iDreamPost
android-app
ios-app

చేనేత కాళాకారుడి అద్భుతం.. ఈ చీర ప్రత్యేత చూస్తే ఔరా అంటారు!

చేనేత కాళాకారుడి అద్భుతం.. ఈ చీర ప్రత్యేత చూస్తే ఔరా అంటారు!

కాదేదీ కళకు అనర్హం అన్నట్లు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన చేనేత కార్మికుడు, కళాకారుడు ‘చేనేత కళా రత్న’ అవార్డు గ్రహీత నల్లా విజయ్ ఇప్పటి వరకు ఎన్నో అద్భుతాలు సృష్టించారు. దబ్బణంలో ఇమిడే సన్నిని చీరె, అగ్గిపెట్టెలో పట్టే పట్టుచీర, సుగంధాలు వెదజల్లే చీర మరెన్నో రకాల చీరలను తయారు చేసి అందరినీ అబ్బురపరిచారు. తాజాగా మరోసారి తన కళానైపుణ్యాన్ని ప్రదర్శించి మంత్రి కేటీఆర్ ప్రశంసలు అందుకున్నారు.. వివరాల్లోకి వెళితే..

ఇప్పటి వరకు ఎన్నో రంగుల చీరలు చూశారు.. డిజిటల్ కలర్స్ తో రూపొందించిన చీరలు చూశారు.. కానీ రంగులు మార్చే చీరును ఎప్పుడైనా చూశారా? తాజాగా రాజన్న సిరిసిల్ల పట్టణానికి చెందిన నల్లా విజయ్ కుమార్ ఇప్పుడు రంగులు మార్చే చీరును తయారు చేసి అందరిచే ఔరా అనిపించాడు. ఊసరవెల్లిలా రంగులు మార్చే ఈ చీర కోసం 30 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి దారాలతో చీరను తయారు చేసినట్లు నల్లా విజయ్ కుమార్ తెలిపారు. ఈ చీర ఆరున్నర మీటర్ల పొడవు, 48 ఇంచుల వెడల్లు ఉంటుందని అన్నారు.

ఈ చీర బరువు 600 గ్రాముల వరకు ఉంటుందని.. దీన్ని నేయడానికి దాదాపు నెల రోజులు పట్టిందని అన్నారు. ఇక ఈ చీర ఖర్చు రూ.2 లక్షల 80 వేల వరకు అయ్యిందని అన్నారు. ప్రముఖ వ్యాపార వేత్త ఒకరు ఈ చీర చేయడానికి ఆర్డర్ ఇచ్చారని.. అందుకే తన కొత్త ఆలోచనలకు అద్దం పట్టేలా రంగులు మార్చే చీరను తయారు చేసినట్లు నల్లా విజయ్ కుమార్ తెలిపారు. ఈ చీరను హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయంలో సోమవారం మంత్రి కేటీఆర్ ఆవిష్కరించారు. ఇంత అద్భుతమైన చీర తయారు చేసిన విజయ్ కుమార్ ని మంత్రి కేటీఆర్ అభినందించారు. గతంలో నల్లా విజయ్ కుమార్ ప్రతిభను మెచ్చుకొని తెలంగాణ సర్కార్ ‘చేనేత కళారత్న’ అవార్డుతో సత్కరించిన విషయం తెలిసిందే.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి