iDreamPost

తెలంగాణలో వానలే వానలు.. జల్లుల్లో తడిసి ముద్దవ్వాల్సిందే

ఎండలతో మండిపోతున్న జనాలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న జనాలకు స్వాంతన చేకూరే విధంగా..

ఎండలతో మండిపోతున్న జనాలకు చల్లని కబురు చెప్పింది వాతావరణ శాఖ. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న జనాలకు స్వాంతన చేకూరే విధంగా..

తెలంగాణలో వానలే వానలు.. జల్లుల్లో తడిసి ముద్దవ్వాల్సిందే

తెలుగు రాష్ట్రాల్లో వింత పరిస్థితి ఉంది.. ఎండలు మండిపోతున్న సమయంలోనే ఆకాశం చల్లబడిపోతుంది. అంతలోనే వానలు పడుతున్నాయి. హమ్మయ్య వాతావరణం చల్లబడింది అనుకునే లోపు మళ్లీ భానుడి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. దీంతో అయోమయ.. గందరగోళ పరిస్థితులు చూస్తున్నారు ప్రజలు. ఇలాంటి పరిస్థితి చూస్తుంటే వాతావరణ మార్పులు చోటుచేసుకుంటున్నాయా అన్న అనుమానం కలుగక మానదు. మానవుడు ప్రకృతికి చేస్తున్న హాని కారణంగా రుతు పవనాల్లో కూడా మార్పులు సంభవిస్తున్నాయోనన్న సందేహం కలుగుతోంది. ఇటు ఏపీలోనూ.. ఇటు తెలంగాణలోనూ ఇటువంటి వాతావరణమే నెలకొంది. ఉష్ణోగ్రతలు తారా స్థాయికి చేరుకుంటున్నాయి.

ఈ తరుణంలో చల్లటి కబురు వెల్లడించింది వాతావరణ శాఖ. రానున్న వారం రోజుల పాటు తెలంగాణ వాసులు వానల్లో తడిసి ముద్దవుతారని పేర్కొంది. మే 14 నుండి మే 20 వరకు తెలంగాణ వ్యాప్తంగా తేలిక నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సీనియర్ ఆఫీసర్ నాగరత్నం వెల్లడించారు. మే 14న అనగా మంగళవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, జగిత్యాల, నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, నారాయణ పేట, గద్వాల జిల్లాల్లో వానలు కురవనున్నాయి. ఈ నెల 15న అనగా బుధవారం.. మరికొన్ని జిల్లాల్లో అక్కడక్కడ వర్షాలు కురుస్తాయని తెలిపారు.

ఇక హైదరాబాద్ నగరంలో నేడు, రేపు సాయంత్రం, రాత్రి వేళ్లల్లో జల్లులతో కూడిన వానలు కురుస్తాయని తెలిపారు. మంగళవారం, బుధవారం కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 నుంచి 40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని నాగరత్నం వెల్లడించారు. గురువారం ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 40 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఉరుములు, మెరుపులు ఉన్న సమయంలో బయటకు వెళ్లొద్దని పొలాల్లో ఉండవద్దని హెచ్చరించారు.  ఈ రోజు నుంచి ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదవుతాయని చెప్పారు. ఈ సారి కేరళను నైరుతి రుతు పవనాలు తాకుతాయని ఐఎండీ తెలిపింది. దీంతో దేశ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి