iDreamPost
android-app
ios-app

ఠాగూర్ రేంజ్ లో అక్రమార్కుల ఆట కట్టిస్తున్న రేవంత్ సర్కార్! ఇప్పుడు నకిలీ డాక్టర్స్ ఏరివేత!

Fake Doctors In Hyderabad: గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్నటి వరకు హోటల్స్ , రెస్టారెంట్లలో తనిఖీలు చేయగా.. నేడు నకిలీ వైద్యులు, నకిలీ ఆస్పత్రులను ఏరివేసే పనిలో పడ్డారు.

Fake Doctors In Hyderabad: గత కొద్ది రోజులుగా హైదరాబాద్ నగరంలో వివిధ ప్రాంతాల్లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నిన్నటి వరకు హోటల్స్ , రెస్టారెంట్లలో తనిఖీలు చేయగా.. నేడు నకిలీ వైద్యులు, నకిలీ ఆస్పత్రులను ఏరివేసే పనిలో పడ్డారు.

ఠాగూర్ రేంజ్ లో అక్రమార్కుల ఆట కట్టిస్తున్న రేవంత్ సర్కార్! ఇప్పుడు నకిలీ డాక్టర్స్ ఏరివేత!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవీనితి పరులపై కొరడ ఝలిపిస్తున్నారు. అంతేకాక అక్రమాలపై విరుకపడుతున్నారు. అందుకు సాక్ష్యం ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అధికారులు జరిపిన దాడులే సాక్ష్యం. గత కొన్ని రోజుల నుంచి నిన్నటి వరకు హోటల్స్ పై  వరుస దాడులు చేసి.. అనేక అక్రమాలను వెలుగులోకి తెచ్చారు. తాజాగా నకిలీ డాక్టర్స్ లను అధికారులు ఏరివేస్తున్నారు. దీంతో ఠాగూర్ సినిమా రేంజ్ లో రేవంత్ సర్కార్ అవినీతిపై పంజా విసురుతుందని పలువురు అభిప్రాయా పడుతున్నారు. తాజాగా వైద్య మండలి సభ్యులు పలు ప్రాంతాల్లో దాడులు నిర్వహించి నకిలీ డాక్టర్లను పట్టుకున్నారు. ఈ అంశంపై పూర్తి వివరాల్లోకి వెళ్తే…

తెలంగాణ వైద్య మండలి సభ్యులు హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్ పరిధిలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఐడీపీఎల్, చింతల్, షాపూర్, సూరారం వంటి ప్రాంతాల్లో మెడికల్ కౌన్సిల్ సభ్యులు తనిఖీలు నిర్వహించగా షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా 50 మంది నకిలీ డాక్టర్లను ఈ తనిఖీల్లో గుర్తించారు. తెలంగాణ వైద్య మండలికి చెందిన ఎనిమిది మంది సభ్యులు వేర్వేరు బృందాలుగా విడిపోయి.. ఏకకాలంలో పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ నకిలీ వైద్యులు తమ క్లినిక్స్ లో రోగులను చేర్చుకుని పెద్ద సంఖ్యలో యాంటీబయాటిక్స్‌ మందులు ఇస్తున్నట్లు గుర్తించారు.

Fake Doctors

ఇక నకిలీ వైద్యులు చేసిన పనులు చూసి సభ్యుల ఆశ్చర్యం వ్కక్తం చేశారు. ఈ నకిలీలు తాము డాక్టర్లుగా పేర్కొంటూ బోర్డు పెట్టుకోవడమే కాకుండా,  అనుసంధానంగా మెడికల్‌ షాపులు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాలను కూడా పెట్టుకున్నట్లు అధికారులు గుర్తించారు. తనిఖీల్లో దొరికిన నకిలీ వైద్యులపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు  చేశారు.  అంతేకాక వారిలో ఇద్దరిని జైలుకు పంపినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ తనిఖీల్లో డాక్టర్‌ ప్రతిభాలక్ష్మి, డాక్టర్‌ కిరణ్‌ కుమార్‌, డాక్టర్‌ సన్నీ డేవిస్‌, డాక్టర్‌ ఇమ్రాన్‌ అలీ, డాక్టర్‌ కె. విష్ణు, పాండు తదితరులు పాల్గొన్నారు.

ఇలా భారీగా నకిలీ డాక్టర్లు వెలుగులోకి రావడంతో ఆ ప్రాంతంలోని జనం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకాలం తాము నకిలీ డాక్టర్ల వద్ద చికిత్స తీసుకున్నామా అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా రేవంత్ రెడ్డి సర్కార్.. ఇలాంటి అక్రమాలపై తీవ్ర స్థాయిలో విరుచుకపడుతుంది. నిన్న ఫుడ్ అంశాల విషయంలో దాడులు చేయగా, నేడు ఆరోగ్యం అంశాలకు సంబంధించి ప్రజల శ్రేయస్సు కోసం రేవంత్ సర్కార్ దాడులు నిర్వహిస్తుంది. మొత్తంగా  ఠాగూర్ సినిమాని తలపిస్తున్న రేవంత్ సర్కార్ అక్రమార్కుల భరతం పడుతుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.