Dharani
Gas Cylinder For Rs 500: ఆరు గ్యారెంటీల అమలు కోసం రేవంత్ సర్కారు ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఎంపికకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
Gas Cylinder For Rs 500: ఆరు గ్యారెంటీల అమలు కోసం రేవంత్ సర్కారు ముందడుగు వేస్తోంది. ఈ క్రమంలో రూ.500కే గ్యాస్ సిలిండర్.. ఎంపికకు సంబంధించి కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ వివరాలు..
Dharani
కాంగ్రెస్ ప్రభుత్వం.. ఎన్నికల వేళ ప్రకటించిన ఆరు గ్యారెంటీల అమలు కోసం తీవ్రంగా కృషి చేస్తోంది. ఇప్పటికే రెండు హామీలను అమల్లోకి తెచ్చింది. అంతేకాక అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోగా.. ఆరు గ్యారెంటీలను కచ్చితంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. ఇక ఆరు గ్యారెంటీలకు లబ్దిదారులను ఎంపిక చేయడం కేయడం కోసం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం. ప్రస్తుతం మిగతా గ్యారెంటీల అమలుకు మార్గదర్శాకాలు రెడీ చేసే పనిలో ఉంది. దీనిలో భాగంగా రూ. 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పథకాల అమలుకై తాజాగా నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా రూ.500కు వంటగ్యాస్ సిలిండర్ అందజేత పథకానికి దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఆ వివరాలు..
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ పథకం అర్హులును ఎంపిక చేయడం కోసం.. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో అంగన్‌వాడీలు, ఆశా కార్యకర్తల ద్వారా పరిశీలించనున్నారు. ఆ తర్వాత అర్హుల వివరాలను ప్రత్యేక మొబైల్ యాప్‌లో నమోదు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను తీసుకువెళ్లి.. వారి రేషన్‌కార్డు, ఎల్‌పీజీ కంపెనీ పేరు, వినియోగదారు నంబర్, పాస్‌బుక్ నెంబర్, డెలివరీ రసీదు నంబరు వంటి వివరాలను పరిశీలిస్తారు.
ఆ తర్వాత వారు 500లకే గ్యాస్ సిలిండర్ పొందేందుకు అర్హులని భావిస్తే.. వారికి సంబంధించి తెల్ల రేషన్‌కార్డు, ఎల్‌పీజీ కంపెనీ పేరు, వినియోగదారు సంఖ్య వంటి వివరాలను ప్రత్యేక యాప్‌లో నమోదు చేస్తారు. అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలకు గ్రామాలకు సంబంధించి పూర్తి స్థాయిలో అవగాహన ఉండటంతో అర్హుల ఎంపిక ప్రక్రియను వారికి అప్పగించింది సర్కార్. వారు ఓకే అన్న వారే ఈ పథకానికి అర్హులుగా ఎంపిక కానున్నారు.
రూ.500లకే గ్యాస్ సిలిండర్ పథకానికి అర్హులయ్యే వారి వివరాల నమోదు కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను నేడు అన్ని జిల్లాలకు పంపించనున్నారు. గ్రామ స్థాయిలో పంచాయతీ కార్యదర్శులు, మండలస్థాయిలో ఎంపీడీవోలు, ఎమ్మార్వోలు, జిల్లాస్థాయిలో కలెక్టర్లు ఈ యాప్ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తిస్తారు. రాష్ట్రస్థాయిలో రెవెన్యూ కార్యదర్శి, పౌరసరఫరాలు, జీహెచ్‌ఎంసీ కమిషనర్లు, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్ పరిశీలిస్తారు. పరిశీలన తర్వాత అర్హులను ఎంపిక చేసి.. వారికి మాత్రమే రూ. 500కే గ్యాస్ సిలిండర్ పథకాన్ని అమలు చేయనున్నారు.
అంతేకాక ఇటీవల తెలంగాణ కేబినెట్ 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించేందుకు తీసుకువచ్చిన గృహజ్యోతి పథకానికి కూడా ఆమోదం తెలిపింది. అంతేకాక ఈ ఉచిత విద్యుత్ ను అద్దెకు ఉండే వారికి కూడా ఇవ్వనున్నట్లు దక్షిణ తెలంగాణ డిస్కం వెల్లడించింది.