iDreamPost
android-app
ios-app

Telangana: తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. అలెర్ట్‌ జారీ!

  • Published Mar 19, 2024 | 11:11 AM Updated Updated Mar 19, 2024 | 11:11 AM

తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో చిరుజల్లులు కురిశాయి. ఈ క్రమంలో వచ్చే మూడు రోజులు కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ హెచ్చరించింది.

తెలంగాణలో వాతావరణం చల్లబడింది. ఇప్పటికే పలు ప్రాంతాలలో చిరుజల్లులు కురిశాయి. ఈ క్రమంలో వచ్చే మూడు రోజులు కూడా ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని.. వాతావరణ శాఖ హెచ్చరించింది.

  • Published Mar 19, 2024 | 11:11 AMUpdated Mar 19, 2024 | 11:11 AM
Telangana: తెలంగాణలోని ఈ జిల్లాల్లో వర్షాలు.. అలెర్ట్‌ జారీ!

వేసవి కాలం ఇంకా పూర్తిగా మొదలుకాకముందే.. ఎండల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న క్రమంలో.. ప్రజలు అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. అయితే గత రెండు రోజుల నుంచి మాత్రం వాతావరణం  చల్లబడింది. తెలంగాణాలో పలు ప్రాంతాలలో చిరు జల్లులు కూడా కురిశాయి. దీనితో ప్రజలకు కాస్త ఎండ తీవ్రత నుంచి విముక్తి లభించినట్లయింది. ఉపరితల ద్రోణి ప్రభావం కారణంగా వాతావరణంలో ఇలాంటి ఆకస్మిక మార్పులు చోటు చేసుకున్నట్లు.. వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలో తెలంగాణాలో పలు ప్రాంతాలలో ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ప్రకటన విడుదల చేశారు.

సోమవారం పలు ప్రాంతాలలో చిరు జల్లులు కురిశాయి. రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్‌ జిల్లాల్లో వడగళ్ల వాన పడింది. ఇక నేటి నుంచి మూడు నుండి నాలుగు రోజుల పాటు.. పలు జిల్లాలలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపారు. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొన్నారు. ఆదిలాబాద్‌, కుమురంభీం ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజిగిరి, కామారెడ్డి, మెదక్‌, సంగారెడ్డి, ఆజగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, నల్గొండ, వికారాబాద్‌, వనపర్తి, నాగర్‌కర్నూల్‌, జోగులాంబ గద్వాల, నారాయణపేట, జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు.. వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో ఆయా జిల్లాలలో ఎల్లో అలెర్ట్ ను జారీ చేశారు.

Rains in these districts of Telangana 2

కాగా, సోమవారం రోజున కురిసిన వర్షాలకు.. సిరిసిల్ల మండలంలో విద్యుత్‌ స్తంభం కూలిపోయిన కారణంగా ఓ రైతు ప్రాణాలు కోల్పోయాడు. అలాగే మెదక్ జిల్లాలోని మాసాయిపేట మండలంలో అత్యధికంగా .. 3.7 సెం.మీ, శంకరంపేట మండలంలో 3.6 సెం.మీ వర్ష పాతం నమోదు అయింది. ఆదిలాబాద్‌ జిల్లాలోని కొన్ని మండలాల్లో జొన్న, వేరుసెనగ, మొక్కజొన్న, పొగాకు పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడు పంటలు చేతికి వచ్చే సమయంలో.. అకాల వర్షాలతో పంటలు దెబ్బతింటున్నాయని రైతులు వాపోతున్నారు. ఏదేమైనా అకాల వర్షాల కారణంగా రైతులు ఇబ్బందులకు గురి అవుతున్నారని చెప్పి తీరాలి. ఇక , రానున్న మూడు నుంచి నాలుగు రోజులపాటు రాష్ట్రంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని.. వాతావరణ శాఖ హెచ్చరించింది. మరి, ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.