Dharani
MLA Lasya Nanditha: కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత.. కారు ప్రమాదంలో మృతి చెందింది. అయితే ఆమె మృతికి 3 ప్రధాన కారణాలు చెబుతున్నారు పోలీసులు. ఆ వివరాలు..
MLA Lasya Nanditha: కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే లాస్య నందిత.. కారు ప్రమాదంలో మృతి చెందింది. అయితే ఆమె మృతికి 3 ప్రధాన కారణాలు చెబుతున్నారు పోలీసులు. ఆ వివరాలు..
Dharani
బీఆర్‌ఎస్ పార్టీలో తీవ్ర విషాదం నెలకొంది. ఆ పార్టీ నుంచి కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా గెలుపొందిన లాస్య నందిత శుక్రవారం ఉదయం చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడిన ఆమె.. స్పాట్‌లోనే చనిపోయారు. ఎమ్మెల్యే లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పి.. డివైడర్‌ను ఢీ కొట్టడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ఇక ఈ దుర్ఘటనలో ఎమ్మెల్యే లాస్య నందిత.. స్పాట్‌లోనే మృతి చెందగా.. కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఎమ్మెల్యే మృతదేహానికి పటాన్‌చెరువు ఏరియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం నిర్వహించనున్నారు. ఇక లాస్య నందిత మృతికి 3 ప్రధాన కారణాలు ఉన్నాయంటున్నారు పోలీసులు. ఆ వివరాలు..
లాస్య నందిత ప్రయాణిస్తున్న కారు.. శుక్రవారం ఉదయం మేడ్చల్ నుంచి పటాన్‌చెరువు వస్తుండగా ప్రమాదానికి గురైంది. ఆమె మృతికి ప్రధాన కారణం అతివేగం, డ్రైవర్ నిద్రమత్తు అని పోలీసులు అనుమానిస్తున్నారు. నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. తమ కారు ముందు వెళ్తోన్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసే ప్రయత్నంలో సడన్ బ్రేక్ వేశాడు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారు.. అదుపు తప్పి ఔటర్ రింగ్ రోడ్డు రెయిలింగ్‌ను ఢీకొట్టడంతో.. యాక్సిడెంట్ జరిగింది.
ఇక రెండో కారణం యాక్సిడెంట్ జరిగిన సమయంలో ఎమ్మెల్యే లాస్య నందిత సీటు బెల్టు పెట్టుకోలేదని తెలిసింది. దాని వల్ల ఆమె ఇంటర్నల్ పార్ట్స్ డ్యామేజ్ అయ్యి.. ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది అంటున్నారు పోలీసులు. సీటు బెల్ట్ పెట్టుకుని ఉంటే.. గాయాలతో బయటపడేవారని.. ఇత దారుణం జరిగేది కాదని వారు చెబుతున్నారు.
ఇక మూడో కారణం ఏంటి అంటే.. లాస్య నందిత ప్రయాణిస్తున్న మారుతీ సుజుకీ ఎక్స్‌ఎల్6 కారుకి సేఫ్టీ రేటింగ్ తక్కువగా ఉంది. అది తెలిసి కూడా వారు అతివేగంతో ప్రయాణించడం ప్రమాదానికి మరో కారణం అంటున్నారు పోలీసులు. ఇక యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడ్డ డ్రైవర్‌ను మదీనాగూడ శ్రీకర హాస్పిటల్‌కు తరలించారు.
అయితె నెల రోజుల వ్యవధిలోనే లాస్య నందితను రెండు ప్రమాదాలు వెంటాడాయి. ఈనెల 13న కూడా ఆమె కారు ప్రమాదానికి గురైంది. నల్గొండలో కేసీఆర్ నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన లాస్యనందిత హైదరాబాద్ తిరిగి వస్తుండగా.. నార్కట్‌పల్లి వద్ద రోడ్డు ప్రమాదానికి గురైంది. ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపక్కకు దూసుకెళ్లటంతో ఓ హోంగార్డు మృతి చెందాడు. ఈ ప్రమాదంలో లాస్య నందిత స్వల్పగాయాలతో బయటపడింది. ఈ యాక్సిడెంట్ జరిగి పది రోజులు గడవకముందే మరో రోడ్డు ప్రమాదంలో ఆమె మృతి చెందడం విషాదకరం.
గతేడాది లాస్య నందిత తండ్రి తండ్రి సాయన్న మృతి చెందాడు. ఇక తండ్రి కోరిక మేరకు లాస్య నందిత రాజకీయాల్లోకి వచ్చారు. 2015లో జరిగిన కంటోన్మెంట్ బోర్డు ఎన్నికల్లో పికెట్ నాలుగో వార్డు నుంచి సభ్యురాలిగా పోటీ చేసిన ఆమె ఓడిపోయారు. బీటెక్ చదివిన ఆమె 2016 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు. 2021 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆమె మరోసారి కవాడిగూడ కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. ఇక గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా విజయం సాధించారు.