iDreamPost
android-app
ios-app

విద్యార్థులకు అలర్ట్.. మీ హైస్కూల్ టైమింగ్స్ మారాయ్!

  • Published Jul 20, 2024 | 4:41 PM Updated Updated Jul 20, 2024 | 4:49 PM

సాధరణంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు విద్య వ్యవస్థలోని మార్పులు చేస్తూ కీలక నిర్ణయలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ సర్కార్ ప్రభుత్వ విద్య వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకి ఏమిటంటే..

సాధరణంగా తెలంగాణ ప్రభుత్వం ఎప్పటికప్పుడు విద్య వ్యవస్థలోని మార్పులు చేస్తూ కీలక నిర్ణయలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తెలంగాణ సర్కార్ ప్రభుత్వ విద్య వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇంతకి ఏమిటంటే..

  • Published Jul 20, 2024 | 4:41 PMUpdated Jul 20, 2024 | 4:49 PM
విద్యార్థులకు అలర్ట్.. మీ హైస్కూల్ టైమింగ్స్ మారాయ్!

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం అభివృద్ధి దిశగా పరుగులు పెడుతున్న విషయం తెలిసిందే. అదే విధంగా సీఎంగా రేవంత్ రెడ్డి పదవి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన మార్క్ ను చూపిస్తున్నారు. ముఖ్యంగా ఇచ్చిన హామిలను నేరవేస్తూ ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలోని విద్యావ్యవస్థను కూడా పటిష్టంగా చేసేందుకు సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల తీరుతెన్నులు మారాలని, విద్యా వ్యవస్థ సమూలంగా మారాలని తల్లిదండ్రులు ఎంతో కాలంగా కోరుకుంటాన్నారు. ఈ దిశగానే రేవంత్ రెడ్డి నేతృత్వంలోని.. ప్రభుత్వ బడుల్లో బోధన విషయంలో సరికొత్త విధానంతో ముందుకు సాగుతుంది.

ఇదిలా ఉంటే.. తాజాగా తెలంగాణ ప్రభుత్వ విద్య వ్యవస్థ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.  ప్రభుత్వ ఉన్నత పాఠశాలోని పనివేళల్లలో మార్పులు చేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యంగా.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల సమయాలతో సమానంగా హైస్కూల్ టైమింగ్స్ మార్చింది. ఈ క్రమంలోనే.. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు టైమింగ్స్  మార్పు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే గతంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలను ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45కి ఉండేవి. కానీ, ఇప్పుడు ఆ టైమింగ్స్ బదులుగా పాఠశాల సమయాలు ఉదయం 9.00 నుంచి సాయంత్రం 4.15 వరకు ఉండేలా ప్రభుత్వం మార్పులు చేసింది. అయితే ఎప్పటికప్పుడు రాష్ట్ర సర్కార్ విద్య వ్యవస్థలోని మార్పులు చేస్తున్న విధంగానే.. ఇప్పుడు కూడా ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో టైమింగ్స్ మార్పు చేసింది.

ఇకపోతే విద్యాశాఖ జారీ చేసిన ఈ కీలక నిర్ణయం మేరకు ఇక నుంచి రాష్ట్రంలో.. ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలలు య‌థావిధిగా ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 4.15 గంట‌ల వ‌ర‌కు కొన‌సాగుతాయి. అలాగే హైద‌రాబాద్, సికింద్రాబాద్ జంట న‌గ‌రాల్లో మాత్రం ఉద‌యం 8.45 నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు పాఠ‌శాల‌ల నిర్వహ‌ణ కొన‌సాగ‌నున్నట్లు విద్యాశాఖ స్పష్టం చేసింది.తెలంగాణ ప్రభుత్వం విద్యావ్యవస్థలో మార్పులు చేసేందుకు నిర్ణయించింది. ప్లే స్కూల్ తరహాలో అంగన్వాడీలను తీర్చిదిద్ది, అక్కడే మూడో తరగతి వరకూ బోధన అందించేందుకు ఒక టీచర్ ను నియమించే యోచనలో ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. మరి, తెలంగాణ రాష్ట్రంలోని హైస్కూల్స్ టైమింగ్స్ మారడం పై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.