Dharani
ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. ఈ క్రమంలో జూలై 1 నుంచి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అందరికి వర్తించదట. ఆ వివరాలు..
ఆరు గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉంది. ఈ క్రమంలో జూలై 1 నుంచి మహాలక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు నెలకు 2500 రూపాయలు ఇచ్చే పథకాన్ని ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది అందరికి వర్తించదట. ఆ వివరాలు..
Dharani
తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీల అమలుకు కట్టుబడి ఉంది. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోగా వీటన్నింటిని అమలు చేస్తామని ప్రకటించింది. ఆ దిశగా చర్యలు కూడా తీసుకుంటుంది. దీనిలో భాగంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం పథకం హామీ అమలుపై సంతకం చేశారు రేవంత్ రెడ్డి. ఆ తర్వాత ఆరోగ్య శ్రీని పెంచారు. కొన్నాళ్ల తర్వాత 500 రూపాయలకు గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వంటి హామీలను అమలు చేశారు. ఇలా ఉండగా మార్చి నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. దాంతో మిగతా గ్యారెంటీలు, హామీల అమలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఇక ఇప్పుడు ఎన్నికల కోడ్ కూడా ముగియడంతో.. మిగతా గ్యారెంటీల అమలుకు వడివడిగా అడుగులు వేస్తోంది రేవంత్ సర్కార్.
ఈ క్రమంలో జూలై నెల ప్రాంరభం నుంచి మరో ముఖ్యమైన గ్యారెంటీని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. అది ఏంటంటే మహాలక్ష్మి పథకంలో భాగంగా 18 ళ్లు నిండిన యువతులు, మహిళలకు ప్రతి నెలా 2500 రూపాయలు ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. జూలై 1 నుంచి ఈ హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే ఈ పథకం అందరికి వర్తించదని ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి. ప్రభుత్వం నుంచి ఎలాంటి పెన్షన్ అనగా వృద్ధాప్య, వికలాంగులు, ఒంటరి మహిళలు ఇలా ఎలాంటి పెన్షన్ తీసుకోని కుటంబంలోని మహిళలు మాత్రమే దీనికి అర్హులుగా నిర్ణయిస్తారని భావిస్తున్నారు. అలా చూస్తే.. ఈ పథకానికి లబ్ధిదారుల సంఖ్య చాలా తక్కువగా ఉండనుంది.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క, పొన్నం ప్రభాకర్ ఈ పథకం అమలుపై మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం హామీ ఇచ్చిన మేరకు అర్హులైన ప్రతి మహిళా లబ్ధిదారుకి నెలానెలా 2500 రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. ఇప్పటికే ఈ పథకం అమలుకు సంబంధించి ప్రభుత్వం మార్గదర్శకాలు సిద్ధం చేసే పనిలో ఉందని.. త్వరలోనే వాటిని విడుదలు చేస్తామని చెప్పుకొచ్చారు. ఇక ఈ పథకం జూలై నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం.
ఇక మహిళల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద మూడు స్కీమ్‌లను తీసుకువచ్చింది. వీటిల్లో ఒకటి వారికి ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడం. ఈ పథకం విజయం సాధించింది. ప్రస్తుతం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్న ఆడవారి సంఖ్య విపరీతంగా పెరిగింది. అలానే వారికి 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని ప్రకటించడమే కాక.. అమలు చేస్తోంది. అయితే అందరికి ఈ పథకం వర్తించడం లేదు. దీనికి ముఖ్యంగా తెల్ల రేషన్ కార్డు అర్హతగా చెప్పడంతో.. చాలా మంది మహిళలకు రేషన్‌కార్డు లేకపోవడంతో ఈ పథకాన్ని పొందలేకపోతున్నారు. ఇక నెలకు 2500 రూపాయల ఆర్థిక సాయం పథకం కూడా అందరికి వర్తించదని తెలుస్తోంది.