విద్యార్థులకు శుభవార్త.. ఈ వారంలో మరో రెండు రోజులు సెలవులు!

గత కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరి.. జనాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక రోడ్ల మీద భారీ ట్రాఫిక్‌ ఏర్పడి.. గంటల తరబడి ఎదురు చూడాల్సిన పరిస్థితులు తలెత్తాయి. మరో మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని.. జనాలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇక భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న విద్యాసంస్థలు, కాలేజీలకు రెండు రోజులు సెలవు ప్రకటించిన సంగతి తెలిసిందే. బుధవారం, గురువారం(జూలై 26,27) రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. అయితే ఐదు రోజుల పాటు సెలవులు అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ అది వాస్తవం కాదు.

ప్రభుత్వం కేవలం బుధ, గురువారాలు మాత్రమే సెలవు ప్రకటించింది. శుక్రవారం పాఠశాలలు, కాలేజీలు యథావిధిగా తెరుచుకుంటాయి. అయితే విద్యార్థులకు మరో రెండు రోజులు సెలవులు రానున్నాయి. అది కూడా ఈ వారంలోనే. ఎప్పుడంటే.. బుధ, గురువారం సెలవులు అయిపోయిన తర్వాత శుక్రవారం స్కూళ్లు, కాలేజీలు తెరుచుకుంటాయి. ఆ తర్వాత శనివారం అనగా జూలై 29న మొహర్రం సందర్భంగా విద్యా సంస్థలకు సెలవు ఉంటుంది. ఆ తర్వాత ఆదివారం 30 సెలవు. ఆ తర్వాత వర్షాలు తగ్గకపోతే సెలవులు కొనసాగే అవకాశం ఉందని అంటున్నారు.

Show comments