Krishna Kowshik
ఇప్పుడిప్పుడే ప్రభుత్వ బడులకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారుతున్నాయి. అయినప్పటికీ కొన్ని చోట్ల సదుపాయాల లేమితో ఇక్కట్లు పడుతున్నారు విద్యార్థులు.
ఇప్పుడిప్పుడే ప్రభుత్వ బడులకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారుతున్నాయి. అయినప్పటికీ కొన్ని చోట్ల సదుపాయాల లేమితో ఇక్కట్లు పడుతున్నారు విద్యార్థులు.
Krishna Kowshik
విద్య వ్యాపారం అయినప్పటికీ.. ఇప్పటికీ ప్రభుత్వ పాఠశాలలకు వెళుతున్నారు ఎంతో మంది నిరు పేద విద్యార్థులు. ప్రభుత్వ బడులకు వెళ్లే వారి సంఖ్య పెరిగింది. నాణ్యమైన విద్యా విధానం, ఆట పాటలతో కూడిన చదువులకు ఆస్కారం లభిస్తుంది గవర్నమెంట్ బడుల్లో. విద్యతో పాటు మధ్యాహ్న భోజనం వంటి పథకాలు అమలు కావడం వల్ల ప్రభుత్వ బడులకు వెళుతున్నారు స్టూడెంట్స్. అయితే కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సరైన మౌలిక సదుపాయాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. విద్యార్థులకు తగ్గట్లు తరగతి గదులు లేక బహిరంగ ప్రాంతాల్లో, చెట్ల కింద పాఠాలు బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది జనగాం జిల్లాలోని ఓ గిరిజన బాలుర పాఠశాల.
ప్రైవేట్ బడులకు ధీటుగా ప్రభుత్వ బడుల రూపు రేఖలు మారుతున్నాయి. అయినప్పటికీ కొన్ని చోట్ల సదుపాయాల లేమితో ఇక్కట్లు పడుతున్నారు విద్యార్థులు. వాటిల్లో ఒకటి జనగామ జిల్లాలో ఉన్న ఏకైక ఏకైక గిరిజన ఆశ్రమ బాలుర పాఠశాల. ఇక్కడ అరకొర గదులతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు విద్యార్థులు. చక్కటి వాతావరణం, విద్యార్థులకు సరిపడా ఉపాధ్యాయులున్నా.. కూర్చొవడానికి గదులు మాత్రం లేవని తెలుస్తోంది. అంతే కాదు సరైన వసతి గృహం కూడా లేక.. రాత్రి వేళల్లో పాఠశాల గదుల్లోనే నిద్రిస్తున్నారు. పడుకోవడానికి ఇచ్చిన మంచాలు, గదుల్లో వేసేందుకు ఇచ్చిన బెంచీలు వేసేందుకు ప్లేసు లేక గోదాములో చేర్చారు.
ఈ బడిలో మొత్తం 294 మంది విద్యార్థలకు గానూ ఎనిమిది గదులే ఉండటంతో చెట్ల కిందే పాఠాలు చెబుతున్నారు ఉపాధ్యాయులు. ఇక వర్షం వస్తే… పక్కనే ఉన్న భోజనశాల వరండా కిందే భోదన చేస్తున్నారు. అలాగే భోజన శాలను కూడా తరగతి మాత్రమే కాదు. పడక గదిగా వినియోగించుకుంటున్నారు. సరిపడ గదుల్లేక…ఒక్కోసారి భోదన, పడుకోవడం, తినడం అన్నీ భోజనశాలలోనే అవుతున్నాయని విద్యార్థులు వాపోతున్నారు. చదువు బాగున్నా.. సరైన వసతులకు లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఈ విద్యాసంవత్సరం పాఠశాలలో 140 మంది చేరగా సరైన వసతుల్లేని కారణంగా 60 మంది వెనక్కి వెళ్లిపోయారట. పక్కనే ఉన్న సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమి నుంచి ఐదెకరాలు కేటాయించి అదనపు భవనాలు, సౌకర్యాలు కల్పించాలని విద్యార్థులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు.