Arjun Suravaram
Telangana Man In Saudi Arabia: ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన యువకుడుకి ఊహించని ఘటన ఎదురై.. ఎడారిలో చిక్కుకున్నాడు. ఎడారి నుంచి బయటపడేందుకు నాలుగు రోజుల పాటు పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు
Telangana Man In Saudi Arabia: ఉపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన యువకుడుకి ఊహించని ఘటన ఎదురై.. ఎడారిలో చిక్కుకున్నాడు. ఎడారి నుంచి బయటపడేందుకు నాలుగు రోజుల పాటు పోరాడి చివరకు ప్రాణాలు విడిచాడు
Arjun Suravaram
ఇటీవల విడుదలైన ‘గోట్ లైఫ్’ సినిమా గురించి అందరికి తెలిసిందే. ఆ సినిమాలో జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లిన యువకులు ఎలాంటి కష్టాలు పడ్డారు. ఎడారిలో తప్పిపోయి ఎంత నరకం అనుభవించారు దర్శకుడుకు చక్కగా చూపించాడు. ఆ సినిమా ప్రేక్షకులను ఎంతో ఎమోషనల్ కి గురిచేసింది. అలానే నిజ జీవితంలోనూ అలాంటి ఘటన ఒకటి చోటుచేసుకుంది. తెలంగాణకు చెందిన ఓ యువకుడు ఎండారిలో తప్పిపోయి..నీరు, తిండి దొరక్క ఎండలకు తట్టుకోలేక..ఎవరో కాపాడతారని ఆశలతో ఎదురు చూసి..చివరకు కన్నుమూశాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..
కరీంనగర్‌కు చెందిన మొహమ్మద్ షహేబాజ్ ఖాన్(27) జీవనోపాధి కోసం సౌదీ అరేబియా వెళ్లాడు. అక్కడ అల్ హాసా ప్రాంతంలోని ఒక టెలికం కంపెనీలో టవర్ టెక్నిషియన్‌గా ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో ఆయ ప్రాంతాల్లోని సెల్ టవర్లకు సంబంధించిన పనులు చేస్తుంటారు. ఇక విధి నిర్వహణలో భాగంగా సుడాన్ కు చెందిన సహచర ఉద్యోగితో కలిసి 5 రోజుల క్రితం ఓ ప్రాంతానికి వెళ్లాడు. ఈ క్రమంలోనే వారిని దురదృష్టం వెంటాడింది. వారు వెళ్లిన మార్గంలో జీపీఎస్ సక్రమంగా పని చేయలేదు. దీంతో వారు వెళ్లాల్సిన మార్గంలో కాకుండా దారి తప్పి రుబా అల్ ఖలీ అనే ఎడారికి చేరుకున్నారు.
రుబా అల్ ఖలీ ఎడారి గురించి స్థానికులు ఎంతో ఘోరంగా చెప్తుంటారు. నాలుగు దేశాల్లో విస్తరించి ఉన్న ఈ ఎడారిలో ఎవరైనా దారి తప్పితే ఇక మరణమే అని నమ్ముతారు. ఈ ప్రాంతంలో ఒంటెలు ఉండవు, కనీసం కాలినడకన కూడా ప్రయాణించలేనంత ఉష్ణోగ్రతలు ఉంటాయి. అలాంటి ఎడారిలో షహేబాజ్ చిక్కుకున్నాడు. కనుచూపు మేరలో ఎటు చూసినా ఇసుక దిబ్బలు.. మండిపోతున్న ఎండకు తోడు అడుగు తీసి అడుగు వేయలేని స్థితి.. గమ్యం చేరాలంటే ఎటు వెళ్లాలో తెలియని పరిస్థితి షహేబాజ్ ఖాన్ కు ఎదురైంది. జీపీఎస్ సిగ్నల్ పని చేయకపోవడం, ఫోన్ స్విచ్ఛాఫ్ అయిపోవడంతో ఎవరినైనా సాయం అడుగుదామంటే మనిషి అనేవాడి జాడే కనిపించలేదు.
ఇక దారి వెతుక్కుంటూ అటుఇటు తిరగడంతో కారులో ఉన్న కాస్త పెట్రోల్ అయిపోయింది. దీంతో దారుణమైన స్థితిలో ఆకలి వేదనను దిగమింగుకుని ఎడారిలో నాలుగు రోజుల పాటు గడిపిన షహేబాజ్ ఖాన్ చివరకు నమాజ్ చేస్తూ మరణించాడు. తన కారు పక్కనే ఇసుకలో చాప పరిచి నమాజ్ చేస్తూ మృతి చెందారు. వీరి గల్లంతుపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు హెలికాప్టర్ల సాయంతో గాలించారు. ఆ సమయంలో నమాజ్ చేసే చాపపై పడి ఉన్న మృతదేహాలను పోలీసులు కనుగొన్నారు. ఈ విషాద ఘటన అందరిని తీవ్రంగా కలచి వేసింది. ఇలా ఎంతో మంది సౌదీ వెళ్లిన భారతీయులు వివిధ కారణాలతో మరణిస్తున్నారు.