మంత్రి కీలక ప్రకటన.. ఇవి ఉంటే రేషన్ కార్డు రాదు

మంత్రి కీలక ప్రకటన.. ఇవి ఉంటే రేషన్ కార్డు రాదు

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ కొత్త రేషన్ కార్డుపై కీలక ప్రకటన చేశారు. ఇకపై ఇవి ఉంటేనే రేషన్ కార్డు రాదని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇందులో భాగంగానే తాజాగా మంత్రి ఉత్తమ్ కుమార్ కొత్త రేషన్ కార్డుపై కీలక ప్రకటన చేశారు. ఇకపై ఇవి ఉంటేనే రేషన్ కార్డు రాదని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత ప్రజా సంక్షేమ పథకాలకు పుట్టినిల్లుగా మారింది. కాగా, ఇప్పటికే ఇచ్చిన హామిలను అమలు చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం శరవేగంగా అడుగులు వేస్తుంది. కాగా,  ఇప్పటికే మహాలక్ష్మి పథకంతో పాటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచడం, 200 యూనిట్ల లోపు ఉచిత కరెంట్, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలను అందిస్తుంది. అలాగే హెల్త్ కార్డులతో పాటు కొత్త రేషన్ కార్డులను కూడా అర్హులైన లబ్ధిదారులకు అందించడంలో సర్కార్ ముందుకు అడుగులు వేస్తున్న విషయం తెలిసిందే. ఇలాంటి సమయంలో తాజాగా తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ కొత్త రేషన్ కార్డుపై కీలక ప్రకటన చేశారు.

ఇటీవలే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ ను ప్రవేశ పట్టింది. కాగా, ప్రస్తుతం ఇప్పుడు రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. దీంతో ప్రతిపక్ష పార్టీల మధ్య హోరహోరీగా ఆరోపణలు, వాదనలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా  అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘తమ ప్రభుత్వం అర్హులైన ప్రతిఒక్క లబ్ధి దారుడికి రేషన్ కార్డుతో పాటు పలు  పథకాలు అందేలా చూస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా ఆగస్టు 1 క్యాబినెట్ భేటీ అవుతుందని, దానిలో విధివిధానాలను రూపొందిస్తామని తెలిపారు. ఇక అందరి సూచనలు తీసుకుని, ప్రజలకు మేలు చేసేలా రేషన్ కార్డుపై సరైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ క్లారిటీ ఇచ్చారు.

ఇక గత ప్రభుత్వ పాలానాలో కొందరు అక్రమంగా రేషన్ కార్డులు సంపాదించి ప్రభుత్వంను మోసం చేశారు. అయితే ఇకపై ఇలాంటి రేషన్ కార్డులు ఉంటే కొత్త రేషన్ కార్డులు ఇవ్వబోమని, పైగా ఇలాంటి నకిలీ రేషన్ కార్డులను ఏరీవేసి నిజమైన లబ్ధి దారులకు మాత్రమే పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాగే  పేదలకు కూడా సన్న బియ్యం కూడా అందిస్తామన్నారు. అంతేకాకుండా..  గత ప్రభుత్వం పదేళ్ల పాలనలో ఎప్పుడు కొత్త రేషన్ కార్డులు జారీ చేయలేదన్నారు. కానీ,  తమ ప్రభుత్వం మాత్రం అర్హులైనా ప్రజల కోసం చిత్త శుధ్దితో అన్ని అమలు చేస్తామని’ వ్యాఖ్యలు చేశారు. మరీ, కొత్త రేషన్  కార్డులపై మంత్రి చేసిన కీలక వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments