iDreamPost

తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ కొత్త లిరిక్స్ ఇవే!

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ పాటను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ పాటలోని కొన్ని పదాలను మార్చి కొత్త లిరిక్స్ ను రూపొందించారు.

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అధికారిక గీతంగా జయ జయహే తెలంగాణ పాటను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఒరిజినల్ పాటలోని కొన్ని పదాలను మార్చి కొత్త లిరిక్స్ ను రూపొందించారు.

తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ కొత్త లిరిక్స్ ఇవే!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంచలన నిర్ణయాలతో పాలనలో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో సోషల్ మీడియా మొదలుకొని ఎలక్ట్రానిక్ మీడియా వరకు హాట్ టాపిక్ వ్యవహారం ఏదైనా ఉందంటే అది తెలంగాణ రాష్ట్ర అధికార గీతం జయ జయహే తెలంగాణ. రేవంత్ సర్కార్ జయ జయహే తెలంగాణ పాటను రాష్ట్ర అధికారిక గీతంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాటను తెలంగాణకు చెందిన ప్రముఖ కవి అందెశ్రీ రచించారు. అయితే గతంలో జయ జయహే తెలంగాణ పాటలో ఉన్న ఒరిజినల్ లిరిక్స్ ను మార్చింది ప్రభుత్వం. ఒరిజినల్ పాటలోని కాకతీయ కళా ప్రభలు, చార్మినార్, సింగరేణి ప్రస్తావన లేకుండా కొత్త వెర్షన్ పాటను రూపొందించారు.

దీనికి సంబంధించిన ఫైనల్ లిరిక్స్ ను రెడీ చేశారు. అయితే ఇదివరకే ఒరిజినల్ పాటలోని రాచరికపు పోకడలున్న పదాలను తొలగిస్తామని సీఎం రేవంత్ వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఒరిజినల్ సాంగ్ లోని కొన్ని పదాలను మార్చి కొత్త లిరిక్స్ ను తయారు చేశారు. ఇక ఈ సాంగ్ కంపోజింగ్ బాధ్యతలను ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణికి అప్పగించడంపై దుమారం రేగింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన వ్యక్తికి తెలంగాణ అధికారిక గీతం స్వరకల్పన బాధ్యతను అప్పగించడం ఏంటని బీఆర్ఎస్ శ్రేణులు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. మరో వైపు కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ అధికార చిహ్నంలో కూడా మార్పులకు శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఇక జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్ ను చూసేయండి.

జయ జయహే తెలంగాణ ఫైనల్ పాట లిరిక్స్:

జయ జయహే తెలంగాణ జననీ జయకేతనం

ముక్కోటి గొంతుకలు ఒక్కటైన చేతనం

తర తరాల చరిత గల తల్లీ నీరాజనం

పద పదాన నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం

జై తెలంగాణ జై జై తెలంగాణ

జై తెలంగాణ జై జై తెలంగాణ

 

జాన పద జనజీవన జావళీలు జాలువార

కవి గాయక వైతాళిక కళలా మంజీరాలు

జాతిని జాగృత పరిచే గీతాల జనజాతర

అను నిత్యం నీ గానం అమ్మ నీవే మా ప్రాణం

జై తెలంగాణ జై జై తెలంగాణ

జై తెలంగాణ జై జై తెలంగాణ

గోదావరి కృష్ణమ్మలు తల్లీ నిను తడుపంగా

పచ్చని మా నేలల్లో పసిడి సిరులు పండంగా

సుఖ శాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి

ప్రతి దినమది తెలంగాణ ప్రజల కలలు పండాలి

జై తెలంగాణ జై జై తెలంగాణ

జై తెలంగాణ జై జై తెలంగాణ

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి