Krishna Kowshik
చదువుకోవాలన్న సంకల్ప బలం అతడ్ని మృత్యువుతో కూడా పోరాడేలా చేసింది. తల్లిదండ్రులు వద్దని వారించిన కాదని చదువుకున్నాడు. ఇంటర్ పరీక్షలు కూడా రాశాడు. కానీ ఫలితాలు చూసుకోకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
చదువుకోవాలన్న సంకల్ప బలం అతడ్ని మృత్యువుతో కూడా పోరాడేలా చేసింది. తల్లిదండ్రులు వద్దని వారించిన కాదని చదువుకున్నాడు. ఇంటర్ పరీక్షలు కూడా రాశాడు. కానీ ఫలితాలు చూసుకోకుండా ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు.
Krishna Kowshik
ఆత్మ స్థైర్యంతో దేన్నైనా జయించవచ్చు అని నేటి యువత నిరూపిస్తున్నారు. ఇటీవల విడుదలైన తెలంగాణ, ఏపీ ఇంటర్, టెన్త్ ఫలితాల్లో విజయం సాధించిన విద్యార్థుల వెనుక ఎన్నో విషాద గాధలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మాత్రమే బయటకు వచ్చాయి. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ పేదింటి అమ్మాయి కూనరపు సిరి.. ఇంటర్మీడియట్‌లో 927 మార్కులు సాధించి ఎంతో మందికి స్ఫూర్తి దాయకంగా నిలిచింది. అలాగే మరో రైతు కూలీ బిడ్డ అంజలి 993 మార్కులు సాధించింది. మరో అమ్మాయి.. మూడు రోజులు కాలేజీ, మూడు రోజులు పనులకు వెళుతూ.. ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో మంచి స్కోర్ సాధించింది. ఇదిగో ఈ ఫోటోలోని యువకుడు కూడా అనారోగ్యంతోనే పోరాడుతూ పరీక్షలు రాశాడు.
కానీ ఫలితాలు రాకముందే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయాడు. ఫలితాల్లో ప్రతిభ కనబర్చిన ఈ కుర్రాడు.. మృత్యువుకు తలొంచాడు. ఇటీవల ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కాగా, అందులో 671 మార్కులతో పాసయ్యాడు. వివరాల్లోకి వెళితే..గాజుల రామారాం డివిజన్ రోడా మేస్త్రీనగర్‌కు చెందిన మీర్జా నయీమ్‌బేగ్, అస్రాబేగంలకు కుమారుడు మీర్జా హంజాబేగ్(17) కొన్నాళ్లుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అయినప్పటికీ ఏనాడు చదువును అశ్రద్ధ చేయలేదు. పట్టుదలతో 10వ తరగతి చదివి. ఆ ఏడాది పబ్లిక్ పరీక్షల్లో పస్ట్‌క్లాస్‌లో పాసయ్యాడు. అనంతరం ఇంట్లో ఉండి రెెస్ట్ తీసుకోలేదు. ఇంటర్ చదువుతానని పట్టుబట్టాడు.
దీంతో కుమారుడి కోరిక మేరకు అతడ్ని ఐడీపీఎల్‌లోని ఓ ప్రైవేట్ కళాశాలలో జాయిన్ చేశారు తల్లిదండ్రులు. రోజు రోజుకూ అనారోగ్యం క్షీణిస్తూనే ఉన్నా.. చదువును నిర్లక్ష్యం చేయలేదు. మార్చిలో అలాగే పరీక్షలు రాశాడు. ఆరోగ్యం క్షీణించడంతో అస్పత్రిలో చేరిన హంజాబేగ్ చికిత్స పొందుతూ మార్చి 27న మృతి చెందాడు. కాగా, బుధవారం ఇంటర్ ఫలితాలు విడుదల కాగా, అతడి తల్లిదండ్రులు మార్కులు చూసి భోరున విలపించారు. హంజాబేగ్ 671 మార్కులతో పాసయ్యాడు. చదువుకోవాలన్న సంకల్ప బలమే అతడ్ని మృత్యువుతో పోరాడేలా చేసింది. కానీ చివరకు విధి రాత ముందు అతడు ఓడిపోవాల్సి వచ్చింది.