Arjun Suravaram
TGS RTC Alert: గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 1400 ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు.
TGS RTC Alert: గత కొన్ని రోజుల నుంచి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో మొత్తం 1400 ఆర్టీసీ బస్సులను రద్దు చేశారు.
Arjun Suravaram
గత రెండు రోజులుగా కురుస్తోన్న వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు గజగజ వణికిపోతున్నాయి. వరుణుడు తమపై పగబట్టినాడా అనే భావనలో ఏపీ, తెలంగాణ ప్రజలు ఉన్నారు. నెల రోజులు కురవాల్సిన వర్షం ఒక్క రోజులోనే కురిసిందంటే.. పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ భారీ వర్షాల ధాటికి తెలంగాణ రాష్ట్రంలోని పలు జాతీయ రహదారులు నీటి మునిగాయి. అంతేకాక చాలా రహదారులు వరదల ధాటికి ధ్వంసమయ్యాయి. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రంలోని ఆర్టీసీ ప్రయాణికులు కీలక అలెర్ట్ జారీ అయ్యింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు నడిచే రద్దు చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..
భారీ వానల కారణంగా టీజీఎస్ ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల బస్సులు రద్దు చేసింది. ఆదివారం రాత్రి వరకు 877 బస్సులను రద్దు చేసింది. అలానే తిరిగి సోమవారం కూడా ఉదయం నుంచి 570 బస్సులను రద్దు చేసింది. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 1400కు పైగా బస్సులను టీజీఎస్ ఆర్టీసీ రద్దు చేసింది. ప్రధానంగా మహాబూబాబాద్, ఖమ్మం, విజయవాడ వైపుగా వెళ్లే బస్సులను పూర్తిగా రద్దు చేశారు. ఆ మార్గాల్లోని రోడ్లన్నీ జలమయం కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో బస్సులను పూర్తిగా రద్దు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. వరద ఉద్ధృతి తగ్గిన తర్వాత తిరిగి బస్సులను నడుపుతామని చెప్పారు. మరికొన్ని బస్సులను దారి మళ్లించారు.
హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే బస్సులను గుంటూరు మీదుగా దారి మళ్లించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఖమ్మం జిల్లాకు యథావిధిగా బస్సులను నడుపుతున్నట్లు ఆర్టీసీ అధికారులు వివరించారు. వరద ప్రవాహం వల్ల వికారాబాద్ జిల్లాలో 212 బస్సులకు బదులు 50 మాత్రమే నడుపుతున్నట్లు రంగారెడ్డి ఆర్ఎం శ్రీలత తెలిపారు. ఇటీవల కురుసిన వరదల్లో పలు ప్రాంతాల్లో ఆర్టీసీ బస్సులు నీటిలో చిక్కుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ ప్రాంతాల్లో బస్సులు వరద నీటిలో చిక్కుకున్నాయి. అధికారులు వెంటనే చర్యలు తీసుకోవడంతో ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇలా వరదల కారణంగా ప్రమాదాలు పొంచి ఉన్న నేపథ్యంలో.. పలు ప్రాంతాల్లో ఆర్టీసీ సర్వీస్ లను రద్దు చేశారు.