ఆ ఊళ్లో ఎటు చూసినా కవలలే.. ఎక్కడో తెలుసా?

Adilabad District: సాధారణంగా కవల పిల్లలు ఇంచు మించు ఒకే రూపంతో కనిపిస్తుంటారు. వాళ్లను చూసిన ప్రతిసారి తికమక పడుతుంటారు. అలాంటిది ఒక ఊళ్లో చాలా మంది కవల పిల్లలు ఉంటే పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకోండి.

Adilabad District: సాధారణంగా కవల పిల్లలు ఇంచు మించు ఒకే రూపంతో కనిపిస్తుంటారు. వాళ్లను చూసిన ప్రతిసారి తికమక పడుతుంటారు. అలాంటిది ఒక ఊళ్లో చాలా మంది కవల పిల్లలు ఉంటే పరిస్థితి ఏలా ఉంటుందో ఊహించుకోండి.

మనం అభిమానించే హీరో వెండితెరపై డబుల్ రోల్ లో కనిపిస్తే తెగ సంబరపడిపోతాం. ఒకే రూపంలో హీరోలు పక్క పక్కన కనిపిస్తే థియేటర్లలో విజల్స్, చప్పట్లతో మారుమోగిపోతుంది. సినీ ఇండస్ట్రీలో ఈ తరహా చిత్రాలు ఎన్నో వచ్చాయి. అయితే నిజ జీవితంలో కూడా ఒకే రూపాన్ని పంచుకొని పుట్టిన కవలలు ఎంతో మంది తారసపడుతుంటారు. వాల్లను చూస్తుంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు, స్నేహితులు కన్ఫ్యూజ్ అవుతుంటారు. కవల పిల్లలు పుట్టడం అనేది వంశపార్యంపరంగా జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. మరికొంతమందికి ఎలాంటి జన్యుపరమైన కారణాలు లేకున్నా కవల పిల్లలు జన్మిస్తుంటారు. ఓ ఊరిలో ఎక్కడ చూసినా కవల పిల్లలే దర్శనమిస్తుంటారు. ఇంతకీ ఆ ఊరు ఎక్కడ ఉంది.. దీనికి గల కారణం ఏంటో గెలుసుకుందాం. వివరాల్లోకి వెళితే..

ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం వడ్డాడి గ్రామంలో ఎక్కడ చూసినా ఒకే రూపంలో ఉన్న కవల పిల్లు కనిపిస్తుంటారు. నిజంగా డబుల్ యాక్షన్ సినిమా చూస్తున్నామా అన్న ఫీలింగ్ కలుగుతుంది. అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్ళు (కవలలు)లు కనిపిస్తు కనువిందు చేస్తుంటారు. ఈ కవలలో ఎవరు ఎవరూ గుర్తు పట్టలేక గ్రామస్థులు తెగ కన్ఫ్యూజ్ అవుతుంటారు. గ్రామంలో దాదాపు పది మందికిపైగా కవలలు ఉండటం గమనార్హం. అక్కాచెల్లెళ్లు, అన్నా దమ్ములకు వారి తల్లిదండ్రులు పేర్లు కూడా చాలా విచిత్రంగా పెట్టి పిలుస్తుంటారు. అనిత – వనిత, వర్షిత్- హర్షిత్, రామ్-లక్ష్మన్, గౌతమి-గాయత్రి ఇలా అన్నదమ్ములు, అక్కా చెల్లెళ్లు ఉండటంతో పాఠశాల ఉపాధ్యాయులు ఎప్పుడూ తికమకపడుతూ ఉంటారని అంటారు. ఒకరు ఇద్దరు కవలలను చూస్తేనే ఆశ్చర్యం అలాంటిది పదిమంది కవల జంటలు ఉండటంతో ప్రత్యేకత సంతరించుకుంది.

స్వయంభు లక్ష్మీనరసింహుడి కటాక్షం వల్లనే తమ గ్రామంలో కవల పిల్లలు జన్మిస్తున్నారని గ్రామస్థులు అంటున్నారు. గ్రామంలో పసిడి పంటలు కూడా బాగా పండుతాయని.. స్వామి వారిని తమ గ్రామ దేవుడిగా కొలుస్తామని గ్రామస్థులు అంటున్నారు. తమిళనాడు లోని చిన్న పట్టణం సిర్కళిలో కూడా భారీ సంఖ్యల్లో కవలలు దర్శనిమస్తుంటారు. ఇక్కడ ఓ పాఠశాలలో దాదాపు 150 మంది విద్యార్థులు కవలు ఉన్నారు. వీరిలో ఒకే పాఠశాలకు 50 మంది విద్యార్థులు వెళ్తున్నారు. ఈ ఊరిలో దశాబ్దాల కాలం నుంచి కవల సంఖ్య పెరుగుతూనే ఉందని అధికారులు తెలియజేశారు. ఇలా కవలలు జన్మించడానికి సరైన కారణం ఏంటనే విషయం పై ఇంకా స్పష్టత రాలేదని అధికారులు తెలిపారు. ఏది ఏమైనా కవలలు గా పుట్టడం మా పూర్వ జన్మ సుకృతం అని.. మాకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అంటున్నారు కవలలు.

Show comments