P Venkatesh
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఓటు వేసే పోలింగ్ బూత్ వివరాలు ఇలా ఉన్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నిల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. రేపు ఉదయం ఏడు గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ సెలబ్రిటీలు తమ ఓటు వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. వారు ఓటు వేసే పోలింగ్ బూత్ వివరాలు ఇలా ఉన్నాయి.
P Venkatesh
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఎన్నికల అధికారులు పోలింగ్ సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. తెలంగాణ ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు సొంతూర్లకు పయనమయ్యారు. ఓటింగ్ శాతం పెంచడమే లక్ష్యంగా ఎన్నికల కమిషన్ అవసరమైన చర్యలు తీసుకుంది. ప్రజలంతా తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం కల్పించేందుకు గాను ప్రభుత్వ ప్రైవేట్ కార్యాలయాలకు సెలవు కూడా ప్రకటించింది. కాగా సాధారణ ప్రజలతో పాటు టాలీవుడ్ ప్రముఖులు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఆ పోలింగ్ బూత్ లలో సెలబ్రిటీలు ఓటు వేయనున్నారు. ఆ పోలింగ్ బూత్ లు ఏవంటే?
తెలంగాణలో నిన్నటితో ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలో ప్రధాన రాజకీయపార్టీలైన బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పోటీపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించాయి. ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రణాళికలు రచించాయి. ఇక ఇప్పుడు అందరి దృష్టంతా పోలింగ్ పై పడింది. ఓటర్లు అందరు పోలింగ్ లో పాల్గొనేలా చర్యలు చేపడుతున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ ప్రముఖులు, హీరోహీరోయిన్లు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు రెడీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో సెలబ్రిటీలు ఓటు వేసే పోలింగ్ బూత్ లపై అందరి దృష్టి పడింది. ఎవరెవరు ఎక్కడ ఓటు వేయనున్నారని అటు మీడియాతో పాటు ఫ్యాన్స్ కూడా తెగ వెతికేస్తున్నారు. మరి సెలబ్రిటీలు ఓటు వేయనున్న పోలింగ్ బూత్ లు ఏవో ఇప్పుడు చూద్దాం..
హైదరాబద్ లోని జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ (పోలింగ్ బూత్ 165)లో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు ఆయన సతీమణి నమ్రత ,మంచు మోహన్‌బాబు, విష్ణు, లక్ష్మి, మనోజ్ తమ ఓట్లను వేయనున్నారు. పోలింగ్ బూత్ 164 లో విజయ్ దేవరకొండ, ఆనంద్ దేవరకొండ ,శ్రీకాంత్ తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఫిలీంనగర్ కల్చరల్ సెంటర్ (పోలింగ్ బూత్ 164) లో రాఘవేంద్రరావు, జీవిత, రాజశేఖర్ ఓటు వేయనున్నారు. పోలింగ్ బూత్ 160 లో విశ్వక్‌సేన్, పోలింగ్ బూత్ 166లో దగ్గుబాటి రాణా, సురేశ్ బాబు ఓటు వేయనున్నారు. అదేవిధంగా జూబ్లీహిల్స్ క్లబ్ (పోలింగ్ బూత్ 149)లో చిరంజీవి, సురేఖ, రాంచరణ్, ఉపాసన , నితిన్ తమ ఓటును వినియోగించుకోనున్నారు. ఎంపీ, ఎమ్మెల్యే కాలనీ(పోలింగ్ బూత్ 157)లో రవితేజ ఓటు వేయనున్నారు.
ఓబుల్‌రెడ్డి స్కూల్(పోలింగ్ బూత్ 150)లో జూనియర్ ఎన్టీఆర్, ప్రణతి, బీఎస్‌ఎన్‌ఎల్ సెంటర్ (పోలింగ్ బూత్ 153)లో అల్లు అర్జున్, స్నేహారెడ్డి , అల్లు అరవింద్, అల్లు శిరీష్ ఓటు వేయనున్నారు. అలాగే వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్(పోలింగ్ బూత్ 151)లో నాగార్జున, అమల, నాగచైతన్య, అఖిల్ ఓటు వేస్తారు. మణికొండలోని హైస్కూల్ లో ప్రభాస్, అనుష్క, వెంకటేశ్, బ్రహ్మానందం తమ ఓటును వినియోగించుకోనున్నారు. షేక్ పేట్ ఇంటర్నేషనల్ స్కూల్ లో రాజమౌళి, రమారాజమౌళి ఓటు వేయనున్నారు. రోడ్ నెం.45, జూబ్లీహిల్స్ –ఆర్థిక సహకార సంస్థ వద్ద గల పోలింగ్ బూత్ లో అల్లరి నరేశ్ ఓటు వేయనున్నారు. అదేవిధంగా యూసఫ్‌గూడ చెక్‌పోస్టు ప్రభుత్వ పాఠశాలలో గల పోలింగ్ బూత్ లో తనికెళ్ల భరణి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక సెలబ్రిటీల రాకతో ఆయా పోలింగ్ బూత్ ల వద్ద సందడి వాతావరణం నెలకొంటుంది.