iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లో మొదలైన బోనాల జాతర శోభ.. గోల్కొండ‌లో మెట్ల పూజ

  • Published Jul 06, 2024 | 9:55 AM Updated Updated Jul 06, 2024 | 9:55 AM

Bonalu Festival 2024: తెలంగాణలో జులై, ఆగస్టులో వచ్చే ఆషాడ మాసంలో బోనాలు జరుపుకుంటారు. పండగ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

Bonalu Festival 2024: తెలంగాణలో జులై, ఆగస్టులో వచ్చే ఆషాడ మాసంలో బోనాలు జరుపుకుంటారు. పండగ మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఎల్లమ్మ దేవతకు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు.

హైదరాబాద్‌లో మొదలైన బోనాల జాతర శోభ.. గోల్కొండ‌లో  మెట్ల పూజ

ఆషాడ మాసం వచ్చిందంటే తెలంగాణలో గ్రామదేవతలను పూజించే సంప్రదాయం మొదలవుతుంది. గ్రామాల్లో ఈ సంప్రదాయం ఎక్కువగా కనిపిస్తుంది. బోనాల విషయానికి వస్తే.. సికింద్రబాబ్, హైదరాబాద్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకుంటారు. రాయలసీమలో కొన్ని ప్రాందాల్లో హిందువులు ఈ పండగ ఘనంగా జరుపుకుంటారు. ఇక భాగ్యనగరంలో బోనాల పండగ అంటే ఆ కళే వేరు.. దీన్ని ఆషాడం జాతర అని కూడా పిలుస్తారు. రాష్ట్రంలో పదేళ్ల తర్వాత కొత్త సర్కార్ కొలువైంది. ఈ నేపథ్యంలో బోనాల జాతర ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుంది. వివరాల్లోకి వెళితే..

ఆషాడ మాసంలో గ్రామ దేవతలను పూజించే సంప్రదాయం తెలంగాణలో విస్తృతంగా కనిపిస్తుంది. ఎక్కడ చూసినా డబ్బు చప్పుల్లతో బోనాలు ఎత్తుకొని మహిళలు అమ్మారికి సమర్పిస్తుంటారు. 1819 లో జంట నగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించినపుడు అమ్మవారు ఆగ్రహానికి గురయ్యామని భావించిన ప్రజలు అమ్మను శాంతిపజేసేందుకు ఈ జాతర చేయడం ప్రారంభించాడు. ఈ పండుగ మొదట గోల్కోండలో కొలువై ఉన్న మహంకాళి ఆలయం నుంచి ప్రారంభమై నెల రోజుల పాటు సికింద్రాబాద్, హైదరాబాద్ ఆలయాల్లో వరుసగా జరుగుతుంటాయి. భాగ్యనగరంలో ఈ ఉత్సవాల్లో భక్తులు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు. గోల్కొండలోని శ్రీ జగదాంబిక అమ్మవారి ఆలయ మార్గంలోని మెట్లకు శుక్రవారం పూజలు నిర్వహించారు.

నగరంలో ఆదివారం నుంచి బోనాల సందడి మొదలు కానుంది. మొదట గోల్కొండ కోటిలోని అమ్మవారికి తొట్టెల, తొలి బోనం సమర్పించి. ఫలహారల బండ్ల ఊరేగింపు, రంగం, బలిగంప ఊరేగింపు వంటి కార్యక్రమాలతో నగర వీధులు కోలాహలంగా మారనున్నాయి. గోల్కొండ కోటిలో నాలుగు వారల పాటు సాగే ఈ బోనాల ఉత్సవంలో భాగం 14న సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి బోనాలు, 21న లాల్ దర్వాజ శ్రీ సింహవాహిని అమ్మవారికి బోనాల జాతర జరుగుతాయి. తిరిగి బోనాల జాతరకు గోల్కొండ కోటలోని ముగిసేందుకు వీలుగా ప్రభుత్వం అన్ని ఏర్పాటు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ నెల 7 నుంచి జరిగే ఆషాఢ మాసం బోనాల జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా చూసేందుకు అన్ని విధాలుగా పకడ్భందీ ఏర్పాట్లను చేసినట్లు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. బోనాలు జరిగే ప్రాంతంలో తాగునీటి పాయింట్లను ఏర్పాటు చేశామని.. అవసరమైన డ్రమ్ములు, సింటెక్స్ ట్యాంకులు, పంపులు, పైప్ లైన్ తో పాటు వంట చేసే ప్రాంతంలో స్టాండ్స్ కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అంతేకాకుండా వాటర్ ప్యాకెట్లు, గ్లాసులు కూడా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. చోటా బజార్, రామదాసు బంధీఖానా, జీహెచ్ఎంసీ వార్డు కార్యాలయం, లంగర్ హౌజ్ వద్ద తాగు నీటి వసతి ఏర్పాటు చేసినట్లు తెలిపారు.