Telangana: తెలంగాణ నిరుద్యోగులకు పండగలాంటి వార్త.. దానిపై కీలక ప్రకటన

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్‌ బాబు పండగలాంటి వార్త చెప్పారు. త్వరలోనే వారి నిరీక్షణలు ఫలించబోతున్నాయి అని ప్రకటించారు. ఆ వివరాలు..

తెలంగాణ నిరుద్యోగులకు మంత్రి శ్రీధర్‌ బాబు పండగలాంటి వార్త చెప్పారు. త్వరలోనే వారి నిరీక్షణలు ఫలించబోతున్నాయి అని ప్రకటించారు. ఆ వివరాలు..

తెలంగాణ నిరుద్యోగలకు కాంగ్రెస్‌ సర్కార్‌ అదిరే శుభవార్త చెప్పనుంది. వారు ఎప్పటి నుంచో ఎదురు చూస్తోన్న​ ఉద్యోగాల అంశానికి సంబంధించి కీలక ప్రకటన చేయడానికి రేవంత్‌ సర్కార్‌ రెడీ అయ్యింది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ విజయంలో నిరుద్యోగులు కీలక పాత్ర పోషించారనేది కాదనలేని వాస్తవం. గత ప్రభుత్వం హయాంలో చోటు చేసుకున్న అవకతవకలు, పేపర్‌ లీకేజీ ఘటనలతో తీవ్ర అసంతృప్తిలో ఉన్న నిరుద్యోగులు.. ఎన్నికల్లో కారు పార్టీని ఓడించి కాంగ్రెస్‌ గెలుపులో కీలక పాత్ర పోషించారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ కూడా తాము అధికారంలోకి వచ్చిన ఏడాది లోపే 2 లక్షల ఉద్యోగాలు, జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తామని హామీ ఇచ్చింది. అయితే మధ్యలో ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఈ హామీల అమలకు అంతరాయం ఏర్పడింది. ఇక ఇప్పుడు అన్ని ఎన్నికలు ముగిశాయి. దాంతో కాంగ్రెస్‌ సర్కార్‌ హామీల అమలుకు చర్యలు తీసుకుంటుంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు పండగలాంటి వార్త చెప్పింది కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆ వివరాలు..

కాంగ్రెస్‌ ఇచ్చిన ప్రధాన హామీల్లో జాబ్‌ క్యాలెండర్‌ విడుదల ఒకటి. ఈపాటికే దీన్ని రిలీజ్‌ చేయాల్సి ఉండగా.. ఎన్నికల కోడ్‌ అమల్లోకి రావడంతో ఆలస్యం అయ్యింది. ఈ క్రమంలో జాబ్‌ క్యాలెండర్‌ రిలీజ్‌ మీద కీలక వ్యాఖ్యలు చేశారు ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు. అసెంబ్లీ ఎన్నికల్లో నిరుద్యోగులకు హామీ ఇచ్చినట్లుగానే.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని శ్రీధర్ బాబు ప్రకటించారు. 12 ఏళ్ల తర్వాత మళ్లీ గ్రూప్-1 పరీక్షను కాంగ్రెస్ ప్రభుత్వమే నిర్వహించిందని చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ఎలక్షన్ కోడ్ వచ్చి మొన్ననే ముగసిందని.. కోడ్ ముగియడంతో ఇచ్చిన హామీల అమలు ప్రక్రియ మొదలు పెట్టామని స్పష్టం చేశారు.

అలానే మంత్రి హరీష్‌ రావు వ్యాఖ్యలకు కౌంటర్‌ ఇచ్చారు శ్రీధర్‌ బాబు. తాము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని.. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వల్ల అస్తవ్యస్థంగా మారిన ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దే పనిలో ఉన్నామని తెలిపారు. తాము తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తామని.. ఆశా వర్కర్ల గురించి మాట్లాడే హక్కు హరీశ్‌ రావుకు లేదని శ్రీధర్‌ బాబు స్పష్టం చేశారు. మైనర్‌ బాలికపై అత్యాచారం జరగడం దురదృష్టకరం అని.. శాంతిభద్రతల విషయంలో తమ ప్రభుత్వం సీరియస్‌గా ఉంటుందని తెలిపారు. అలానే ఎన్నికల వేళ కాంగ్రెస్‌ సర్కార్‌ ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తామని స్పష్టం చేశారు.

ఇక కాంగ్రెస్‌ ప్రభుత్వం తాము ఇచ్చిన హామీల అమలకు కార్యచరణ వేగవంతం చేస్తుంది. ఈ క్రమంలోనే ఆగస్టు 15లోగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన రేవంత్‌ సర్కార్‌ ఆ దిశగా కార్యచరణ వేగవంతం చేసింది. అలానే రైతు భరోసా కింద ఎకరానికి 15 వేల ఆర్థిక సాయం విడుదలపై కూడా మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో ఉంది.

Show comments