iDreamPost
android-app
ios-app

TGSRTC ఉచిత ప్రయాణం.. పురుషులకు గొప్ప శుభవార్త!

  • Published Jul 24, 2024 | 9:07 AM Updated Updated Jul 24, 2024 | 9:07 AM

TGSRTC Good News: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు.

TGSRTC Good News: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తనదైన మార్క్ చూపించుకుంటున్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెరవేర్చే పనిలో నిమగ్నమయ్యారు. ఇప్పటికే మహాలక్ష్మి, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభించారు.

TGSRTC ఉచిత ప్రయాణం.. పురుషులకు గొప్ప శుభవార్త!

గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికార పార్టీ బీఆర్ఎస్ ని ఓడించి ఘన విజయం సాధించింది కాంగ్రెస్. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసినపుడు తొలి సంతకం ఆరు గ్యారెంటీ పథకాలపై చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలు తప్పని సరి నెరవేరుస్తామని పలు సందర్భాల్లో చెబుతూ వస్తున్నారు. ఇప్పటికే మహిళల కోసం మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడికైనా ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యం ఏర్పాటు చేశారు. అయితే ఉచిత ప్రయాణం పథకం ప్రారంభం అయినప్పటి నుంచి మగవాళ్లకు తీవ్ర అసౌకర్యం ఏర్పడుతుందని విమర్శలు వస్తున్న నేపథ్యంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పురుషులకు గుడ్ న్యూస్ చెప్పారు. వివరాల్లోకి వెళితే..

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలో మహిళలకు ‘మహాలక్ష్మి’ పథకాన్ని అమలు చేశారు. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణకు చెందిన ప్రతి ఒక్క ఆడబిడ్డ ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించారు. అప్పటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో రద్దీ పెరిగిపోయింది. దీంతో పురుషులకు కూర్చునేందుకు అవకాశం లేకుండా పోయింది. దాదాపు బస్సుల్లో 60 శాతం పురుషులు నిలబడే ప్రయాణం చేస్తున్నారు. ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు రావడంతో అప్రమత్తమైన  వెంటనే చర్యలు చేపట్టింది. ఆర్టీసీ బస్సుల్లో ఎంత రద్దీ ఉన్న కూర్చొని ప్రయాణించే సౌకర్యాన్ని కల్పిస్తామంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు.

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే పురుషులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా సాఫీగా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించబోతున్నట్లు తెలిపారు. త్వరలో కొత్త బస్సులను కొనుగోలు చేసేందుకు సిద్దమవుతున్నట్లు మంత్రి వెల్లడించారు. అన్ని జిల్లాల నుంచి హైదరాబాద్ చేరుకునే మెరుగైన రవాణా వసతి కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని.. 3035 ఉద్యోగాలను త్వరలో భర్తీ చేయబోతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. కొత్త బస్సులు అందుబాటులోకి వస్తే ఉగ్యోగ కల్పన జరుగుతుందని.. పురుషులకు ప్రయాణాల్లో ఇబ్బందులు తొలగిపోతాయని చెప్పుకొచ్చారు. ఇదే జరిగితే ఆర్టీసీలో పురుషులకు నిలబడి ప్రయాణించే కష్టాలు తొలగిపోతాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.