iDreamPost
android-app
ios-app

Group-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 5 వేలు మీవే.. ప్రభుత్వం కీలక ప్రకటన

Group1: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారికి నెలకు 5 వేలు అందించనున్నది.

Group1: తెలంగాణలో గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో మెయిన్స్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. వారికి నెలకు 5 వేలు అందించనున్నది.

Group-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్.. 5 వేలు మీవే..  ప్రభుత్వం కీలక ప్రకటన

తెలంగాణలో ఉద్యోగాల భర్తీపై దృష్టిసారించిన ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రూప్ 1,2,3,4, తో పాటు డీఎస్సీ ద్వారా భారీగా ఉద్యోగాలను భర్తీ చేయనున్నది. కాగా ఇటీవల గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ పరీక్ష ఫలితాలను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ 1:50 నిష్పత్తిలో జులై 7న రిలీజ్ చేసింది. ఈ క్రమంలో గ్రూప్ 1 అభ్యర్థులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందించింది. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులకు మెయిన్స్ పరీక్షకు సంబంధించిన ఉచిత‌ శిక్షణ ఇవ్వనున్నట్లు బీసీ స్టడీ సర్కిల్ ప్రకటించింది.

హైదరాబాద్‌లోని తెలంగాణ స్టేట్ ఎంప్లాయిబిలిటీ స్కిల్ డెవలప్‌మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ డైరెక్టర్ శ్రీ‌నివాస్ రెడ్డి జులై 9న ఫ్రీ కోచింగ్ కు సంబంధించి ఒక ప్రక‌ట‌నలో తెలిపారు. మెయిన్స్ కు అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైనవారికి 75 రోజులపాటు శిక్షణ ఇస్తారు. గ్రూప్-1 మెయిన్స్ ఉచిత శిక్షణకు ద‌ర‌ఖాస్తు చేసే అభ్యర్థుల త‌ల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.5 ల‌క్షల లోపు ఉండాలి. అర్హులైన బీసీ, ఈబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు జులై 10 నుంచి 19 వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు స్టైపెండ్‌ కింద ఒక్కో అభ్యర్థికి నెలకు రూ.5,000 అందిస్తారు.

ఉచిత శిక్షణకు ఎంపికైన అభ్యర్థులకు హైద‌రాబాద్ సైదాబాద్‌లోని టీజీ బీసీ స్టడీ స‌ర్కిల్ (రోడ్ నెం: 8, ల‌క్ష్మీన‌గ‌ర్‌), ఖ‌మ్మంలోని టీజీ బీసీ స్టడీ స‌ర్కిల్‌లో 75 రోజులపాటు తరగతులు నిర్వహిస్తారు. ఈ నెల 22 నుంచి శిక్షణ తరగతులు ప్రారంభంకానున్నాయి. పూర్తి సమాచారం కోసం అభ్యర్థులు ఫోన్: 040- 24071178 లేదా 040-29303130 నెంబర్ల ద్వారా సంప్రదించవచ్చు. ఇక గ్రూప్ 1 ద్వారా మొత్తం 563 పోస్టులను భర్తీ చేయనున్నారు. అక్టోబర్‌ 21 నుంచి 27 వరకు మెయిన్స్‌ పరీక్షలను టీజీపీఎస్సీ నిర్వహించనుంది. మరి మీరు గ్రూప్ 1 అభ్యర్థులైతే వెంటనే అప్లై చేసుకోండి.