P Venkatesh
ప్రేమకు దేశ సరిహద్దులు అడ్డుకావని నిరూపిస్తున్నారు కొంతమంది ప్రేమికులు. తాజాగా తెలంగాణకు చెందిన అబ్బాయి శ్రీలంకకు చెందిన అమ్మయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
ప్రేమకు దేశ సరిహద్దులు అడ్డుకావని నిరూపిస్తున్నారు కొంతమంది ప్రేమికులు. తాజాగా తెలంగాణకు చెందిన అబ్బాయి శ్రీలంకకు చెందిన అమ్మయిని లవ్ మ్యారేజ్ చేసుకున్నారు.
P Venkatesh
ప్రేమనేది రెండు అక్షరాలు ఉన్న పదం కాదు. రెండు మనస్సులు, రెండు జీవితాలు కలిసిచేసే ప్రయాణం. అలాంటి ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో తెలియదు. దీనికి వయస్సుతో సంబంధం ఉండదు. అలాగే కులం, మతం, ధనిక పేదరికం వంటి బేధాలు కూడా ఉండవు. ఇద్దరి వ్యక్తుల మధ్య ఏర్పడిన పరిచయం కాస్తా స్నేహంగా మారి, ఆ తర్వతా ప్రేమగా చిగురిస్తుంది. అయితే ప్రస్తుత కాలంలో యువత మతాలనే కాదు ఏకాంగా ఖండాంతరాలు దాటి ప్రేమించేస్తున్నారు. దేశంకాని దేశానికి వెళ్లి అక్కడ యువతీ, యువకులు ప్రేమించుకుంటున్నారు. అలా ప్రేమలో విహరించిన వాళ్లు పెద్దలను ఒప్పించి తమ ప్రేమను పెళ్లి వరకూ తీసుకుని వెళ్తున్నారు. ఇటివలే అమెరికా అమ్మాయి, ఆంధ్ర అబ్బాయిలా ప్రేమ, పెళ్లిల్లు జరగడం వింటు ఉన్నాం. తాజాగా ఇలాంటి వివాహమే తెలంగాణకు చెందిన అబ్బాయి చేసుకున్నాడు. ఆ వివరాళ్లోకి వెళ్తే..
ప్రతిఒక్కరు ప్రేమించడం, ప్రేమను పొందడం ఓ అదృష్టంలా భావిస్తారు. కానీ, ఆ ప్రేమని నిలబెట్టుకునే సామర్థ్యం కొంతమందికే ఉంటుంది. ఇటివలే ఖండతరాలు దాటిన ప్రేమలు పెళ్లి పీటలు వరకు వెళ్లడం చూస్తునే ఉన్నాం. చాలామంది తమ పెద్దలను ఒప్పించి అంగరంగ వైభవంగా హిందు సంప్రదాయంలో వివాహాలను చేసుకుంటున్నారు. ఇక తాజగా తెలంగాణకు చెందిన ఓ అబ్బాయి కూడా పై చదువుల కోసం విదేశాలకు వెళ్లి అక్కడ అమ్మాయిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నాడు. కాగా, తెలంగాణలోని కరీంనగర్ నగరపాలక పరిధిలోని అల్గునూర్‌కు చెందిన అరుణ్ కూమార్ స్థానికంగా డిగ్రీ వరకు చదువుకున్నాడు. అనంతరం ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా వెళ్లాడు. అక్కడే ఎంబీఏ చదువుతున్న శ్రీలంకకు చెందిన అజ్జూరా అనే యువతితో 2014లో అరుణ్‌కు పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారింది. కొన్నాళ్లు ప్రేమ పక్షులా విహరించిన ఈ జంట పెళ్లి చేసుకొవాలని నిర్ణయించుకున్నారు. అలా నిర్ణయించుకున్న వెంటనే ఇద్దరు ఇరు కుటుంబాలకు తమ ప్రేమ విషయం గురించి తెలిపారు. అయితే ఇద్దరు కుటుంబాలు వీరి ప్రేమ, పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో.. ఈ జంట పెళ్లి పీటలు ఎక్కారు. ఇరువురి కుటుంబాల సమక్షంలో గురువారం అల్గునూర్‌లోని అరుణ్‌కుమార్ ఇంటి వద్ద వీరి వివాహం ఘనంగా జరిగింది. శ్రీలంక అమ్మాయితో తెలంగాణ అబ్బాయి వివాహమని తెలిసి స్థానికులు పెద్ద ఎత్తున వీరి వివాహం చూడటానికి తరలి వచ్చారు. ప్రస్తుతం ఈ జంటకు సంబంధించిన వివాహ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మరి, తెలంగాణ అబ్బాయి, శ్రీలంక అమ్మాయి వివాహ బంధంతో ఒకటైన జంటపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.