Hyderabad: ఒక్క రోజులో హైదరాబాద్‌ మొత్తం చూడాలా? తక్కువ ధరకే టూర్‌ ప్యాకేజీ!

సాధారణంగా టూర్స్ కి వెళ్తే భారీగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి.అలా అని తక్కువ ధరకే అన్ని ప్లేసెస్ ను చూపిస్తారా అంటే.. అంత కరెక్ట్ గా ఎవరు చెప్పలేరు. అయితే, ఇప్పుడు అటువంటి వారందరికీ ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. హైదరాబాద్ లో అతి తక్కువ ధరలకే అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలా.. మంచి టూరిస్ట్ ప్యాకేజ్ లు అందుబాటులో ఉన్నాయి.

సాధారణంగా టూర్స్ కి వెళ్తే భారీగా డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి.అలా అని తక్కువ ధరకే అన్ని ప్లేసెస్ ను చూపిస్తారా అంటే.. అంత కరెక్ట్ గా ఎవరు చెప్పలేరు. అయితే, ఇప్పుడు అటువంటి వారందరికీ ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది. హైదరాబాద్ లో అతి తక్కువ ధరలకే అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలా.. మంచి టూరిస్ట్ ప్యాకేజ్ లు అందుబాటులో ఉన్నాయి.

హైదరాబాద్ భాష బేధం, మత బేధం, కుల బేధం లేకుండా .. అందరిని ఓపెన్ హార్ట్ తో వెల్కమ్ చెప్తుంది. విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు హైదరాబాద్ బెస్ట్ ప్లేస్. వివిధ రాష్ట్రాల నుంచి, జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చి సెటిల్ అయ్యే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలానే , హైదరాబాద్ ఓ మంచి టూరిస్ట్ ప్లేస్ కూడా. ఎక్కడెక్కడినుంచో టూరిస్ట్ లు హైదరాబాద్ మహ నగరాన్ని వీక్షించడానికి వస్తూ ఉంటారు. అయితే, భాగ్యనగరంలో ఉన్న అన్ని ప్లేసెస్ కవర్ అయ్యేలా ఇప్పుడు .. తెలంగాణ టూరిజం తక్కువ ధరలకు.. బెస్ట్ టూరిస్ట్ ప్యాకేజ్ ను అందిస్తోంది. దానిలో ఉదయం నుంచి సాయంత్రం వరకు హైదరాబాద్‌లో ఉన్న పలు పర్యాటక ప్రదేశాలు కవర్ అయ్యేలా.. హైదరాబాద్ సిటీ టూర్‌ పేరుతో దీనిని నిర్వహిస్తోంది. మరి, ఈ టూర్ ప్యాకేజ్ లో ఏ ఏ ప్రాంతాలు కవర్ చేస్తున్నారు ! వాటి ధరలు ఎలా ఉన్నాయి ! అనే అన్ని విషయాలను తెలుసుకుందాం.

హైదరాబాద్ లో ఎన్నో ప్రత్యేకమైన ప్రదేశాలు, స్పెషల్ ఫుడ్స్ అందరిని బాగా అట్ట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. అయితే, ఈ ప్లేసెస్ అన్ని ఒకేసారి కవర్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. ఇక కొత్తవారికైతే ఇంకాస్త కష్టంగా ఉంటుంది. పైగా వీటి అన్నిటిని ఒకే రోజు చుట్టేసి రావాలంటే కూడా కష్టమే. కానీ, ఇప్పుడు తెలంగాణ టూరిజం వారు ఇచ్చే ఆఫర్ ను చూస్తే మాత్రం .. అందరికి ఇవన్నీ చాలా సులువుగా అనిపిస్తుంది. ముఖ్యంగా టూరిస్ట్ లకు ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పి తీరాలి. ఇప్పుడు తెలంగాణ టూరిజం వారు.. హైదరాబాద్ సిటీ టూర్ పేరుతో బెస్ట్ ప్యాకేజీ ను అందుబాటులోకి తీసుకుని వచ్చారు. ఈ టూర్ ప్యాకేజ్ ను బుక్ చేసుకోవాలి అనుకునే వారు ముందుగా.. తెలంగాణ టూరిజం వెబ్‌సైట్‌ కు వెళ్ళాలి. దానిలో వారు చూపించిన వివరాల ప్రకారం ఈ టూర్ ప్యాకేజ్ ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

ప్యాకేజీ ధర విషయానికొస్తే నాన్ ఏసీ పెద్దవాళ్లకు రూ. 380, చిన్న పిల్లలకు రూ. 300గా నిర్ణయించారు. ఏసీ అయితే పెద్దవాళ్లకు రూ. 500, చిన్న పిల్లలకు రూ. 400గా నిర్ణయించారు. కానీ, ఇందులో లంచ్ ఖర్చు మాత్రం టూరిస్ట్ లే పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్యాకేజీ లో కవర్ అవ్వదు. ఇక టూర్ టైమింగ్స్ విషయానికొస్తే .. ప్రతి రోజు ఉదయం 7.30 గంటలకు స్టార్ట్ అవుతుంది. ఉదయం 7.30 గంటలకు సికింద్రాబాద్ ఎస్‌పీ రోడ్డులోని.. యాత్రి నివాస్‌ నుంచి బస్సు స్టార్ట్ అవుతుంది. మరొక బస్సు 7.45 గంటలకు బేగంపేటలోని టూరిజం ప్లాజా నుంచి బయలు దేరుతుంది. అలాగే బహీష్‌బాగ్‌ నుంచి 8.15 గంటలకు మరొక బస్సు స్టార్ట్ అవుతుంది.

ఇక ఈ వన్ డే సిటీ టూర్ లో కవర్ అయ్యే ప్లేసెస్ విషయానికొస్తే.. ప్యాకేజీలో భాగంగా బిర్లామందిర్‌, చౌమహల్లా ప్యాలెస్, చార్మినార్‌, మక్కా మజిద్‌, లాడ్‌ బజార్‌లో షాపింగ్‌, సాలర్జంగ్ మ్యూజియం, నిజాం మ్యూజియం , నెహ్రు జూపార్క్‌, గోల్కోండ ఫోర్ట్‌, కుతుబ్‌ షాహీ సమాధులు వంటి ప్రదేశాలు కవర్‌ అవుతాయి. ఇక జూపార్క్‌ కేవలం శుక్రవారం మాత్రమే విజిటింగ్ ఉంటుంది. చివరిగా రాత్రి 7.30 గంటలకు ఐమాక్స్‌ వద్ద డ్రాప్ చేస్తారు. వీటిలో చౌమహల్లా ప్యాలెస్,సాలర్జంగ్ మ్యూజియం,నిజాం మ్యూజియంలకు ప్రతి శుక్రవారం సెలవు. మరి, తెలంగాణ టూరిజం ప్రొవైడ్ చేస్తున్న హైదరాబాద్ సిటీ టూర్ ప్యాకేజ్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments