతివేగంగా వెళ్తూ.. ఇతర వాహనాలను ఓవర్ టేక్ చేసే క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురవుతున్నారు. తాజాగా సిద్ధిపేట జిల్లాలో అదే తరహాలో ఓ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కరీంనగర్ నుంచి హుస్నాబాద్ వెళ్తున్న ఓ కారు..ముందు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఓవర్ టెక్ చేసే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో   స్పీడ్ కంట్రోల్ కాకపోవడంతో బస్సును దాటిన తరువాత కారు పల్టీలు కొట్టింది. సినిమా తరహాల్లో దాదాపు 9 పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, ముగ్గురికి గాలైనట్లు తెలుస్తోంది. కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు కారులో నుంచి ఎగిరి బయట పడటంతో ప్రాణాలు దక్కించుకున్నారు. మరొకరు కారు కింద పడి అక్కడికక్కడే చనిపోయారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో సీసీ టీవీలో రికార్డు అయింది. కారు బోల్లా పడినప్పుడు ముందు ఓ బైకు వెళ్తుంది.  ఆ ద్విచక్ర వాహనంపై ఉన్న వారికి తృటిలో ప్రమాదం తప్పింది. ఆ బైక్ వేగం కాస్త తగ్గినా పల్టీలు కొడుతున్న కారు వచ్చి వారిని ఢీ కొట్టేది. ఆ సమయంలో వారు వేగంగా వెళ్లడంతో ప్రాణాలతో బయట పడ్డారు. ఈ ఘటన అందరిని భయాందోళనకు గురి చేసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు.  ఈ  రోడ్డుప్రమాదంపై  కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఈ రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకుడి యశ్వంత్ గా పోలీసులు గుర్తించారు.

గాయపడిన వారు అజయ్, వెంకటేష్, అఖిల్ గా గుర్తించారు. క్షతగాత్రులను హుస్నాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వీరందరూ హుస్నాబాద్ కు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కరీంనగర్ కి వెళ్లి..తిరుగు ప్రయాణంలో హుస్నాబాద్ వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న బాధితుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మరీ.. ఇలాంటి ప్రమాదాల నివారణకు చర్యలు ఏమిటి?. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.