Krishna Kowshik
హైదరాబాద్ అంటే చార్మినార్.. ఆ తర్వాత బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ అనగానే చాలా మంది లొట్టలేసుకుని తింటుంటారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు సైతం బిర్యానీ టేస్ట్ చూడకుండా వెళ్లలేదు. కానీ..
హైదరాబాద్ అంటే చార్మినార్.. ఆ తర్వాత బిర్యానీ. హైదరాబాద్ బిర్యానీ అనగానే చాలా మంది లొట్టలేసుకుని తింటుంటారు. ఇతర ప్రాంతాల నుండి వచ్చిన వారు సైతం బిర్యానీ టేస్ట్ చూడకుండా వెళ్లలేదు. కానీ..
Krishna Kowshik
కడుపులో ఎలకలు పరిగెతున్నా..బాగా ఆకలేస్తుందని.. పిల్లలు మారాం చేస్తున్నా..అలాగే ఇంట్లో ఖాళీ గిన్నెలు కనిపిస్తూ వెక్కిరిస్తున్నా.. నా వల్ల కాదు బాబోయ్ ఇప్పటికి ఏదైనా ఆర్డర్ చేసేయండని భార్య ఆర్డర్ వేసినా.. చకా చకా ఫోన్ తీసి.. టకా టకా ఆర్డర్ పెట్టేస్తున్నారా.. లేదా సమీపంలోని ఫేమస్ రెస్టారెంట్‌కు వెళ్లి.. బిర్యానీ తిందామనుకుంటున్నారా.. అయితే ఒక్కసారి చెక్ చేసుకుని తినండి. ఎందుకంటే.. ఈ మధ్య కాలంలో బిర్యానీ అంటే భయంగొల్పే సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి మరీ. ఇటీవల హైదరాబాద్ రాజేంద్ర నగర్‌లోని ఓ రెస్టారెంట్‌లో బిర్యానీలో బల్లితోక కనిపించింది. ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని రెస్టారెంట్‌లో చనిపోయిన బల్లి దర్శనమిచ్చిన సంగతి విదితమే.
ఇప్పుడు మరో రెస్టారెంట్‌లో నిర్వాకం బయటకు వచ్చింది. అదీ కూడా హైదరాబాద్‌లోనే. హైదరాబాద్ అంటే బిర్యానీనే. బిర్యానీని తినేందుకు చాలా మంది రెస్టారెంట్లను ఆశ్రయిస్తుంటారు. మంచి ఆంబియెన్స్, అదిరిపోయే రేట్స్ పెట్టినా.. బిర్యానీ మీద ఉన్న ఎమోషన్‌తో వచ్చి తింటుంటారు. కానీ శుచి, శుభ్రత విషయంలో మాత్రం నాణ్యతా ప్రమాణాలను గాలికి వదిలేస్తున్నారు. తాజాగా జూబ్లీహిల్స్ లాంటి హై క్లాస్ సొసైటీ పీపుల్స్ వచ్చే ఓ రెస్టారెంట్ వడ్డించిన బిర్యానీలో ఈ సారి చనిపోయిన బొద్దింక దర్శనమిచ్చింది. దీన్ని చూసి అతడు ఖంగు తిన్నాడు.
బిర్యానీ తిందామని వచ్చి.. ఆర్డర్ చేయగా..వెయిటర్ తీసుకు వచ్చి కస్టమర్‌కు అందించాడు. అతడు తింటుండగా.. అందులో చచ్చిన బొద్దింక కనిపించింది. దీంతో షాక్ అయ్యి వెంటనే బొద్దింకతో పాటు ఆ రెస్టారెంట్ మొత్తాన్ని వీడియో తీశాడు. అనంతరం మీ మేనేజర్ ఎక్కడ అంటూ అక్కడున్న వెయిటర్స్ ను అడిగాడు. ఆయనను పిలవండి అంటూ ప్లేటులో వచ్చిన బొద్దింకను చూపించాడు. నాణ్యత విషయంలో ఇంత నిర్లక్ష్యం ఎందుకు అంటూ ప్రశ్నించారు. ఇదేనా కస్టమర్లకు అందించే బెస్ట్ సర్వీస్ అంటూ నిలదీశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసి బిర్యానీ పట్ల విరక్తి రావచ్చేమో.. ఏమంటారు..?
A customer found a dead cockroach in the biryani which was served to him, at a famous restaurant, in Jubilee Hills, Hyderabad.@AFCGHMC @CommissionrGHMC#CockroachInBiryani #Hyderabad #Biryani #CockroachBiryani pic.twitter.com/jDxxIBjAXk
— Surya Reddy (@jsuryareddy) January 9, 2024