iDreamPost
android-app
ios-app

Ayodhya: అయోధ్య రామ మందిర నిర్మాణంలో తెలంగాణకు రెండో స్థానం!

  • Published Jan 17, 2024 | 4:47 PM Updated Updated Jan 20, 2024 | 7:26 PM

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాలయాలలో.. విరాళాలు ఆ అయోధ్య రామ మందిరానికి చేరాయి. వాటిలో అధిక మొత్తంలో విరాళాలు అందచేసిన రాష్ట్రాలలో.. తెలంగాణ రాష్ట్రము రెండవ స్థానంలో ఉన్నట్లు సమాచారం.

అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల రూపాలయాలలో.. విరాళాలు ఆ అయోధ్య రామ మందిరానికి చేరాయి. వాటిలో అధిక మొత్తంలో విరాళాలు అందచేసిన రాష్ట్రాలలో.. తెలంగాణ రాష్ట్రము రెండవ స్థానంలో ఉన్నట్లు సమాచారం.

  • Published Jan 17, 2024 | 4:47 PMUpdated Jan 20, 2024 | 7:26 PM
Ayodhya: అయోధ్య రామ మందిర నిర్మాణంలో తెలంగాణకు రెండో స్థానం!

కొన్ని కోట్ల మంది ప్రజల ఎదురుచూపులు ఫలించే సమయం దగ్గర పడింది. ఇప్పటికే రామ జన్మ భూమి అయోధ్యలో ప్రారంభోత్సవ వేడుకలు మొదలయ్యాయి. ఎన్నో సంవత్సరాల నాటి  భారతీయుల కల నెరవేరనుంది. భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఈ మహత్తర ఘట్టంలో పాలుపంచుకునే అదృష్టాన్ని.. ఆ రామయ్య విరాళాలు అందచేసే రూపంలో కల్పించాడు. అయోధ్య రామయ్య ఇంటి వేడుకకు దేశంలోని ప్రతి గడప నుంచి విరాళాలు వెళ్లాయి. కొన్ని కోట్ల రూపాయలు ఈ ఆలయ నిర్మాణానికి ఖర్చు అయినట్టు సమాచారం.  ఆ రామయ్య కరుణతో అందరి చేతుల మీదుగా.. అంగరంగ వైభవంగా.. కన్నుల పండుగగా ఈ ప్రారంబోత్సవ కార్యక్రమం జరగబోతుంది. 

అయితే, ఈ రామ మందిరాన్ని నిర్మించడానికి.. అయ్యే ఖర్చు మొత్తంగా రూ.2000 కోట్లు ఉంటుందని.. అయోధ్య రామ జన్మ భూమి ట్రస్ట్ ప్రకటించింది. ఈ చారిత్రాత్మిక ఘట్టంలో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయాలనీ.. రామ జన్మ భూమి తీర్ధ ట్రస్ట్ నిర్ణయం తీసుకుంది. అందులో  భాగంగా రాష్ట్రంలోని ప్రతి ఇంటికి తిరుగుతూ విరాళాలు సేకరించాలనుకుంది. విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, సంఘ్ పరివార్ మొదలైన సంఘాలు విరాళ సేకరణను చేపట్టాయి. ఈ క్రమంలో గుజరాత్, రాజస్థాన్ ల నుంచి మొత్తంగా దాదాపు రూ.250 కోట్ల నిధి పోగయ్యింది. ఎక్కువ మొత్తంలో నిధి సేకరించిన రాష్ట్రాలుగా గుజరాత్, రాజస్థాన్ లు మొదటి స్థానంలో ఉండగా.. రెండవ స్థానంలో  తెలంగాణ రాష్ట్రము నిలిచింది. తెలంగాణ రాష్ట్రము నుంచి సుమారు రూ. 170 కోట్ల నిధిని రామ జన్మ భూమి ట్రస్ట్ కు అందిందని సమాచారం. 

అంతే కాకుండా విరాళాలతో పాటు.. జనవరి 22న జరగబోయే ఆలయ ప్రారంభోత్సవానికి హైదరాబాద్ నుంచి.. రాముల వారికీ వెండి పాదుకలు, వెండి గొలుసులు కూడా తెలంగాణ రాష్ట్రము నుంచే వెళ్లడం.. అంతా అదృష్టంగా భావిస్తున్నారు. వీటోతో పాటూ అయోధ్యకు వెళ్లే భక్తులకు మూడు నుంచి ఆరు నెలల పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. ఇక విరాళాలు సేకరించడంతో పాటు.. సేవ కార్యక్రమాల్లోనూ తెలంగాణ ప్రజలు ముందు ఉండడం.. ఎంతో సంతోషంగా ఉందంటూ వీ హెచ్ పి సెక్రటరీ తెలియజేశారు. అలాగే జనవరి 22వ తేదీన అందరూ రామ జ్యోతులు వెలిగించుకోవాలని పేర్కొన్నారు. మరి అయోధ్య నిర్మాణ ఘట్టంలో తెలంగాణ రాష్ట్రము.. నిధుల సేకరణలో రెండవ స్థానంలో నిలిచిన విషయంలో..  మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.