P Krishna
Bhadradri Kothagudem: ప్రస్తుతం శ్రావణ మాసం పెళ్లిళ్ల సందండి మొదలైంది. మూడు నెలల తర్వాత మంచి ముహూర్తాలు మొదలు కావడంతో రాష్ట్రమంతా పెళ్లి భాజాలు మోగుతున్నాయి.
Bhadradri Kothagudem: ప్రస్తుతం శ్రావణ మాసం పెళ్లిళ్ల సందండి మొదలైంది. మూడు నెలల తర్వాత మంచి ముహూర్తాలు మొదలు కావడంతో రాష్ట్రమంతా పెళ్లి భాజాలు మోగుతున్నాయి.
P Krishna
వేసవి కాలం అనగానే పెళ్లిళ్ల సీజన్ మొదలవుతుంది. కానీ ఈ ఏడాది మాత్రం అందుకు విరుద్దంగా కొనసాగింది. ఏప్రిల్ 29 నుంచి మూడు నెలల పాటు వైశాఖ, జ్యేష్ట, ఆషాఢ మాసాల్లో గురు, శుక్ర మౌఢ్యమి వల్ల ముహూర్తలు లేవని పండితులు వెల్లడించిన విషయం తెలిసిందే. దీంతో వివాహాలు, నూతన గృహ ప్రవేశాలు, శంకుస్థాపనలకు బ్రేక్ పడింది. ఇక జులై 6 నుంచి ఆగస్టు 4 వరకు ఆషాఢ మాసం ఉండటంతో శుభకార్యాలు ఏవీ జరగలేదు. ఆగస్టు 5 నుంచి శ్రావణ మాసం మొదలైంది. వరుసగా పండుగలు, పెళ్లిళ్ల సందడి మొదలైంది. ఆ ఇద్దరు వ్యవసాయ కుటుంబానికి చెందిన వారు.. ఒకరంటే ఒకరు ఇష్టపడ్డారు. పెద్దల అంగీకరించారు.. నిశ్చితార్థం చేసుకొని త్వరలో పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దమయ్యారు. అంతలోనే వారి జీవితంలో అనుకోని సంఘటన జరిగింది. వివరాల్లోకి వెళితే..
పెద్దలు అన్నట్లు తానొకటి తలిస్తే.. దైవం మరొకటి తలిచినట్లు.. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన జంట ప్రమాదవశాత్తు మృత్యుఒడిలోకి చేరారు. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.. అశ్వాపురం మండలం తుమ్మలచెరువు గ్రామానికి చెందిన కృష్ణయ్య, ఆది లక్ష్మి దంపతులకు ఇద్దరు కొడుకులు, ఒక కూతురు ఉన్నారు. రెండో కొడుకు తాటి ప్రసాద్ (25). ఇంటి వద్దే ఉంటే వ్యవసాయం చేసుకుంటున్నాడు. కొద్ది రోజుల క్రితం ఓ సందర్భంలో నాగమణి అనే అమ్మాయిని చూసి ఇష్టపడ్డాడు. పెద్దలకు చెప్పడంతో ఇరు కుటుంబాలు అంగీకరించి నాగమణితో ప్రసాద్ వివాహం నిశ్చయించారు. వ్యవసాయ పనులు పూర్తయిన తర్వాత మంచి రోజు చూసి నిశ్చితార్థం, పెళ్లి జరిపించాలని నిర్ణయించారు.
వెంకన్న, లింగమ్మ ఏకైక సంతానం నాగమణి. కొంతకాలం క్రితం నాగమణి తండ్రి కన్నుమూశాడు.. తల్లి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తుంది. నాగమణితో సంబంధం నిశ్చయమైన తర్వాత ప్రసాద్ వారికి చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నాడు. ఈ క్రమంలోనే ట్రాక్టర్ తీసుకొని ఆదివారం కమలాపురం గ్రామానికి వెళ్లాడు. అక్కడే తన ట్రాక్టర్ తో నాగమణి వ్యవసాయ భూమిలో పనులు చేస్తున్నాడు. సోమవారం రాఖీ పండుగ కావడంతో ప్రసాద్ సోదరి ఇంటికి వస్తున్నా అని చెప్పింది. అయితే ప్రసాద్ కి వీలు కాక రాత్రి బాగా పొద్దుపోయిన తర్వాత తన ట్రాక్టర్ పై అశ్వాపురం బయలుదేరాడు. తర్వాత నాగమణి గ్రామంలోని వేరొకరి వాహనంపై ప్రసాద్ కు ఎదురుగా వెళ్లి ఇంత రాత్రి వేళ ట్రాక్టర్ పై ప్రయాణం చేయవొద్దని మరుసటి రోజు వెళ్లవొచ్చు అని సర్ధి చెప్పి తాను కూడా ట్రాక్టర్ ఎక్కింది. వారిద్దరూ తిరిగి కమలాపురం వస్తున్నారు.దంతెలబోరు నుంచి ములకలపల్లి మార్గంలో కొత్తూరు వద్ద మృత్యువు వెంటాడింది. ప్రసాద్ నడుపుతున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడింది.. ఈ ఘటనలో ఇద్దరూ స్పాట్ లోనే దుర్మరణం చెందారు. పండగ పూట విషాదం నెలకొనడంతో ఇరు కుటుంబాలు కన్నీరుమున్నీరయ్యారు. త్వరలో పెళ్లి పీటలెక్కాల్సిన జంట ఇలా మృత్యుఒడిలోకి చేరారే అంటూ గ్రామస్థులు సైతం శోకసంద్రంలో మునిగిపోయారు.