iDreamPost
android-app
ios-app

రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడ్డయ్ చెక్ చేసుకున్నారా?

తెలంగాణ రైతాతంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. పెండింగ్ లో ఉన్న రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మరి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.

తెలంగాణ రైతాతంగానికి రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. పెండింగ్ లో ఉన్న రైతు భరోసా నిధులను విడుదల చేసింది. మరి మీ ఖాతాలో డబ్బులు పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.

రైతులకు గుడ్ న్యూస్.. ఖాతాలో రైతు భరోసా డబ్బులు పడ్డయ్ చెక్ చేసుకున్నారా?

తెలంగాణలోని రైతులకు గుడ్ న్యూస్. రైతు భరోసా డబ్బులు ఎప్పుడొస్తాయా అని ఎదురుచూస్తున్న రైతులకు తెలంగాణ సర్కార్ తీపి కబురును అందించింది. గత బీఆర్ ఎస్ ప్రభుత్వం రైతు బంధు పేరిట రైతులకు పంట పెట్టుబడిసాయాన్ని అందించిన విషయం తెలిసిందే. ఇదే పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పేరిట రైతులకు ఆర్థికసాయాన్ని అందిస్తోంది. 5 ఎకరాల కన్నా ఎక్కువ విస్తీర్ణం ఉంటే రైతు భరోసా రాదు అనే ప్రచారం సాగింది. కానీ రేవంత్ సర్కార్ అర్హులైన రైతులందరికీ రైతు భరోసాను అందిస్తోంది. అయితే ఈ ఏడాది యాసంగి సీజన్ కు సంబంధించిన రైతు భరోసా నిధులు రైతులందరికీ అందలేదు. దీంతో రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో రేవంత్ సర్కార్ రైతు భరోసా పెండింగ్ నిధులను విడుదల చేసింది.

ఐదు ఎకరాలు పైబడిన వ్యవసాయ భూమి ఉన్న వారికి రైతు భరోసా నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. రైతుల ఖాతాల్లో నేరుగా నగదును ప్రభుత్వం జమ చేస్తోంది. రూ.2వేల కోట్లకు పైగా నిధులు విడుదల చేసినట్టు సమాచారం. మూడు రోజుల్లో చెల్లింపుల ప్రక్రియ పూర్తవుతుందని అధికారులు చెబుతున్నారు. 5 ఎకరాలు లోపు భూమి ఉన్న రైతులకు ఇప్పటికే నిధులు విడుదలయ్యాయి. తాజాగా ఐదు ఎకరాలు పైబడిన వారికి చెల్లింపులు ప్రారంభించారు. ఇప్పటికే 111 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ పూర్తయ్యింది. సోమవారం నుంచి మూడు రోజుల పాటు పెండింగ్ లో ఉన్న 39 లక్షల ఎకరాలకు రైతు భరోసా పంపిణీ చేయాలని ప్రభుత్వ అధికారులను ఆదేశించింది. రైతు భరోసా నిధుల విడుదలతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరి రైతు భరోసా డబ్బులు మీ ఖాతాలో పడ్డాయో లేదో చెక్ చేసుకోండి.