తెలంగాణ డిప్యూటీ CM ఇంట్లో దొంగతనం! బెంగాల్‌లో పట్టుబడిన దొంగలు!

Theft at Deputy CM Bhatti Vikramarkas House: ఇటీవల దొంగలు రెచ్చిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు డబ్బున్న వాళ్ల ఇళ్లు టార్గెట్ చేసుకుంటూ దొంగతనాలకు పాల్పపడుతున్నారు. దొంగలతు తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంటికే కన్నం వేయడం కలకలం రేపుతుంది.

Theft at Deputy CM Bhatti Vikramarkas House: ఇటీవల దొంగలు రెచ్చిపోతున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు డబ్బున్న వాళ్ల ఇళ్లు టార్గెట్ చేసుకుంటూ దొంగతనాలకు పాల్పపడుతున్నారు. దొంగలతు తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంటికే కన్నం వేయడం కలకలం రేపుతుంది.

ఈ మధ్య చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితాన్ని గడపాలని చూస్తున్నారు. అందుకోసం దొంగతనాలు, ఎదుటి వారిని మోసం చేయడం, చిట్టీలు, స్కీములు, డ్రగ్స్ అమ్మకం ఇలా ఎన్నో రకాల దందాలు చేస్తూ డబ్బు సంపాదిస్తున్నారు. ఏదో ఒక సమయంలో పోలీసులకు చిక్కిపోతున్నారు. దొంగలు సామాన్యుల నుంచి సెలబ్రెటీలు, రాజకీయ నేతలను సైతం వదలడం లేదు. మొన్న నటుడు మోహన్ బాబు ఇంట్లో పని చేస్తున్న వ్యక్తి పదిలక్ష సోత్తుతో పారిపోయాడు.. మొత్తానికి అతన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. తాజాగా తెలంగాణ డిప్యూటీ సీఎం ఇంట దొంగతనం కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే..

తెలంగాణ సీఎం భట్టి విక్రమార్క ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆయన ఇంట్లో చోరీ జరగడం తీవ్ర కలకలం రేపింది. దొంగలు తాళం పగుల గొట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు నగదు చోరీ చేశారు. అయితే దొంగతనానికి పాల్పపడిన ఇద్దరు వ్యక్తులను పశ్చిమ బెంగాల్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ రైల్వే స్టేషన్ లో ఏడో నెంబర్ ఫ్లాట్ ఫామ్ పై జీఆర్పీ పోలీసులు తనిఖీలు చేస్తున్న సమయంలో ఇద్దరు దొంగలు అనుమానాస్పదంగా తిరడంతో వారిని అదుపులోకి తీసుకొని తనిఖీ చేయగా వారి వద్ద దొంగిలించిన సొమ్మ దొరికింది. తాము చేసిన దొంగతనం గురించి ఒప్పుకున్నారు.

నిందితులు బిహార్ కు చెందిన రోషన్ కుమార్ మండల్, ఉదయ్ కుమార్ ఠాకూర్ గా పోలీసులు గుర్తించారు. వారిని అదుపులోకి తీసుకొని విచారించగా తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసంలో దొంగతనం చేసినట్లు తెలిపారని ఖరగ్ పూర్ జీఆర్పీ ఎస్పడీ తెలిపారు. దుండగుల నుంచి 2.2 లక్షల రూపాయల నగదు, 100 గ్రాముల బంగారం నాణెం, విదేశీ కరెన్సీ నోట్లు, బంగారు వస్తువులు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నామని బెంగాల్ పోలీసులు తెలిపారు. ఈ విషయం తెలంగాణ పోలీసులకు సమాచారం అందించినట్లు వెల్లడించారు.ఇదిలా ఉంటే.. తెలంగాణలోని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ లో చోరీ ఘటనకు సంబంధించి రోషన్ కుమార్ మండల్ పేరుతో కేసు నమోదు అయినట్లు వార్తలు వస్తున్నాయి. నిందితులను ఖరగ్ పూర్ కోర్టులో హాజరు పర్చనున్నారు. ప్రస్తుతం డిప్యూటీ సీఎం భట్టి అమెరికా పర్యటనలో ఉన్నారు.. ఆయనతో పాటు కుటుంబ సభ్యులు ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అదునుగా భావించి దొంగలు ఆయన ఇంటికి కన్నం వేసినట్లు సమాచారం.

 

Show comments