iDreamPost
android-app
ios-app

గుర్తు తెలియనివాళ్లకు పాత ఫోన్లు అమ్ముతున్నారా? డేంజర్‌లో పడ్డట్టే !

  • Published Aug 22, 2024 | 12:06 PM Updated Updated Aug 22, 2024 | 12:06 PM

Telangana Police: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు అంతకు మించి ఉన్నాయంటున్నారు.కూర్చున్న చోట నుంచే కొంతమంది సైబర్ నేరగాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు.

Telangana Police: టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది లాభాలు ఎన్ని ఉన్నాయో.. నష్టాలు అంతకు మించి ఉన్నాయంటున్నారు.కూర్చున్న చోట నుంచే కొంతమంది సైబర్ నేరగాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు.

  • Published Aug 22, 2024 | 12:06 PMUpdated Aug 22, 2024 | 12:06 PM
గుర్తు తెలియనివాళ్లకు పాత ఫోన్లు అమ్ముతున్నారా? డేంజర్‌లో పడ్డట్టే !

ఈ మధ్య కాలంలో చాలా మంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సమాజంలో లగ్జరీగా బతకాలని చూస్తున్నారు. అందుకోసం ఎదుటివారిని దారుణంగా మోసం చేస్తూ నిలువునా దోచేస్తున్నారు.  చైన్ స్నాచింగ్, బ్లాక్ మెయిలింగ్, హైటెక్ వ్యభిచారం, డ్రగ్స్ వ్యాపారం లాంటి దందాలు చేస్తున్నారు. టెక్నాలజీ పెరుగుతున్నా కొద్ది కొంతమంది కేటుగాళ్ళు  సైబర్ నేరాలకు పాల్పపడుతూ కోట్లు సంపాదిస్తున్నారు. ఈ మధ్య సైబర్ నేరగాళ్ళు కొత్త పద్దతులు ఉపయోగిస్తు జనాలను  మోసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పాత సెల్ ఫోన్ల దందా చేస్తూ వాటి ద్వారా అక్రమాలకు పాల్పపడుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

ఇటీవల దేశంలో సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. లేటెస్ట్ టెక్నాలజీతో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వీరి చేతిలో నిత్యం వందల సంఖ్యల్లో జనాలు మోసపోతున్నారు. ఈ మద్య సైబర్ క్రైమ్ కోసం కేటుగాళ్ళు పాత ఫోన్లు వాడుతున్నట్టు తెలుస్తుంది. వాడేసిన పాత మొబైల్ ఫోన్లను డబ్బు ఇచ్చి, ప్లాస్టీక్ సామాన్లు ఇచ్చి కొనుక్కుంటున్నారు. తాజాగా పాత మొబైల్స్ కొనే ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. ఈ ముఠా వద్ద 3 గోనె సంచుల్లో 4 వేల మొబైలం ఫోన్లు లభ్యం కావడం గమనార్హం. బీహార్ కు చెందిన మహమ్మద్ షమీ, మహమ్మద్ ఇఫ్తికర్, అబ్దులు సలాం లను గోదావరిఖని పోలీసులు అరెస్ట్ చేశారు.

Telangana Police, Old Mobile Phones, 01

ఈ ముఠా కొంత కాలంగా తెలంగాణలో గ్రామీణ ప్రాంతాల్లో తిరుగుతూ పాత సామాన్ల వ్యాపారం చేస్తున్నట్లు కవరింగ్ చేస్తూ వాడేసిన మొబైల్ ఫోన్లు కొంటున్నారు. ఫోన్లను బట్టి డబ్బులు ఇవ్వడం లేదా ప్లాస్టీక్ సామాన్లు ఇవ్వడం జరుగుతుంది. అలా సేకరించిన మొబైల్ ఫోన్లను బీహార్ మీదుగా.. దేవ్ ఘర్, జామ్ తారా, జార్ఖండ్ కు ఈ ముఠా తరలిస్తున్నట్లు పోలీసులు కనుగొన్నారు. సైబర్ నేరాళ్లకు ఈ ఫోన్లు అమ్ముతున్నట్లు తెలిసింది. మొబైల్ ఫోన్లలోని సాఫ్ట్ వేర్ మార్చి, ఇతర విడిభాగాలు మార్చి, ఫోన్ పనిచేసేలా తయారు చేసి సైబర్ నేరాలకు పాల్పపడుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు. గుర్తు తెలియని వాళ్లకు మీ పాత ఫోన్లను అమ్మవొద్దని.. ఏదైనా పెద్ద నేరం జరిగితే మీరు ప్రమాదంలో పడే అవకాశం ఉందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది దృష్టిలో పెట్టుకొని పాత మొబైల్ ఫోన్లు అమ్మాలనుకుంటే తగు జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అని అంటున్నారు.